Monday, October 19, 2009

కుట్ర గుట్టు ముందుగా విప్పిన నారదలోకం

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగినట్టు సాక్షి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనానికి నారదలోకం స్పందిస్తూ -సాక్షిరాసింది కుట్రతోనే? అంటూ విశ్లేషణాత్మక కథనాన్ని సోమవారం ఉదయంమే అందించాం. ఎలక్ట్రానిక్ మీడియా (ముఖ్యంగా టీవీ ఛానెళ్లు) పెరిగిన ఈ రోజుల్లో కూడా వెంటనే సాక్షిలో ఉద్దేశపూర్వకంగా వచ్చిన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తలు రాలేదు. అన్నింటికంటే ముందుగా నారదలోకం బ్లాగ్ స్పందించింది. ఆ తరువాత రాత్రి ఏడున్నరగంటలకు కుట్ర సిద్ధాంతమంటూ టివీ-- 9లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఎఐసిసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కూడా హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న వార్తా కథనాన్ని ఖండించారు. ఇలాంటి ఉహాజనత వార్తలను ఇవ్వకూడదంటూ హితవుపలికారు.
నిన్నకాక మొన్న (విజయదశమినాడు) జన్మించిన నారదలోకం న్యూస్ బ్లాగ్ నదురుబెదురులేకుండా మొత్తం మీడియాలో కెల్లా ముందుగా సాక్షి రాసింది కుట్రతోనే అంటూ కథనం ఇవ్వడాన్ని పాఠకులు ఈ పాటికి గమనించే ఉంటారు. నారదలోకం సాహసోపేతమైన కథనాలకు వెనుక ఉన్న బలం పాఠకులే. ఇక ముందు కూడా వాస్తవకోణాలను ఆవిష్కరించడంలో ముందే ఉంటామని హామీ ఇస్తూ...
- ఎడిటర్

7 comments:

  1. కణ్వస గారు,
    మీ గురించి మా బ్లాగు లోకానికి మీ వివరాలు తెలుపుతారా? పూటకు ఒక టపా ప్రచూరిస్తున్నారు/రాస్తున్నారు కదా మీకు సమాధానం ఇవ్వటానికి గల అభ్యంతరం ఏమిటి? లేక మీ బ్లాగులో పాఠకులు అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వరా?

    ReplyDelete
  2. "నిన్నకాక మొన్న (విజయదశమినాడు) జన్మించిన నారదలోకం న్యూస్ బ్లాగ్ నదురుబెదురులేకుండా మొత్తం మీడియాలో కెల్లా ముందుగా సాక్షి రాసింది కుట్రతోనే అంటూ కథనం ఇవ్వడాన్ని పాఠకులు ఈ పాటికి గమనించే ఉంటారు."

    అవునండి, అదే పాఠకులు జగన్ వ్యక్తి కాదు శక్తి అని బాకా ముందు అందరికంటే ఎవరు ఊదింది కూడా గమనిస్తునే ఉంటారు. దానికితోడు బ్లాగ్లలో సొంత డబ్బాలు కొట్టుకోవటం అంత గొప్పగా రాణించదు అని మీరే ఇంకా గమనించినట్లు లేరు :)

    ReplyDelete
  3. రాష్ట్రం ఏమైనా రాజశేఖర రెడ్డి ఫామిలీకి ప్రైవేట్ జాగీరా? జగన్ ముఖ్యమంత్రి అయితే నేను కాషాయం కట్టి, త్రిదండం పట్టుకుని, హిమాలయాలకి వెళ్ళి వైరాగ్యం స్వీకరిస్తాను.

    ReplyDelete
  4. అయ్యా మీరు ఎర్ర పార్టీ వాళ్ళు కాషాయం ఎందుకు... కాషాయం మతతత్వం కదా ! ప్రజల కోసం శ్రమించే వారు ప్రజల మధ్యలో ఉండాలి కాని హిమాలయాలకు ఎందుకు ? స్త్రీ జనోద్దరణకు నడుంకట్టిన వారు ఇలా అస్త్ర సన్యాసం చేస్తే ఎలా ?

    ReplyDelete
  5. ఒక భౌతికవాది భావవాదిలాగ కాషాయం కడితే అది ఓటమికి సింబలే కదా. జగన్ గెలిస్తే ప్రజలు ఓడిపోయినట్టే కదా. నేను బతికి ఉండగా కాషాయం కట్టడం జరగదులే.

    ReplyDelete
  6. naradalokam gaaru,

    eeblog lo Praveen Sarma matrame commenting ante, meeru vrasevi yematram vilava lenivi ani ardham..inka meerE 'Praveen Sarma' ayyundochu :)

    ReplyDelete
  7. ఏమీ ఫర్వాలేదు. ఇతను జగన్ కి వ్యతిరేకంగా వ్రాయడం మానేస్తే నేను http://stalin-mao.net బ్లాగ్ లో జగన్ కి వ్యతిరేకంగా వ్రాయగలను. ఇంతకు ముందు మీరు ఓ స్త్రీవాద కథకి వ్యతిరేకంగా వాదిస్తే నేను కొత్తగా రచయిత అవతారం ఎత్తి చెరసాల, వైరాగ్యంతో పాటు మరి కొన్ని స్త్రీవాద కథలు వ్రాసి పురుషవాదుల్ని ఓడించాను.

    ReplyDelete