- వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు జగన్ కు ఇచ్చింది ఇవ్వగా కోట్లాది రూపాయలను అల్లుడు బ్రదర్ అనిల్ కు ఇచ్చారు.
- వైఎస్సార్ కొన్ని విషయాల్లో అల్లుడి మాటలనే విశ్వసించేవారు. ఆ సమయంలో జగన్ మాట వినేవారు కారు.
- వ్యాపార వ్యవహారాల్లో జగన్ కు మద్దతు ఇచ్చినా, రాజకీయ ఎత్తుగడల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చేవి. అలాంటి సమయాల్లోనే అల్లుడు అనిల్ దగ్గరయ్యేవారు.
- ప్రియమిత్రుడు కేవీపీ, అల్లుడు అనిల్ చెప్పిన మాటలు వినడంతో వైఎస్సార్ తన కుమారుడు జగన్ కు కొన్ని సందర్బాల్లో దూరం అయ్యారు.
- మతపరమైన వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బ్రదర్అనిల్ మామగారిని ఇట్టే ఆకర్షించుకున్నారు.
- వందలాది కోట్లు బ్రదర్ అనిల్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు.
- వైఎస్సార్ దుర్మరణంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా `శూన్యత' ఆవరించింది. (ఇది రాజకీయ శూన్యత కాదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శూన్యత)
- ఆ శూన్యత నుంచి విభేదాల చిచ్చు రగులుకుంది. అది చివరకు బావ, బావమరిదిల మధ్య అఘాతాలు సృష్టిస్తోంది.
- తండ్రి అప్పగించిన వందలాది కోట్లు ఇవ్వమంటూ జగన్ ఒత్తిడి తెచ్చారు. కేవీపీ చేత మధ్యవర్తిత్వం చేయించారు.
- కేవీపీ సౌమ్యంగా సాగించిన మధ్యవర్తిత్వం నచ్చకపోవడంతో జగన్ ఆ పెద్దాయన్ని కూడా పక్కనపెట్టారు.
- కుటంబవ్యవహారాలు చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటానికి దిగారు.
- తండ్రి మరణంతో తలెత్తిన ఈ ఆర్థిక సమస్యనుంచి ఎలా బయటపడాలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో... నారాయణ...నారాయణ...
ysr sampadana anta baga lekka katti chepparu mari babu sapadana yento lekka vesi cheppochu kada
ReplyDeleteచంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ ఆస్తుల విలువ ఎంతో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ మీద వేసిన అప్పుల భారం యాభై వేల కోట్లకి పైనే. వాడు అప్పుగా తెచ్చిన డబ్బులలో మంత్రులు ఎంత పంచుకున్నారు, MLAలు ఎంత పంచుకున్నారు, అధికారులు ఎంత పంచుకున్నారు, జన్మభూమి కాంట్రాక్టర్లు ఎంత పంచుకున్నారు, ఈ లెక్కలన్నీ తేలాల్సి ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద పన్నుల భారం వేసి దివాళా తియ్యించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో కూడా అంచనా వెయ్యాలి.
ReplyDeleteకొంప తీసి ఈ నారదుడు తెలుగు దేశం ఏజెంటేమో.
ReplyDelete