కేసీఆర్ తాజాగా విసిరిన పవర్ ఫుల్ మాటలు, వాటి అర్థాలు ఓ సారి చూద్దాం...
`దిక్కుమాలిన చావుచచ్చిన వైఎస్సార్ పీనుగ హైదరాబాద్ కు రాకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్రచేపట్టింది ఎవరు?'
కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిపదార్థం చూద్దాం...
దిక్కుమాలిన= అనూహ్యంగా, దిగ్భ్రాంతికరంగా
చావుచచ్చిన= మరణించిన, మృతిచెందిన, కాలం చేసిన, స్వర్గస్థులైన, దివంగతులైన.
వైఎస్సార్ పీనుగ = వైఎస్సార్ శవం, వైఎస్సార్ మృతదేహం, వైఎస్సార్ పార్థివ శరీరం
ఇక కేసీఆర్ వ్యాఖ్యలోని అసలు భావం చూద్దాం..
`దిగ్ర్బాంతికరంగా, అనూహ్యంగా మరణించిన వైఎస్సార్ పార్థివ శరీరం హైదరాబాద్ కు చేరకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్ర చేపట్టింది ఎవరు?'
కేసీఆర్ తిట్లకు అర్థాలే వేరులే అని ఇప్పటికైనా మీరు నమ్ముతారా...
- కణ్వస
Tags: Telangana KCR Telugu
ఏంజెప్పినౌరా భాయి భళా!!! నీ అసోంటోల్లు లేకచ్చిండ్రు మన రాష్ట్రంల – అస్సలిది మామూల్గ సమజయ్యెడిదిగాదు, సక్కంగ దిమాక్ లకు ఎక్కాలంటే పుట్టి పెర్గాలె.
ReplyDeleteనేంరాశేది తెలంగాణోల్లుగాక తెల్గోల్లెవరన్నా సదివితే బూతులాగ అనిపిస్తది.
శ్రీధర్ రాజు, చికాగో - అమెరికా
కేసీఆర్ మాటలు పుండు మీద కారం చల్లి నట్టుంటాయి.
ReplyDeleteఅయితే అందరూ కారాన్నీ, కారం చల్లినోడినీ పట్టించు కుంటున్నారే తప్ప అసలు " పుండు" గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
ఉదాహరణకి
1) పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు మిగులు జలాల పేరిట నికర జలాలు తరలిస్తున్నారు, సాగు నీటికోసం నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఖాళీగా వుంచి, హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలాన్నినిండుగా ...దాని పరిమితి కి మించి నీటిని నిల్వచేసి వుంచారు, ఈ పాపం ఫలితమే ఇటీవలి వరదలు ! .
2) బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు పరచకుండా, తెలంగాణాకు ఇవ్వాల్సిన నికర జలాలను ఇవ్వకుండా గత 50 సంవత్సరాల నుంచీ అక్రమంగా రాయల సీమకు, ఆంధ్రాకు నీటిని తరలించుకు పోతున్నారు.
3) ఇటీవలి నిర్మించిన ప్రాజెక్టులకు సరైన అనుమతులు లేవు అవి అక్రమమైన ప్రాజెక్టులు.
వీటికి ఎవరూ సరైన సమాధానాలు చెప్పడం లేదు.
అసలు సమస్యను గాలికి వదిలేసి పనికి మాలిన వ్యక్తి గత నిందలతో కాలక్షేపం చేస్తున్నారు.
- సురేంద్ర, హైదరాబాద్