Sunday, October 25, 2009

సెటైర్: రాజకీయనటనకు నందులు

రోశయ్య మాస్టారికి ఆలోచన ఇట్టేరాగానే కేవీపీ రంగంలోకి దూకి 2009 సంవత్సరానికిగాను రాజకీయ నందులను ప్రకటించారు. ఆ వివరాలు ఇవి...
ఉత్తమ రాజకీయ చిత్రం: ప్రజారాజ్యం (కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా, అల్లుఅరవింద్ నిర్మాణ సారథ్యం, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబువంటి స్టార్ల అద్భుత నటనతో ఒక మల్టీ స్టారర్ సినిమాగా ప్రజలను బాగా ఆకట్టుకుంది)
ఉత్తమకుటుంబకథాచిత్రం: తెలుగుదేశం-2009 (చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రాం, తారకరత్న...ఇలా ఫ్యామిలీఫ్యామిలీ మొత్తం కలిసి `తెలుగుదేశం -2009' సినిమాలో బాగా నటించారు)
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్. (ఈ నామినేషన్ కి చిరంజీవి, బాలకృష్ణ కూడా పోటీపడినప్పటికీ యాక్సిడెంటై మంచమీద పడుకుని కూడా నగదుబదలీ పథకం పేరుచెప్పి, అమ్మలారా, అక్కలారా ఇప్పుడే ఈ క్షణమే అకౌంట్లు ఓపెన్ చేయమని చెబుతూ ఎన్టీఆర్ తనదైన శైలి లో అద్భుతమైన నటనను కనబరిచారు)
ఉత్తమనటి: రోజా (తెలుగుదేశం మహిళా అధ్యక్షురలిగా పలు యాక్షన్ సన్నివేశాలలో నటించి, చీప్ లిక్కర్ బాటిల్స్ ని తెగ పగలగొట్టేసింది. చివరాఖర్లో ప్లేట్ తిప్పేసి, కాంగ్రెస్ లో చేరే సీన్లో అద్భుతంగా నటించింది.)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ కల్యాణ్. (ప్రజారాజ్యం సినిమాలో హీరో చిరంజీవికి సహాయపడుతూ, అరుపులూకేకలు పెట్టడం. ఆయన చెప్పిన `పంచలూడదీస్తాం' అన్న డైలాగ్ సినిమాకే హైలైట్.)
ఉత్తమ సహాయ నటి: జీవిత (తన భర్తకేకాకుండా `కాంగ్రెస్ పార్టీ 2009' సినిమాకు కూడా తనవంతు సహాయం చేయడం. తన సినిమా గురించి పట్టించుకోకుండా పక్కహాల్లో నడుస్తున్న ప్రజారాజ్యం సినిమాను విమర్శించడం. వీలుచిక్కినప్పుడల్లా పోలీస్ కేసులు పెట్టడం. చిరంజీవి ఫ్యాన్స్ చేసిన దాడి సీన్లో అద్భుతంగా నటించారు.)
ఉత్తమ హాస్యనటుడు: కేఏ పాల్ (ఈ కేటగిరీలో టఫ్ పైటే జరిగింది. నామినేషన్లలో బాలయ్యబాబు, రాజేశేఖర్, కేసీఆర్ కూడా పోటీపడ్డారు. అయితే మొదటినుంచీ ఎంతో బిల్డప్ ఇచ్చి, టివీషోల్లో అదరగొట్టి, 292 సీట్లూ తనవే అంటూ డైలాగ్ లుకొట్టి చివరకు నామినేషన్ వేసే వేళకు ఓటర్ల లిస్ట్ లో తన పేరు లేదని తెలుసుకుని భంగపడ్డ సీన్ లో కేఏ పాల్ అద్భుతంగా నటించి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.)
ఉత్తమ హాస్యనటి: గంగాభవాని (నోటికొచ్చినకాడికి తాను తిడుతూ, అందర్నీ నవ్వించడంలో అద్భుతంగా నటించింది)
ఉత్తమ దర్శకుడు: చంద్రబాబునాయుడు (`మహాకూటమి' పేరిట భారీ సెట్టింగ్ లతో గ్రాపిక్స్ తో తీసిన సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కలవని మనుషుల్ని కలపడానికి చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా ఈయనగారి దర్శకత్వ ప్రతిభ వెలుగుచూసింది)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: చిరంజీవి (స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా అధ్బుతంగా నటించిన ప్రజారాజ్యం సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కాలేకపోయినప్పటికీ జనంచేత జేజేలు చెప్పించుకున్నందుకు)
-రాజేష్

7 comments:


  1. ఉత్తమ విలన్ = చంద్రబాబు నాయుడు (నెం 1 వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ పాత్ర పోషించినందుకు)
    ఉత్తమ వెన్నుపోటు కారెక్టర్ = YS రాజశేఖర రెడ్డి (శాంతి చర్చల పేరుతో 500 మంది నక్సలైట్లని కాల్చి చంపించినందుకు). చంద్రబాబు నాయుడు కూడా ఉత్తమ వెన్నుపోటుదారుడి అవార్డుకి పోటీ పడ్డాడు, తన మామని వెన్నుపోటు పొడిచినందుకు.
    ఉత్తమ హాస్యనటుడు = కె.సి.ఆర్. (అయిదేళ్ళకొకసారి పొత్తులు మార్చి తన పార్టీని నవ్వుల పాలు చేశాడు) కె.ఎ.పాల్ కూడా ఉత్తమ హాస్యనటుడి అవార్డ్ కోసం పోటీ పడ్డారు.

    ReplyDelete
  2. ohoho! mee satire Nandi bahumathula selection adiripoyindi.

    ReplyDelete
  3. బాగుంది. కే.ఏ.పాల్. హ్హ హ్హ హ్హ. తలచుకుంటుంటునే నవ్వొస్తుంది. ఐన్యూస్ ప్రోగ్రాం దాదా చేసే ఇంటర్వ్యూలో అయితే మరీనూ. నాన్‌స్టాప్ నవ్వులే నవ్వులు. ఆయన చేసిన కామెడీకి బహుశా ఒక్క అవార్డు సరిపోదేమో. :)

    బైదివే, వర్డ్ వెరిఫికేషన్‌ని తొలగించండి.

    ReplyDelete
  4. chaala bagundi
    panilo pani congress vallaki kooda edo oka award ivvandi.

    ReplyDelete
  5. Congress vallaku Nee langa etti pooku samrani vesi ,open chesi pettuko madhu ....vachi Baaaaggaaaaaaaaaaaaaaa...Dengutharu...Sammaga ee inchuko .:):)

    ReplyDelete