Friday, October 9, 2009

స్పెషల్: ఎటు వెళ్ళినా మనోళ్లే...!

ఈ భూమండలం మొత్తాన్ని `మనోళ్లు' ఆక్రమించినట్లే ఉన్నారు. ఎక్కడకు వెళ్ళినా ఎటుచూసినా ఎన్నారైలు కనబడుతున్నారు. ఆఫ్రికా ఆడవుల్లోకి వెళ్ళినా, బొలీవియా కొండలెక్కినా, చివరకు ఐస్ లాండ్ కు వెళ్ళినా మనోళ్లు కనబడుతుంటారు.
`మనవోళ్ళు మేథావులోయ్, ఎక్కడైనా బతికేయగలరు' అంటూ వెటకారం చేయాల్సిన పనేలేదు. నిజంగానే ప్రపంచంలోని 183 దేశాల్లోని 180 దేశాల్లో ఎన్నారైలు ఎంచక్కా జీవించేస్తున్నారు. అయితే మిగతా మూడింటి మాటేమిటంటారా... ఉత్తర కొరియా, పాకిస్తాన్, భూటాన్ దేశాల్లో మాత్రం మనవాళ్లు లేరని తేలింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మధ్యనే రాబట్టిన సమాచారం ప్రకారం అత్యధికంగా 17 లక్షల మంది ఎన్నారైలు సౌదీ అరేబియాలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో 14 లక్షల మంది, అమెరికాలో పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నారట.
పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న ద్వీపం Palauలో కూడా ముగ్గురు ఎన్నారైలు ఉన్నారు. ఈ ద్వీపానికి ఈమధ్యనే స్వాతంత్ర్యం వచ్చింది. అలాగే బొలీవియా పర్వతప్రాంతాల్లో మనవాళ్లు ఓ 20 మందిదాకా ఉన్నారు. గుజరాత్ కు చెందిన వ్యాపారులూ, తమిళనాడుకు చెందిన చెట్టినాడ్లు కొన్నివందల సంవత్సరాల కిందటే దూరదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. మీకో జోక్ గుర్తుకువచ్చే ఉంటుది. అమెరికావాళ్లు చంద్రమండలం మీద కాలుమోపిన తొలినాళ్లలో పేలిన జోక్ ఇది...
చంద్రుడిమీద అమెరికా వాళ్లు తిరగాడుతూ, తామే చంద్రుడిమీద ముందుగా కాలుమోపామని సంబరపడుతుంటే, అప్పుడక్కడకు `ఆఁ..:ఛాయ్, ఛాయ్...'అంటూ ' టీ అమ్ముకునే కేరళవాడు వచ్చాడట.
గ్లోబలైజేషన్ పుణ్యామా అని ఈ మధ్య మన భారతీయులు ఏ దేశంలోనైనా ఉద్యోగం చేయడానికి రెడీ అవుతుండటంతో ఏటా ఎన్నారైల సంఖ్య పెరిగిపోతున్నదట. ఇదీ సంగతి.
- రాజ్ (విజయవాడ ప్రతినిధి)

1 comment:

  1. పనిలో పని గా ఒక కుళ్ళు జోకు : నాసా వాళ్ళు మళ్ళీ చందురుడి మీద దిగీసరికీ మన కేరళా వాళ్ళు బిస్సులరీ బాటిళ్ళు (Water Made locally) అమ్మటానికి వస్తారేమో ! [courtesy : Madhavan Nair ?!?!]

    ReplyDelete