Tuesday, October 20, 2009

కేవీపీని టార్గెట్ చేసిన `సాక్షి'

`కూలింది కుట్రతోనే?' అంటూ అక్టోబర్ 19 (సోమవారం) సంచలన కథనాన్ని ప్రచురించిన `సాక్షి' దినపత్రిక మర్నాడు (20వ తేదీ మంగళవారం) మరో కథనంతో ముందుకొచ్చింది. ఈసారి `అగస్టా ఎందుకు రాలేదు'? అంటూ పాఠకుల్ని ప్రశ్నించింది. మొదటి రోజు ప్రశ్నతోనే బిత్తరపోయిన పాఠకుడు, మర్నాడు మరో ప్రశ్న రావడంతో అవాక్కయ్యాడు. ఇంతకీ జగన్ పెట్టుకుంది న్యూస్ పేపరో, `కొశ్చిన్ పేపరో' తెలియక జుట్టుపీక్కున్నాడు. రెండున్నర రూపాయలుపెట్టి కొనుక్కున్న పేపర్ కావడంతో పాఠకుడు గతిలేక చదవడం మొదలుపెట్టాడు. ఈ `అగస్టా' ఏమిటీ, అది ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారో తెలుసుకుందామని మ్యాటర్ లోకి వెళితే, సాక్షి `అంతరంగం' ఆవిష్కృతమైంది. ఆ వివరాలు...
హెలికాప్టర్ కూలడానికి ముందే అధికారులు అంతులేని నిర్లక్ష్యం వహించారు.
(బాగానే ఉంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సారే ఉన్నతాధికారులను దగ్గరుండి నియమించుకున్నారు. కాకుంటే ఆయన ప్రియమిత్రుడు కేవీపీ సలహామేరకు ఆ పని చేశారు. అధికారుల నిర్లక్ష్యం అని ఇప్పుడు సాక్షి అక్కసు వెళ్లగక్కితే అది ఎవరికి తగులుతుంది...దివంగత నేతకా, లేక కేవీపీకా..? తండ్రిమీద బురదజల్లలేడు కనుక జగన్ తన `పేపర్ రాకెట్' ను కేవీపీ `అంకుల్'పై గురిపెట్టాడు. ఢిల్లీలో తన పని కేవీపీ చక్కపెట్టలేకపోయాడన్న అక్కసే అక్షరాల రూపంలో కనబడుతున్నట్టుంది)
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ ఉండగా బెల్ 430ని ఎందుకు వినియోగించారు?
(ఎవరు వినియోగించారో కూడా చెబితే బాగుండేది. (అసలు ఉద్దేశం ఏమంటే, ప్రజా భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న కేవీపీదే తప్పు అని చెప్పడమే. ఆయన్నే టార్గెట్ చేయడం.)
వైఎస్ ని ఎక్కించుకోవడానికి ముందు బెల్ 430 విమానం బేగంపేట విమానాశ్రయంలోనే అరకొర భద్రత ఏర్పాట్ల మధ్యనే పడిఉంది.
(బేగంపేట విమానాశ్రయాన్ని పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రపోయారన్నదే దీని భావం. మళ్ళీ ఇక్కడా కేవీపీపైనే `సాక్షి' గురిపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది)
ఇలాంటి కొశ్చిన్ మార్కులతో, అస్పష్టంగా ఏదో కుట్రజరిగిందన్న ఆలోచనలతో పుంఖానుఫుంఖాలుగా వార్తా కథనాలను ప్రచురించడంతో సాక్షి ఏ లక్ష్యాలను చేరుకుంటుందో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కేవీపీ, రేపు రోశయ్య, ఎల్లుండి మరో పుల్లయ్య...ఇలా ఒక దుర్ఘటనపై బురదజల్లుకుంటూ పోతుంటే చివరకు జనం ఆ పేపర్నీ, దాని యాజమాన్యాన్ని నిలదీస్తారు. ఉన్నతాధికారులందర్నీ వైఎస్సారే స్వయంగా తెచ్చి తనపక్కన పెట్టుకున్నప్పుడు ఇక ఎవర్ని నిందించి ఏం లాభం. పైగా వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీ దుర్ఘటన అనంతరం జగన్ సీఎం కావాలని తపించారు. తనకు తోచిన సలహాలు చెప్పారు. అయినా జగన్ వర్గీయులు నానాయాగీ చేస్తుండటంతో ఆ పెద్దాయన మౌనవ్రతంబూనారు. అదే సమయంలో ఇటు జగన్ వర్గీయులు కేవీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే `అగస్టా ఎందుకు రాలేదు?' అంటూ `సాక్షి' మరో అనుమానాస్త్రం సంధించడం.
-కణ్వస

8 comments:

  1. రాజశేఖర రెడ్డి అభిమానులకి గడ్డి పెట్టే వార్తలు వ్రాస్తున్నందుకు థాంక్స్. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నేను, కెక్యూబ్ వర్మ గారు తప్ప మిగిలిన బ్లాగర్లందరూ రాజశేఖర రెడ్డిని పొగిడారు. ఇప్పుడు వాళ్ళే నాలుక కరుచుకుంటున్నారు.

    ReplyDelete
  2. ఆ "అందఱి"లో నేను లేనని మనవి.

    ReplyDelete
  3. క్షమించాలి. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెపుతారని నేను మరచిపోయాను. యాసిడ్ దాడుల విషయంలో కూడా మీరు సూటిగా మాట్లాడడం వల్ల నాకు మీ గురించి కొంత వరకు అర్థమయ్యింది.

    ReplyDelete
  4. buchiki buchiki analysis

    ReplyDelete
  5. ivanni KVP interest lone jaruguthunnayi, KVP ki publicity unna lekunna okate ...aayanani vadilinchukonnatlu chepthe janam nammutharani :)

    ReplyDelete
  6. ప్రవీన్ శర్మ నువ్వు పిచ్చి మా(వో)లోకం లో ఉన్నావు.

    ReplyDelete
  7. ప్రవీణ్ శర్మ గారు , మీ ఇంటి పేరు తాడేపల్లి కాదు కదా !

    ReplyDelete
  8. ఎంత చెట్టుకి అంత గాలి .. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ .. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు ..

    ReplyDelete