Saturday, October 31, 2009

ఎడిటర్స్ వాయిస్: తెలుగుతల్లి కంటనీరు

తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.
ఆయనలాజిక్ అయినది. అయితే, ఓ చిన్న వాస్తవాన్ని మరిచిపోతున్నట్టున్నారు ఈ మేథావులంతా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ...ఏ ప్రాంతంలోని వారైనా మాట్లాడేది తెలుగే అయినప్పుడు, వారి మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగుతల్లిని అగౌరవపరచడంలో అర్థంలేదు. మరో విషయమేమంటే, తెలుగుతల్లిని తెలంగాణ తల్లితో పోల్చకూడదు. తెలుగుతల్లి భాషకు ప్రతీక. తెలంగాణ తల్లి ప్రాంతానికి ప్రతీక. అలాంటప్పుడు ఈ రెంటినీ కలిపేసి విబేధాలు సృష్టించి లేతమనసుల్లో విషం ఎక్కించడం మంచిదేనా?
అవాంఛనీయమైన ఇలాంటి వ్యాఖ్యలవల్ల తెలుగుతల్లి కంటనీరు పెడుతున్నది. ఇది అత్యంత శోచనీయం. ఈ సమస్యను మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయడం మంచిది.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నారదలోకం ఆహ్వానిస్తోంది. చర్చలో పాల్గొనండి. సమస్య పరిష్కారానికి ఓ చక్కటి సలహా ఇవ్వండి.
(ఈ వ్యాసానికి సూచనలు ఇస్తున్న పాఠక మిత్రులకు ధన్యవాదాలు)
- ఎడిటర్

11 comments:

  1. నిన్న ఏదో ఛానెల్ లో తెలంగాణా అభిమాని మంచి పాయింటు లేవనెత్తాడు.

    పిల్లల తెలుగు వాచకంలో మొదటి పాఠం:
    ఏనుగు ఎక్కి మనము ఎక్కడికి వెళదాము..ఏనుగు ఎక్కి మనము ఏలూరు వెళదాము.
    ఒంటె ఎక్కి మనము ఎక్కడికి వెళదాము..ఒంటె ఎక్కి మనము ఒంగోలు వెళదాము.


    ఏమండీ, ఒంటె/ఏనుగు ఎక్కి కరీం నగర్ లేదా అదిలాబాద్ వెళ్ళ కూడదా?

    ReplyDelete
  2. asalu ongolu ki onte lena pululu simhaalu raava???

    ReplyDelete
  3. naa abhipraayam ikkada...

    http://telugabbai.wordpress.com/2009/10/31/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B0%A8%E0%B1%87-%E0%B0%B5/

    ReplyDelete
  4. భాష కి యాసకి కూడా తేడ తెలియకుండా మాట్లాడుతున్నారు కొందరు.
    తెలంగాణా ని తెలుగు కాదు అనుకోవడం సిగ్గు చేటు.

    ReplyDelete
  5. దీని గురించి చర్చ అనవసరం.
    ౧)తెలుగును గౌరవించడానికీ మా తెలుగు తల్లి పాడటానికి ఉన్న సంబంధం స్వల్పం. మంత్రి చాలా బాగా సమస్యను పక్కదోవపట్టించారు.(ఇవాళ ఈనాడు సంపాదకీయ పేజీలో వ్యంగ్యకథనం చదవండి). ఇక తెలంగాణా వాళ్ళు దేన్నో ఒకదాన్ని వ్యతిరేకించడమే ఉద్యమం అనుకుంటున్నారు.
    ౨)ఆ తెలంగాణాకవి ఆవేశాన్ని, ఆక్రోశాన్ని నేను కూడా విన్నాను. ఆయన మాట్లాడినందా, ఆయన చెప్తున్న కోస్తా తెలుగులోనే మాట్లాడినట్లు అనిపించింది.దాశరధి, సినారె, పుటపర్తి రచనలు తెలంగాణా తెలుగా? కోస్తా తెలుగా? వాళ్ళను ఆ భాషలోనే వ్రాయమని ఎవరైనా బలవంతపెట్టారా? ఇవాళ మనమంతా ఉపాధికోసం ఇంగ్లీషు వాడుతున్నట్లే వాళ్ళుకూడా వాడారేమో?
    ౩)మీరు చెప్పినట్లు తెలుగుతల్లి వేరు, తెలంగాణా తల్లి వేరు అని కొద్దిగా తర్కం ఉన్నవాళ్ళకెవరికైనా తెలుస్తుంది. ఆ మాటకొస్తే ఆ తెలుగు తల్లి తెలంగాణా తల్లే అయిఉండాలి. తెలంగాణా అనే పేరు తెలుగు అనే పదం నుంచే కదా వచ్చింది.
    ఆయన మాట్లాడిన మాటల్లో చాలా అసమంజసమైనవి ఉన్నాయి. ఆ పాటలో గోదారి, కృష్ణమ్మ కదిలిపోతున్నాయని(తెలంగాణాకు ఉపయోగపడకుండా)అనే కదా ఉంది. ఇది వాళ్ళకి చాలా అవసరమైన పాయింటు కదా.
    అసలు ఈ సమస్యంతా అన్ని సమస్యల్లాగే దారేపోయేవాడి ముందు టి.వి. నైన్ గొట్టాం పెట్టడంతో వచ్చింది.

    ReplyDelete
  6. ఇంతకు మొందు నే "తెలుగబ్బాయి" లో రాసిన కామెంట్

    భాగ్యనగరం లో మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడే లేకపోతే ఈ టాపిక్ వచ్చేదంటారా?
    మౌళిక వసతులు, కిలో 50 రూపాలవబోయే బియ్యం ధర, ఇట్లాంటివి సామాన్యుడికి గుర్తు రాకుండా వుండాలంటే చాలా బాగా పనికొస్తాయి ఈ విషయాలు. వలలోకి లాగారు, మనం పడుతున్నాం.
    అసలు సమస్యలను గూర్చి నిలదీయకూడదనే అందరూ కలిసి ఆడుతున్న నాటకం.
    కానివ్వండి మహాప్రభో! కానివ్వండి

    ReplyDelete
  7. తెలుగు తల్లి ఇప్పుడు కన్నీరు పెట్టడమేమిటి?
    ఒకప్రాంతాన్ని మాయ మాటలతో , దగాకోరు ఒప్పందాలతో వంచించి.... తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అట్టహాసంగా అవతరించి....55 సంవత్సరాలు అవుతున్నా.... కనీసం తెలుగు ను అధికార భాషగా చేయలేక పోయిన ..... తెలుగు ప్రజలను ఇంకా ఇంగ్లీషు జీవోలతో పాలిస్తున్న .... చేతగాని తెలుగు పాలకులను చూసి ఏడ్చి ఏడ్చి ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడో అడుగంటిపోయాయి.

    ఆహా హట్టాత్తుగా ఏమి భాషాభిమానం...... మనది ఎంత గొప్ప భాషా ప్రయుక్త రాష్ట్రమో కదా ...!!

    "తమిళ తల్లి" అనే ఊహాజనిత భావన sentiment లేకపోయినా తమిళనాడు పరిస్థితిన ఒక్కసారి గమనించండి. మనకు ఎందుకీ దిక్కుమాలిన వెధవ సెంటిమెంట్లు , దొంగ ఏడ్పులు.???

    రాజకీయ దురుద్దేశాలతో, విషపూరిత పన్నాగాలతో మా తెలుగు తల్లికీ మల్లెపూదండా పాటను . .. దాంతో పాటు తెలుగు తల్లి సెంటిమెంటును నడివీధిలో నిలబెట్టి మన పాలకులు మరో వంచనకు తెరతీస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇదంతా తెలుగు మీద వల్లమాలిన భక్తి అని అమాయకులు కూడా అనుకోరు.
    మరీ ముఖ్యంగా ... ఇప్పటికే అనేక దుర్మార్గాలను చవిచూసి బెజారైపోయి వున్న తెలంగాణా ప్రజలు అస్సలు నమ్మరు.

    ఇదే అంశం పై తెలుగబ్బాయి (http://telugabbai.wordpress.com/) కూడా ఒక టపా రాసారు. వేరు వేరు గా చర్చించడం వాళ్ళ సమగ్రత లోపిస్తుందేమో . అక్కడ నేను చేసిన కామెంటు ను తిరిగి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
    >>>

    తెలుగు తల్లి భావన (ఆంద్ర రాయలసీమల్లోని) తెలుగు వాళ్ళనందరినీ ఒక్క తాటికిన్డకు తెచ్చేందుకు …
    మదరాసీలుగా తమ ఉనికిని కోల్పోతున్న తెలుగు వాళ్ళని తట్టి లేపెందుకు, సమైక్య పరిచేందుకు సృష్టించినది.
    ఆ క్రమం లోనే "మా తెలుగు తల్లి" పాట ఆవిర్భవించింది.
    ఎన్టీరామారావు ధిల్లీ పెత్తనం కింద నలిగి పోతున్న తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుద్దరింప చేసేందుకు మరో సారి ఆ పాటను జమ్మి చెట్టు మీద నుంచి కిందకు దింపి వాడారు.

    ఇప్పుడు ఆ దగుల్భాజీ సమైక్యతను, భాష పేరిట జరిగిన వంచనను, మోసాన్ని తెలంగాణా ప్రజలు తీవ్రంగా ఏవ గించు కుంటున్నారు . ఆ క్రమంలో … ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగుతున్న ప్రస్తుత దశలో … తెలంగాణా ప్రజలు మా తెలుగు తల్లి పాటను మీ మాదిరిగా పరవశించి పోతూ ఎట్లా పాడగలరు మీరే చెప్పండి.
    పాడినా అర్ధం వుంటుందా.??
    ఆత్మ వంచన కాదా??
    కాబట్టి ఇప్పుడు ఆ పాటని ప్రత్యెక తెలంగాణా కోరుకొని వాళ్లైనా పాడాలి లేదా మీరు అభివర్నించినట్టు స్టుపిడ్, మూర్ఖ , దమాఖ్ లేని తెలంగాణా పెంట మనుషులైనా పాడాలి

    నా మాట్టుకు నాకు మొదట్లో ఆ పాట మీద పెద్దగా వ్యతిరేకత లేదు. టంగుటూరి సూర్యకుమారి గాత్రాన్ని నేను కూడా నిన్నటి వరకూ పరవశంగా విన్న వాడినే! పాడుకున్న వాడినే!! ఇప్పుడు మాత్రం పాడలేను…. పరవశించలేను. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మీతో కలిసి పాడమంటే మాత్రం తప్పక పాడతా !
    అట్లాగే మీరు కూడా అప్పటివరకు, లేదా ఇప్పటికైనా మచ్చుకు కొన్ని తెలంగాణా పాటలను, బతుకమ్మ పాటలను నేర్చుకోండి. మీ ఆడపడచులచేత బతుకమ్మ పాటలు పాడించండి. బతుకమ్మ పండుగ మీ ప్రాంతం లో కూడా జరుపుకోండి.

    ఇంకొక్క మాట.
    వందే మాతరం అన్న పాటలో తప్పేం వుందండి?.
    అందులో బ్రిటీష్ వాణ్ని అవహేళన చేసే మాటలు ఏమున్నాయి ?
    అయినా బ్రిటీష్ వాడు ఆ మాట వినపడితే చాలు ఎందుకు శివాలెత్తి పోయాడు. అది భారతీయులలో ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపోదిస్తుందనే కదా.
    అట్లాగే ఇప్పుడు తెలుగు తల్లి పాట పేరిట దొడ్డి దారిన అన్యాయానికి పర్యాయపదంగా మారిన సమైక్యతను చొప్పించా లని అనుకుంటున్నారు. అందుకే మేం ఆ పాటను అంతే గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.
    మా ఆవేదను అర్థం చేసుకుంటారో …. మీ సహజ ధోరణితో అవహేళన చేస్తారో మీ ఇష్టం.

    ఆ పాట తోనే తెలుగు ఉద్ధరించ బడుతుంది, ఆ పాట తోనే తెలుగు అమలు ఐ పోయినట్టే అనడం అంత ఆత్మ వంచన, పర వంచన మరొకటి లేదు.
    జై తెలంగాణా !

    ReplyDelete
  8. నిన్న TV9 -- లో తెలుగు తల్లి చర్చ చూసాను , ఒక ఉపాధ్యాయ వృత్తిలో వున్నా శ్రీనివాస్ తెలుగు వేరు తెలంగాణా వేరు అని చెప్పటం ఎంతో బాధాకరం గ అనిపించింది .
    రాజకీయ లబ్ది తో మాట్లాడే రాజకీయ నాయకులకు ఆ ఉపాధ్యాయుడి కి వున్నా తేడ ఏమిటి అని అర్ధం కాలేదు. ఆయన ఆ వృత్తిలో వుండి కచ్చితం గ భావితరాల వారికి విషపు బీజాలు నాటుతున్నారు. ఏది ఏమైనప్పటికి , రాజకీయ అధికార లభ్ది దారుల యొక్క కాంక్ష మూలం గ రేపు తెలంగాణా ప్రత్యక రాష్ట్రం ఏర్పడితే మనము దాయాదుల లాగ కలహించుకో కూడదు అనేదే నా వుద్దేయ్స్సం

    ReplyDelete
  9. "నిన్న ఏదో ఛానెల్ లో తెలంగాణా అభిమాని మంచి పాయింటు లేవనెత్తాడు.
    ఒంటె/ఏనుగు ఎక్కి కరీం నగర్ లేదా అదిలాబాద్ వెళ్ళ కూడదా?"

    ఏమిటండీ ఇది? ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదని ఎవరన్నారు?
    ఏనుగు - ఏలూరు, ఒంటె - ఒంగోలు పదాల అమరిక కోసం వ్రాసినవి. నిజంగా ఈ విషయం గ్రహించలేకపోయారా మీరు?

    నాలో నేను గారన్నట్టు "వలలోకి లాగారు, మనం పడుతున్నాం".
    నిన్న టి.వి చానల్లో చర్చ నేనూ చూశానండి. టి.వి9లో. రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో.అరగంట పైగా.

    కార్యక్రమం ముగించేముందు రజనీకాంత్ గారు " ఇప్పుడె మా టీం ఈ వాక్యాలు నాకిచ్చింది." అంటూ చదవడం మొదలుపెట్టారు కాగితంలోకి చూస్తూ, తడుముకుంటూ.

    రుద్రమ్మ భుజశక్తి - మల్లమ్మ పతిభక్తి

    తి....తిమ...తిమర్సు దీక్తి....క్షమించండి.... నాకు ఈ పాట మీద అవగాహనలేదు అన్నారు.

    అదండీ విషయం. కనీసం ఆ పాటలోని వాక్యాలు కూడా తెలియని మనిషి ఆధ్వర్యంలో ఆ పాట గురించి చర్చ అరగంటకు పైగా - మూడు ప్రాంతాల ప్రతినిధులని పిలచి - టి.ఆర్.పి రేటింగుల కోసం. పైగా ఆ చానల్స్ కి మనం ఫోన్లు చేయడం."ఒంటె/ఏనుగు ఎక్కి కరీం నగర్ లేదా అదిలాబాద్ వెళ్ళ కూడదా?" అని తీవ్రంగా చర్చించేసుకోవడం.

    నిజంగానే "వలలోకి లాగారు, మనం పడుతున్నాం".

    ReplyDelete
  10. రాజన్న గారు మీ ఇష్టం మీరు పాడనే వద్దు KCR మీద ఎమన్నా పాటలుంటే వాటిని వెతికి పట్టి పడుకోండి చాలు. అట్టాగే ఆయన వేసే పిచ్చి వేషాలు చూసి ఎవరన్న ఎమన్నా అంటే తెలంగాణా మొత్తాన్ని అన్నారని ఫీల్ అవ్వండి నష్టం ఏమిలేదు . అట్టాగే ఆయన మాట్టాడే బూతులే తెలంగాణా భాష అని చెప్పండి .

    ReplyDelete
  11. అనానిమసన్నా,
    "తమిళ చెరలోంచి" తెలుగు నాడును (ఆంద్ర రాయల సీమలను మాత్రమె సుమా!) "విముక్తి "చేయించ డానికి ఆనాడు "తెలుగు తల్లి" ని సృష్టించారు!
    ఆ లక్ష్యం నెరవేరింది.!!
    అట్లాగే ఇప్పుడు "ఆంధ్ర చెరలోంచి" తెలంగాణాను విముక్తి చేయించడానికి "తెలంగాణా తల్లిని" మేం సృష్టించుకున్నాం!. మా లక్ష్యం నెరవేరే వరకూ మా తెలంగాణా తల్లి పాటను మా ప్రాంతంలో తప్పకుండా పాడుకుంటాం!!.

    ఎక్కడో మైదుకూరులో ఏ తలతిక్క మాష్టారో ఏదో చేసాడన్న సాకుతో (పాపం అతన్ని ఉద్యోగం లోంచి పీకి పారేసారన్ట ! ) తెలంగాణా తల్లిని దెబ్బ తీయడానికి ఇప్పుడు దీర్ఘ సుషుప్తిలో వున్న తెలుగు తల్లిని మళ్లీ తట్టి లేపి దుర్భుద్ధి తో చిచ్చు పెట్టాలని చూస్తున్న దెవరు?

    ప్రశాంతమ్గా నిద్ర పోతున్న తెలుగు తల్లిని బజారుకీడ్చి ఇప్పుడు ఆమె కంట నీరు పెడుతోందని అందుకు తెలంగాణా వాళ్ళే కారణమని ఆడిపోసుకోవడం ఏమిటి?
    ఇదేమైనా న్యాయమా.?
    తెలుగు భాషను ఉద్ధరించడానికి ఇంతకంటే వేరే మార్గమే లేదా?
    భాషా ప్రయుక్త రాష్ట్రం పేరిట ఆంద్ర ప్రదేశ్ ఏర్పడి షష్టి పూర్తి దగ్గర పడుతోంది కదా !.
    ఇన్నాళు అధికార భాషగా తెలుగు ను ఎందుకు అమలు చేయలేక పోయారు??
    తెలుగును ఎందుకు ఉద్ధరించ లేక పోయారు???
    తమిళనాడు వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలను చూసి ఎందుకు బుద్ది తెచ్చుకోలేక పోయారు.???
    ఇప్పుడు పసిపిల్లల చేత అన్ని పాఠశాలల్లో బలవంతంగా ఈ తెలుగు తల్లి పాట పాడిస్తే తెలుగు ఉద్ధరించ బడినట్టేనా?
    ఇదంతా జిత్తులమారి తనం కాకపొతే మరేమిటి?

    కేసీ ఆర్, చెన్నా రెడ్డి, చిన్నా రెడ్డి, ఆంద్ర నాయకుల బూట్లు నాకే ఇతర తెలంగాణా నేతలు వాళ్ళ భాష, ఆచరణ పక్కన పెట్టండి. మేజారిటే తెలంగాణా ప్రజలు ప్రత్యెక తెలంగాణాను చాలా తీవ్రంగా కోరుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని మూడుగా మీరు గుర్తించాలి.
    అంతవరకు కావాలంటే మీరు మీ పాట పాడుకోండి.
    మేము మా తెలంగాణా పాత పాడుకుంటాం. ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను మా తెలంగాణా జాతీయ గీతాన్ని. మీకు తెలంగాణా పట్ల సహోదర భావమే వుంటే దీనిని కూడా మీరు మాతో గొంతు కలిపి పాడండి.
    దీనిని రాసిన వారు మా అందెశ్రీ అన్న.

    జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
    తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
    పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
    జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||

    పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
    గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||

    జానపదా జనజీవన జావళీలు జాలువార
    కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
    జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
    అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||

    సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
    సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
    సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||

    గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
    పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
    స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ReplyDelete