Friday, October 2, 2009

ఫోకస్: సెలవెందుకు దండుగ !

గాంధీ జయంతినాడు సెలవు ఇవ్వడం దండుగంటూ విదేశీవ్యవహరాల శాఖ సహాయ మంత్రి శశి థరూర్ సంచల వ్యాఖ్య చేశారు. దీంతో జాతీయ పర్వదినాలప్పుడు కూడా సెలవు ఇవ్వడం సబబేనా అన్న సందేహం మరోసారి తెరపైకెక్కింది. జాతిపిత మహాత్మ గాంధి జయంతని మనం ఓ పండుగలా జరుపుకుంటున్నాం. అందుకే ఆరోజున భారత ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నది. అయితే, శశి థరూర్ మాత్రం గాంధీ జయంతి రోజున సెలవు ఇవ్వడం దండుగేనంటూ వాదిస్తున్నారు. ఇలా సెలవు ఇవ్వడం గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధమన్నది ఈయనగారి వాదన. గాంధీ ఎప్పుడూ ఒక మాట అంటుండేవారనీ, పనిలోనే దేవుడున్నాడన్నదే ఆయన సిద్ధాంతమని, అలాంటప్పుడు ఆయన జయంతిరోజునాడు సెలవు ఇవ్వడం అపచారం చేసినట్టే అవుతుందని థరూర్ వాదిస్తున్నారు. అలాగే, జాతీయ పర్వదినాలప్పుడు కూడా సెలవ ఇవ్వకుండా పనిచేయిస్తే జాతీయ ఉత్పత్తి పెరుగుతుందన్నది ఆయన ధోరణి. మరి మీరు ఈ వాదనతో అంగీకరిస్తారా...శశిథరూర్ వ్యాఖ్యలపై మీ స్పందనను తెలియజేయండి.

3 comments:

  1. అలొచించాల్సిన విషయమే..

    ReplyDelete
  2. అప్పుడెప్పుడో 'మీ దేశంలో అంత అవినీతున్నా అభివృద్ధెలా జరుగుతుంది' అని ఓ పారిశ్రామికవేత్తని విదేశీ జర్నలిస్టెవరో అడిగితే అతను చెప్పిన సమాధానం: "Our government sleeps at night. That's when the development happens".

    కాబట్టి - పర్వదినాలకి సెలవులు ఎత్తేయటం సంగతేమో కానీ, ప్రభుత్వానికి సంవత్సరంలో మూడొందల రోజులు సెలవులిచ్చి మూసేస్తే జాతీయోత్పత్తి పదింతలవుద్ది :-)

    ReplyDelete
  3. మరా సెలవు రోజుల్లో అవినీతి తగ్గుతుంది కదా ! కాస్త రెష్టు !!

    ReplyDelete