ఉన్నట్టుండి టివీ9 సీఈఓ రవిప్రకాష్ బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఫ్లాష్ వెలిగిందే తడువుగా స్కోల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయమంటూ ఆదేశించారు. ఇంతకీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే,
జగన్ కి పీసీసి పదవి... డిఎస్ కి ఉద్వాసన
ఆసక్తికరమైన న్యూస్ కావడంతో అంతా ఆసక్తిగా గమనించారు. మరికాసేపట్లో ఈ వార్తపై సమగ్ర కథనాన్ని కూడా టివీ9 ఇచ్చింది. ఆ కథనంలోని సారాంశమేమంటే, ఢిల్లీలో షకీల్ అహ్మద్ అనే కాంగ్రెస్ పెద్దాయన సదరు ఛానెల్ వారికి స్వయంగా చెప్పారట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవి నుంచి డి.శ్రీనివాస్ ని తొలగించి, ఆ స్థానాన్ని జగన్ తో భర్తీ చేస్తారట. షకీల్ అహ్మద్ స్వయంగా చెప్పారని అంటే అంతా నమ్మేస్తారన్నది ఆ టివీ ఛానెల్ వారి ప్రగాఢ నమ్మకం. అయితే, అంత`లావుపాటి' వార్త నిమిషాల్లో దూదిపింజలా వీగిపోయింది. అది నిజంకాదని తేలిపోయింది. ఈ వార్త కేవలం టివీ9 బుర్రలో పుట్టినదేనని అందరికీ తెలిసిపోయింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్ప మొయిలీ కూడా ఇదంతా మీడియా సృష్టేనంటూ తేల్చిచెప్పడంతో టివీ9 గతుక్కుమంది. ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక తికమకపడింది.
అసలు జగన్ కి పీసీసి పదవి అప్పగించాలన్న ఆలోచన టివీ9కి ఎందుకు వచ్చింది? అందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. అవి...
1. ఈమధ్య మీడియా మధ్య పోటీ పెరిగిపోవడంతో టివీ9 కలవరపడుతోంది. తన మొదటి స్థానాన్ని ఎక్కడ ఎవరు కొట్టేస్తారోనన్న దిగులు మొదలైంది. అందుకే మొన్నటి వరదలప్పుడు కర్నూలుని ముందుగానే ముంచేసింది. నిన్నటినిన్న హైదరాబాద్ నిమ్స్ లో నర్సులపై లైంగిక వేధింపులంటూ తప్పుడు వార్తను ప్రచారంచేసి చేయికాల్చుకుంది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు జగన్ కి పీసీసి పదవి అప్పగించింది. రేటింగ్ తగ్గిపోతుందేమోనన్న భయం ఆవహించినప్పుడల్లా రవిప్రకాష్ కి తన బుర్రలోనుంచి వార్తలు తీయడం అలవాటైపోయింది.
2. ఎలక్ట్రానిక్ మీడియాకే తాను మకుటంలేని మహారాజునని అనుకుంటున్న రవిప్రకాష్ ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ యవ శక్తి అవసరం ఉన్నదనే భావిస్తూ ఎంకరేజ్ చేస్తున్నది. 2014 ఎన్నికల వేళకు జగన్ కు గట్టిపోటీ ఇచ్చే `మగధీరుడి'గా రవిప్రకాష్ ను కీర్తించడంతో నిజంగానే తానంతటివాడినైపోయినట్టు కలలుకనడం రవిప్రకాష్ వంతైంది. పనిలోపనిగా జగన్ ని తన రాజకీయ శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. జగన్ కి సీఎం సీటు ఇవ్వకపోవడంతో కొంత శాంతించినా ఎప్పటికైనా జగన్ పైకి లేచి తనకు పోటీ అవుతాడన్న భయం లేకపోలేదు. జగన్ ను రాజకీయనేతగా పూర్తిగా అణిచివేయాలంటే మీడియా ద్వారా అందలం ఎక్కించడమే సరైన మార్గంగా భావించారు. పిసీసి పదవి జగన్ కి అప్పగిస్తున్నారంటూ వార్త ఇవ్వడంలో అసలు ఉద్దేశం జగన్ కు మేలు చేయాలని కాదు. ఆ యువరాజకీయ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే. పైకి జగన్ కి ఫేవర్ గా అనిపించే ఈ వార్తలో అసలు లోగుట్టు, అతనికి కీడు చేయడమే. ఈ రాజకీయ డ్రామాకు రవిప్రకాష్ తన మీడియాను ఆయుధంగా వాడుకున్నాడని చెప్పుకుంటున్నారు.
మరి ఇందులో ఏది నిజం...నారాయణ...నారాయణ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment