
నారదలోకం వీక్షకులకు
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు
ఇది మరో వార్తా ప్రపంచం. ఎక్కడా చూడని, మరెక్కడా చదవని లోగుట్టు వార్తల సమగ్ర వేదిక

తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.