- నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ల ఆఖరి గడువు ఫిబ్రవరి ఒకటవ తేదీ కాగా, ఈ తేదీకి కేవలం రెండువారాల ముందే ఒబామా అమెరికా దేశాధ్యక్షుడయ్యారు.
- మొత్తం 205 నామినేషన్లు వస్తే, అందులో ఒబామాలోనే కమిటీ సభ్యులు శాంతి మూర్తిని వీక్షించగలిగారు.
- ప్రపంచ మానవాళికి శాంతినిచ్చే మహానుభావునిగా కమిటీ కొనియాడింది.
- వివిధ సమాజాల నడుమ సహకారం, శాంతి వెల్లివిరయడానికి ఒబామా చేసిన కృషిని కమిటీ ప్రశంసించింది.
- అణ్వాయుధాల వ్యాప్తి నిరోధకునిగా కమిటీ గుర్తించింది. శాంతి దూతగా కొనియాడింది.
- అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన భావాలను చిగురింపజేసిన మహిమాన్వితునిగా గుర్తించింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలవడంలో ఇంతటి నూతనత్వం ఉందని బహుశా మరెవరూ ఊహించి ఉండరేమో)
- నల్లజాతీయుడు శ్వేతసౌధాన్ని అధిష్ఠించినందుకే బహుశా ఈ అవార్డు ఇచ్చారేమో.
- అమెరికా దేశాధ్యక్షునిగా ఎన్నికైన 9 నెలల్లోనే ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం ఆశ్చర్యమే.
- ఒబామా ఈ నొబెల్ శాంతి అవార్డును డిసెంబర్ పదిన అందుకుంటారు. బంగారు పతకంతోపాటుగా స్పెషల్ డిప్లొమా, 14 లక్షల డాలర్ల నగదు బహుమతిని అందుకుంటారు.
- 1885లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో నోబెల్ శాంతి బహుమతి ఎలాంటి వారికి ఇవ్వాలో చాలా వివరంగానే ప్రస్తావించారు. 'ప్రపంచ దేశాల శాంతి కోసం తపిస్తూ అందుకోసం తన జీవిత కాలంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తికి ఈ ప్రైజ్ ఇవ్వాలి. అలాగే, యుద్ధాలు జరగకుండా తీవ్రంగా ప్రయత్నించే వ్యక్తిని ఎంచుకోవాలి'
- అమెరికా అధ్యక్ష హోదాలో ఉండగా నోబెల్ శాంతి ప్రైజ్ అందుకున్న వారిలో ఒబామా మూడవ వ్యక్తి (రోస్వెట్ - 1906, ఉడ్రో విల్సన్ - 19919) కాగా, మాజీ అధ్యక్షునిగా 2002లో జిమ్మీ కార్టర్ ఈ బహుమతికి ఎంపికయ్యారు.
- కణ్వస
ట్యాగ్: Obama , Nobel , Peace
ట్యాగ్: Obama , Nobel , Peace
Crap ! Obama is just a Politician. Nothing more.
ReplyDeleteనేను దాని గురించే ఆలోచిస్తూ జల్లెడ తెరిచాను మొదటి టపా మీదే! నిర్ద్వందంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారిలో నేను ఒకడిని.
ReplyDeleteనోబెల్ ఎంపిక కమిటీలు కూడా చివరికి ఎలా తయారయ్యాయో కదా!
ReplyDeleteయాసర్ అరాఫత్‌కి ఇచ్చినప్పుడు ఒబామాకి ఎందుకివ్వ కూడదు :-)
ReplyDeleteThe committee is full bunch of jokers..
ReplyDeleteThe best joke I heard today was.."I didn't realize that Nobel Peace Committe practices affirmatice action".
I do not Know...what's the committee meaning for 'PEACE'?
ReplyDeleteThinking behind the walls.
In my opinion,by giving the peace prize to Obama, America mundari kaallaku bandham vesaru :)
ReplyDelete