- ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి గాలి కరుణాకరరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధనరెడ్డి తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
- తమ వ్యాపారాలకు (ప్రధానంగా గనుల వ్యాపారానికి) ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డుతగులుతుండటంతో గాలిసోదరలు మండిపడుతున్నారు.
- గనుల నుంచి తరలించే ఇనుప ఖనిజం రవాణా విషయంలో యడ్యూరప్ప ఆంక్షలు పెట్టడంతో గాలిసోదరలకు కాలింది.
- ట్రక్కులపై రహదారి అభివృద్ధి సుంకం విధించడం వీరికి నచ్చలేదు. దీంతో కోట్లకు పడగలెత్తిన గాలిసోదరులు తిరుగుబాటుబావుటా ఎగురవేశారు.
- సరిగా, అదే సమయంలో `జగ'న్నాటకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవి కోసం జగన్ ఎంతగా ప్రయత్నించినా అధిష్ఠానం మాటవినలేదు. దీంతో జగన్, అతని వ్యాపార మిత్రులు గాలి సోదరులు కొత్త వ్యూహం రచించారు.
- ఈ వ్యూహం ప్రకారం, కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకువస్తే అధిష్ఠానం సంతృష్టి చెందుతుంది. కర్నాటకను కానుకగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్ ని ఆంధ్రప్రదేశ్ సీఎం చేయమని గాలిసోదరులు అధిష్ఠానాన్ని అడిగే అవకాశం వస్తుంది.
- ముఖ్యమంత్రిని మార్చాలన్న మొదటి వ్యూహాన్ని వెనక్కి తీసుకుని, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావన్న సరికొత్తవ్యూహం తెరపైకి వచ్చింది.
- ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలను తమ గుప్పెట్లో పెట్టుకున్న గాలిసోదరులు ఏకంగా బిజెపీ ప్రభుత్వాన్నే పడగొట్టి గత ఎన్నికల్లో 80 సీట్లు తెచ్చుకున్న కాంగ్రస్ కి సపోర్ట్ ఇచ్చేయాలనుకుంటున్నారు. తద్వారా తమ ప్రియతమ మిత్రుడు జగన్ ఏకైక కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నారు.
Wednesday, October 28, 2009
కర్నాటకలో `జగన్నాటకం'
కర్నాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం ఎదుర్కుంటున్న రాజకీయ సంక్షోభం వెనుక వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తం ఉన్నదని చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, ఇది నమ్మలేని నిజం. `నారదలోకం' సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
ilanti varu(jagan) CM ayte inka mana raashtram paristhithi emavutundo!!!!!!!!!!!!!!!
ReplyDelete