Friday, October 30, 2009

పాపం కొండా సురేఖ (పార్ట్ 1)

బంగారంలాంటి మంత్రి పదవిని తన ప్రియతమ దివంగతనేత వైఎస్సార్ మీద పెంచుకున్న అభిమానాన్ని లోకానికి చాటడంకోసం త్యాగం చేసిన ఘనత కొండా సురేఖదే. తన అభిమాననేత వైఎస్సార్ కుమారుడు జగన్ కు సీఎం పదవి ఇవ్వకుంటే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఇంతకుముందే పలుమార్లు బాహాటంగానే చెప్పన కొండా సురేఖ, ఇప్పుడు అన్నంతపనీ చేశారు. సత్యవాక్ పరిపాలన పట్ల గౌరవం ఉన్నవారంతా ఈచర్యను తప్పకుండా హర్షించాల్సిందే. కుళ్లిపోయిన రాజకీయకాసారంలో మాటమీద నిలబడేవాళ్లెవరుంటారు చెప్పండి ఒక్క కొండా సురేఖ తప్ప. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో కొండాసురేఖ పేరు త్యాగానికి మారుపేరుగా నిలిచిపోతుంది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మీడియా అభాండాలు వేయడం మానడంలేదే. కొండంత పదవిని మన కొండా దూదిపింజలా తీసిపారేసినా `కరడుగట్టిన' ఈ మీడియాకు కనికరం కరగలేదు. రెండు పత్రికలూ, కొన్ని టీవీ ఛానెళ్లు పనిగట్టుకుని, కులప్రాతిపదికన తనపై బురదచల్లారన్నదే సురేఖ ఉవాచ. ఇప్పుడు రాజీనామా చేసినా ఈ`కరడుగట్టిన మీడియా' మనసు మారలేదు. జగన్ కి చెప్పకుండా, పెద్దాయన కేవీపీ సూచన తీసుకోకుండా, ఆమాట కొస్తే ఇంటాయనకీ, పిల్లలకు కూడా చెప్పకుండా తాను నేరుగా, సూటిగా గవర్నర్ ని కలిసి ఆరుపేజీల రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే, అనితరసాధ్యంగా ఇంతటి త్యాగానికి సిద్ధపడితే- ఛీ...ఈ పాడు మీడియా మళ్ళీ కేజీలకొద్దీ బురద తీసుకొచ్చి తనపై చల్లుతుందా...ఇదేమన్నా బాగుందా..అంటూ పాపం కొండా సురేఖ కుమిలిపోవాల్సి వస్తున్నది.
కొండా సురేఖ సత్యాన్ని నమ్ముకుంది. అందుకే మాటలు మార్చకుండా అన్నమాటమీదనే నిలబడి రాజీనామా చేసింది. అయితే అంతమాత్రాన ఆమె పదవీత్యాగం వెనుక ఉన్న నిజాలు సమాధికావు. ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చాపకిందనీరులా ఎలా పాకుతుంటాయో చెప్పడానికి కొండా సురేఖ రాజీనామా ఉదంతం ఓ దష్ఠాంతం మాత్రమే. సురేఖ రాజీనామా వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ఈ వ్యవహారంపై రెండు వాదనలు వినవస్తున్నాయి.
1. అమాయకపు కోణం: దివంగత నేత వైఎస్సార్ పట్ల పెంచుకున్న విపరీతమైన అభిమానంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం భావోద్వేగపూరిత చర్య.
2. ఫ్యాక్షనిస్టు రాజకీయ కోణం: తేనెపూసిన కత్తి... చాపకిందనీరు...తడిగుడ్డతో గొంతులు కోయడం...వంటి పదాలు మీరు వినే ఉంటారు. అలాంటిదే ఫ్యాక్షనిస్టు రాజకీయం కూడా. కొండా సురేఖ ఇంతగా భావోద్వేగానికి గురికావడం వెనుక ఫ్యాక్షనిస్టు కుట్ర ఉన్నదన్నది రెండో వాదన.
అయితే, పైన చెప్పిన రెండు విడివిడి వాదనలు ఒక పాయింట్ దగ్గర మిళితమవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. పైకి చూడటానికి ఈ రెండూ విడివిడి వాదనలుగా కనిపిస్తున్నా ఒకచోట మమేకం అవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
( ఆవివరాలు తరువాయి భాగంలో)
- కణ్వస

6 comments:

  1. త్యాగశీలివమ్మా సురేఖా కరిగే కొవ్వొత్తివమ్మా!

    ReplyDelete
  2. Execellent comment blaagaagni gaaru.

    ReplyDelete
  3. I think konda surekha's political life is finished

    ReplyDelete
  4. what was her qualification to become a minister in the first place ?. hope the next episode will reveal some strange, unexpected and unbelievable
    news about her life and her travel to Rajbhavan.

    ReplyDelete
  5. what a shame, she does't resign for people who elected her to serve, but she is for only YSR family service. it s our bad to elect these people as our leaders.

    ReplyDelete