Thursday, October 15, 2009

`వారాల' రోశయ్య! !

(ఆదివారంనాడు అరటి మొలిచింది...పాట స్టైల్ లో)
ఆదివారంనాడు ఆపద్ధర్మ సీఎం అయ్యాడు.

సోమవారం నాడు `పెద్దల'మాట జవదాటనన్నాడు.
మంగళవారంనాడు మనసుకే ఇష్టంలేదన్నాడు.
బుధవారంనాడు `బుద్ధి' జనులు పొగడగా ఉక్కిరిబిక్కిరైనాడు.
గురువారంనాడు గుళ్లూగోపురాలు తిరిగాడు.
శుక్రవారంనాడు తనంతవాడే లేడన్నాడు.
శనివారంనాడు `సీ'బ్లాక్ లోకి దూసుకెళ్ళిన రాజమార్తాండ!
చకచకా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చేస్తూ,
నమ్మినోళ్లకి దీపావళి బోనస్సులిచ్చేస్తూ,
చకచకా `వారాలు' నెట్టుకొస్తున్న
`శేఠ'య్యా, నీచతురత బహు భేషయ్యా.

- మన్నవ

3 comments:

  1. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే కడప గుండాల దెబ్బకు తట్టుకోగలడా? అయినా తనకు పడని జనాలను రాక్షసుడు లాగా ఒకపక్క లేపించేస్తూ, ఇంకోపక్క గాలిలో ముద్దులెట్టి దేముడయిన ఫ్యాక్షనిస్ట్ కంటే తెలివిగలవాడంటారా?

    ReplyDelete
  2. బాగుంది. కాకుంటే నాకు మాత్రం రోశయ్య తట్టుకోలేడేమో అనిపిస్తుంది. గతంలో కూడా అతను ఇరగ సాధించినవి ఏమీ లేవు. చూద్దాం ఎటు వెళ్తుందో.

    ReplyDelete
  3. Kaatiki kaaLLu japukunna thanani ila cheyaDam oka Congress kae chellimdi

    ReplyDelete