Sunday, October 4, 2009

ఫోకస్: డ్యామ్ లు కూల్చేసిన మీడియా!

 ఈ వార్త వినడానికి కాస్తంత ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ మన మీడియాకు ఉన్న `అతి' జబ్బుతో క్షేమంగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ లు కూలిపోయాయి. శుక్రవారం (అక్టోబర్ 2) ఒకటి రెండు టివీ ఛానెళ్లు చేసిన హడావుడి అంతాఇంతాకాదు. సంచలవార్తలు ఇవ్వందే పొద్దుగడవని ఏక సంఖ్య ఛానెల్, చీపురుపుల్లలా ఓ ఇంగ్లీష్ అక్షరాన్ని తగిలించుకున్న మరో ఛానెల్ మరీ పట్రేగిపోయాయి. జర్నలిస్ట్ ఎథిక్స్ ను నిలువునా సమాధి చేశాయి. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరద వార్తలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామన్న పేరుతో నోటికొచ్చిన వార్తలు చెప్పేశారు. ఆ దిక్కుమాలిన వార్తలను నిజం అని నమ్మేసిన కోట్లాది మంది గుండెలు అవిసిపోయాయి. సెప్టెంబర్ రెండున వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదమప్పుడు ఎంతగా రెచ్చిపోయారో అంతకంటే ఎక్కువగానే ఈసారి పెట్రేగిపోయాయి ఛానెళ్లు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
  •  శ్రీశైలం ఆనకట్టు కూలిపోయింది. (ఒక ఛానెల్ లో వచ్చిన వార్త ఇది. అదే సమయానికి మరో ఛానెల్ రిపోర్టర్ శ్రీశైలం ఆనకట్టమీద నుంచే లైవ్ ఇస్తున్నాడు. మరి కూలితే ఇతగాడు ఎలా లైవ్ ఇవ్వగలిగాడు! మరో సత్యం వెలుగుచూసింది. ఇంతకాలం టెర్రరిస్టులే డ్యామ్ లు కూలుస్తారమోనని భయపడుతున్నాం, కానీ నిజం ఏమంటే, ఆ పని జర్నలిస్టులు కూడా చేయగలరు)
  •  నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కూలడానికి సిద్ధంగా ఉంది (పోటీగా మరో ఛానెల్ ఇచ్చిన వార్త)
  •  కర్నూలంతా శ్మశాన నిశ్శబ్దం ఉంది (ఒక రిపోర్టర్ మైక్ ముందు పలికిన ప్రేలాపన. మరి ఇతగాడ్ని ఏ ప్రేతాత్మ ఆవహించిందో ఏమో...)
  •  కర్నూలులో భూమి కంపించింది. వంద ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి. (నిజానికి ఇళ్లు కూలింది వరదలకేగానీ భూమి కంపించి కాదు. అలాగే రోడ్లు బీటలుబారడం వరదలప్పుడు కూడా సహజంగా కనిపించే దృశ్యమే. సదరు రిపోర్టర్ కు ఈ రెంటి మధ్య వ్యత్యాసం తెలియలేదు.)
  • ప్రముఖ వార్తా ఛానెల్ యాంకర్ వ్యాఖ్యలివి: `ఇది కాళరాత్రి. కర్నూలు రాత్రి పన్నెండు గంటల తరువాత ఏ క్షణంలోనైనా మునిగిపోవచ్చు. అక్కడ కరెంట్ కూడా లేదు. మా టివీ ఛానెల్ చూసే అవకాశం లేదు. (ఇది ఇతగాడి బాధ) కర్నూలు ఉండే మీ మిత్రులకు చెప్పండి. ఇళ్లు విడిచి, ఊరు విడిచి వెళ్లమనండి. ఇది కాళరాత్రి...రాత్రి పన్నెండు గంటలకు...' (తమ ఛానెల్ మెరుగైన సమాజం కోసమంటూ పదేపదే చెప్పుకునే ఈ ఛానెల్ ఆ రాత్రి భయపెట్టే వార్తలతో యావత్ సమాజం భయంతో వణికిపోయేలా చేసింది. మరి దీన్ని ఏ తరహా సేవ విజ్ఞులే తేల్చాలి.
  •  `మీ దగ్గర టైర్లు, ట్యూబ్ లు ఉంటే, వరద బాధితులకు ఇవ్వండి' మరో సందేశం. మనమంతా ఇళ్లలో టైర్లూ, ట్యూబ్ లు పెట్టుకుని కూర్చున్నట్టు ఏమిటా వాగుడు. ఈ ప్రేలాపనల్లోని అసలు నిజం ఏమంటే, ఈ మధ్యనే పుట్టుకొచ్చన  `పుల్ల' ఛానెల్ పెట్రేగిపోవడంతో వెనకపడిపోతామన్న దిగులుతో ఈ ప్రముఖ ఛానెల్ సమాజసేవ ముసుగులో `బీభత్స నాటకాని'కి తెరలేపింది. నారాయణ...నారాయణ...

4 comments:

  1. పుల్ల చానెల్ అర్థం కాలేదు. ఐ న్యూస్ అయితే మాత్రం ఉన్నోళ్లలో వీడే కొద్దిగా మెరుగ్గా కవర్ చేసినట్టున్నాడు. (మాకు ఈటీవి2 రాదు)
    కానీ మన వాళ్ల కవరేజి మాత్రం పరమ నీకృష్టంగా ఉంది. ఏ చానల్, గంట చూసినా అసలు దృష్యం పూర్తిగా అర్థం కాలేదు. ఆ క్షణంలో వివేచన లేని విప్లవాత్మక వార్త ఇస్తే చాలు అన్నట్టున్నది వాళ్ల ఉద్దేశ్యం.

    ReplyDelete
  2. నిన్న టీవీ9 వాడు....వరద పరిస్తితి చూపిస్తూ బ్యాక్గ్రవుండులో "టైటానిక్" మ్యూసిక్ వినిపించాడు .. పిచ్చెక్కి పోయింది

    ReplyDelete
  3. దురదృష్టకరం. మీదియా అతి ధోరణి శోచనీయం. ఏదో చిన్న పిల్లాడు ఒక బూచిని చూసి భయంతో పరుగెత్తుకొచ్చి చెప్పినట్లు రిపొర్టర్లు వాళ్ళ "కథనాలు" వినిపిస్తున్నారు. తరువాత వార్తలు చూపిస్తూ సంగీతం ఎందుకు వెయ్యాలి? ఆ విధంగా భయం పుట్టించేట్టుగా సంగీతాన్ని జోడించటాన్ని పూర్తిగా నిషేధించాలి.

    ఆ తరువాత చూపించే బొమ్మలు అన్ని కూడ వాటికి ఒక పక్కన ఎప్పుడు షూట్ చేసారు, ఎక్కడది అన్న విషయం సదా చూపించాలి. వీళ్ళు లైబ్రరీ షాట్లా లేక నిజంగా తీసినవా తెలియదు.

    ReplyDelete
  4. nenu tv9 matuku choostuntaanu... maaku inkoka channel chosey avakasamledu. kaani tv9 comments chala ascharya karamga vunnai.. mukyam ga ravi prakash.. maatladey dhorani ardham kaavatam ledu.. latest statement by tv9 about factionaism is very much surprising. tv9 should not make such contraversial statements

    ReplyDelete