Thursday, October 8, 2009

రోశయ్యకు అండగా కేసీఆర్!

నిన్నమొన్నటిదాకా వైఎస్సార్ నీ, రోశయ్యను తిట్టిపోసిన కేసీఆర్ కు ఇప్పుడు lతాతయ్య పక్షానే నిలవాలనుకుంటున్నారు. వైఎస్సార్ కారణంగానే తన రాజకీయ వ్యూహాలకు దెబ్బతగిలిందన్న ప్రగాఢంగా నమ్ముతున్న కేసీఆర్ ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కు బద్ధ విరోధిగా మారిపోయారు. ఒక వేళ జగన్ అనుచరులుగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు తోక జాడించే పక్షంలో తన పక్షాన ఉన్న పది మంది ఎమ్మెల్యేలు (తెరాస ఎమ్మెల్యేలు) రోశయ్య పక్షాన నిలవడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ అధిష్ఠానాన్నీ, మరీ ముఖ్యంగా సోనియా మేడమ్ ను పొగడినట్టు సమాచారం అందింది.
రాష్ట్రంలో జగన్ సీఎం కావాలంటూ ఉద్యమం ఊపందుకోవడం, ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించడం, ఆపైన మంత్రులు కొందరు బహిరంగంగానే జగన్ కు సీఎం పదవి ఇవ్వకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదరించడంతో అధిష్ఠానం రోశయ్యకు రక్షణ కవచం తయారుచేసేపనిలో పడింది. ఒక వేళ రోశయ్య ప్రభుత్వం మైనార్టీలో పడితే, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే, అప్పుడు అటు పీఆర్పీ ఎమ్మెల్యేలను, ఇటు తెరాస ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతున్నట్టు తెలుసుకునే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియాను పొగడ్తలతో ముంచెత్తారు. అందుకే, రోశయ్యను మహాత్మాగాంధీతోనూ, పొట్టి శ్రీరాములతోనూ పోల్చారు.
కణ్వస

2 comments:

  1. పాక్షన్ రాజకీయాలు నడిపిన దేముడికంటే, ఆయన కొడుకు ఇంకా చాలా పెద్ద ముదురు, అంతకంటే దేముడుకు లేని ధనబలం గత అయిదు సంవత్సరాలుగా కండ బలంతో, అవనీతితో వెనకవేసుకొన్న వేల కోట్లు ఉండటంతో జగన్ ఇంకా డేంజర్, అందుకని దేముని బిడ్డను అనిచెప్పుకొనే, ఈ రాక్షసునికంటే, ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా మంచిదే అన్న భావమే రోశయ్యకు మద్దతు ఇవ్వటానికి కారణం అవ్వవచ్చు. తండ్రి శవం పక్కనే, శవరాజకీయాలు ఆడి సంతకాల డ్రామా మొదలెట్టిన దేముని బిడ్డకంటే ఇకెవ్వరయినా better ఎమో కదా, ఆ రకంగా ఆలోచిస్తే!!

    ReplyDelete
  2. ఒక ఫ్యాక్షనిస్టు ఒక గ్రామానికి ఆధిపత్యం వహించడం - అది చాలా సుపరిచిత దృశ్యం, కొంత ఫర్వాలేదు. కానీ మన ఖర్మకొద్దీ అతను ఏకంగా ఒక దేశమంత రాష్ట్రానికి ప్రభుత్వాధిపతిగా ఎదిగితే ? అప్పుడు ఏం జఱుగుతుందో కళ్ళారా చూశాం. ఒళ్ళారా అనుభవించాం. మళ్ళీ అదే తెలివితక్కువ ప్రయోగంతో తలగోక్కోవాలా తెలుగుప్రజలు ?

    -- తాడేపల్లి

    ReplyDelete