ఎడిటర్స్ వాయిస్
మీడియా అనేక సర్వేలు నిర్వహిస్తుంటోంది. ఇటు పత్రికలు, అటు టివీ ఛానెళ్లు పోటీపడి మరీ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలప్పుడైతే ఈ సర్వేల హోరు అంతాఇంతాకాదు. అలాగే, పోల్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంటోంది. వైఎస్సార్ మరణానంతరం కొద్ది గంటల్లోనే రెండు ప్రముఖ ఛానెళ్లు `జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా?' అన్న ప్రశ్నను సంధిస్తూ ఎస్ఎంఎస్ పోలింగ్ కండెక్ట్ చేశాయి. ప్రజల్లో భావోద్వేగం పతాకస్థాయిలో ఉన్న వేళలో ఇలాంటి పోలింగ్ పెట్టడం వల్ల సహజంగానే జగన్ పక్షానే ఎక్కువ ఓట్లు పడ్డాయి. సుమారుగా దాదాపుగా 90 శాతం మంది దాకా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు చూపించారు. భావోద్వేగాలు తగ్గిన తరువాతనే ప్రజల్లోని కచ్చితాభిప్రాయాన్ని రాబట్టవచ్చన్న ఉద్దేశంతో `నారదలోకం' ఇదే ప్రశ్నపై (జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా?) పోలింగ్ నిర్వహించింది. ఇందులో 8 శాతం మంది మాత్రమే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు తేలగా, 92 శాతం మంది వారసత్వంగా జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్న వాదనను వ్యతిరేకించారు.అలాగే, `నారదలోకం' మరో ఆసక్తికరమైన అంశంపై కూడా పోలింగ్ పెట్టింది. మీడియా చెప్పేవన్నీ నిజాలేనా? అన్న ప్రశ్న నెట్ జన్స్ ను అడిగింది. కనీసం ఒక్కరు కూడా మీడియా చెప్పేవన్నీ నిజాలని చెప్పకపోవడం ఆశ్చర్యకరంగానే అనిపించినా, ఈ పోల్ వాస్తవకోణాలను స్పృశించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు పోల్ ల ఫలితాలను మీరు మన బ్లాగ్ (నారదలోకం)లో చూడవచ్చు.
నిజాలను నిర్భయంగా చెబుతామని ప్రకటించుకునే మీడియా పట్ల విశ్వసనీయత ఇంతగా పడిపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిందే. జర్నలిజం క్యాపిటలిస్ట్ ల చేతుల్లో చిక్కుకున్న తరువాత మీడియా పట్లనే గౌరవం తగ్గిపోతున్నదా? అందుకు ఈ పోల్ ఒక సంకేతంగా నిలిచిందా? ఈ దిశగా ఆలోచించాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన స్థానమే. అందుకే దీన్ని `ఫోర్త్ పిల్లర్' గా చెప్పుకుంటాం. అలాంటి ఫోర్త్ పిల్లర్ పునాదాలు కదిలిపోతున్నాయా? దీనికి ఎవరు బాధ్యులు? మీడియాను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రియులందరి మీదా ఉంది. కాదంటారా? మీ అభిప్రాయాలను వెంటనే పోస్ట్ చేయండి. ఈ ఉద్యమంలో మీరూ భాగస్వాములుకండి. మీ సలహాలు అందివ్వండి.
-కణ్వస
కండకావరం ఎక్కి తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ బ్యానర్లు చింపి వేసిన వాళ్ళు తప్ప ఎవరూ జగన్ ముఖ్యమంత్రి కావాలనికోరుకోవడం లేదు.
ReplyDeleteకణ్వస గారు,
ReplyDeleteమీ గురించి మా బ్లాగు లో కానికి మీ వివరాలు తెలుపుతారా?
meeDia kooda maro business ga maaripoyindi.
ReplyDeleteIppativaraku politics matrame anukunnanu. But pokiri cinema lo police cheppinatlu meediya viluvalu digajarchindi.
political partylaku tottuluga vunnantakaalam meediya vyvastha baagupadadhu