తెల్లషర్ట్ , తెల్లప్యాంట్ వేసుకుని ఫుల్ హ్యాండ్ చేతులను కాస్తంత పైకి ముడిచి, ఎడమచేతికి నల్లటి బెల్టున్న వాచీ పెట్టుకుని జగన్ అద్దం ముందు నిలబడి రాజకీయనేతగా తండ్రి వైఎస్సార్ స్టైల్ లో ప్రసంగపాఠాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు.
జగన్: ఏ ఒక్కరికీ నష్టం కలుగకుండా, ఏ ఒక్కరికీ కష్టం కలుగకుండా చూస్తానూ...
వ్యాపారి జగన్: (అద్దంలో సడన్ గా ప్రత్యక్షమై) ఏమిటీ స్టైల్.. నీ సొంత స్టైల్ ఏమైందీ...?
జగన్: (ఆశ్చర్యంగా) అరే, ఎవరు నువ్వు... నన్నే ప్రశ్నిస్తున్నావ్?
వ్యాపారి జగన్: నల్లప్యాంట్, తెల్లషర్ట్..చూస్తే తెలియడంలా.. నేను వ్యాపారి జగన్ ని.
జగన్: అయితే, నాలో ఉండాల్సినవాడివి, బయటకెందుకొచ్చావ్!
వ్యాపారి జగన్: నువ్, ఫుల్ టైమ్ రాజకీయనేతగా మారాలని శపథం చేస్తే నేను నీలో ఎలా ఉండగలను, అందుకే బయటకువచ్చేశా.
జగన్: పిచ్చివాడా, కోటి విద్యలూ కూటికొరకే. అసలు రాజకీయమే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాపారం. ఛాన్స్ వచ్చినప్పుడే చంకెక్కాలి. బూమ్ ఉన్నప్పుడే భూములు కొనాలి, సానుభూతి ఉన్నప్పుడే సీఎం అవ్వాలి. ఇదే జగన్ చెప్పే జీవిత సత్యం.
వ్యాపారి జగన్: అవునవును నాకీ `సత్యం' గురించి బాగానే తెలుసు.
Subscribe to:
Post Comments (Atom)
True!
ReplyDelete" బూమ్ ఉన్నప్పుడే భూములు కొనాలి, సానుభూతి ఉన్నప్పుడే సీఎం అవ్వాలి "
ReplyDeleteGood One
బాగుంటున్నాయి మీ సెటైర్లు
ReplyDelete