Friday, October 2, 2009

జగన్ ఫ్లెక్సీని చింపిందెవరు?

ఖమ్మం జిల్లాలో సోనియాగాంధీ, రేణుకా చౌదరి చిత్రాలను ముద్రించిన ఫ్లెక్సీని చింపేసింది రేణుకా చౌదరి వర్గీయులేనంటూ న్యూస్ ఛానెళ్లు ఊదరగొట్టాయి. అంటే తన చిత్రాన్ని తానే చింపుకుందని ఆ ఛానెళ్లు గట్టిగా వాదించాయి. అలా చేయడంతో జగనానుచరుల మీద పడిన మచ్చ తొలిగిపోతుందని భావించారు. ఈ సంఘటన జరిగి వారంకాకుండానే హైదరాబాద్ లో జగన్ ఫోటో ఫ్లెక్సీని చింపేసిన సంఘటన వెలుగుచూసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రంతో పాటుగా ఎంపీలు జగన్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ నేతల చిత్రాలున్న ఫ్లెక్సీని గోల్నాక అక్వా హోటల్ వద్ద చించేశారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే, కాచిగూడ, అంబర్ పేటలో కూడా జగన్ చిత్రాలున్న ఫ్లెక్సీని చించివేసినట్టు వార్తలొచ్చాయి. వీహెచ్ అనుచరులే ఈ దురాగతానికి పాల్పడ్డారని జగనానుచరులు వాదిస్తున్నారు. అయితే నారదలోకం సేకరించిన సమాచారం ప్రకారం, ఈ పని వీహెచ్ అనుచరులు చేయలేదు. అది కచ్చితంగా జగనానుచరుల పనే. ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి అనుచరులే రేణుక చిత్రపటాన్ని చింపేసినట్టు నమ్మే పక్షంలో నారదలోకం సేకరించిన ఈ సమాచారాన్ని కూడా మీరు నమ్మాల్సిందే. ఫ్లేక్సీలను చింపేసుకోవడం ద్వారా జగన్ కూడా రాజకీయ లబ్దిపొందాలనుకుంటున్నారట...నారాయణ..నారాయణ...

No comments:

Post a Comment