Wednesday, September 30, 2009

కొత్తబాటలో జగన్

అధిష్ఠానం కినకవహించడంతో జగన్ తన రూట్ ని మార్చుకోబోతున్నారు. అందుకు ఆయన గాంధీ జయంతిని శుభప్రదమైన రోజుగా ఎంచుకున్నారు. తనపై గతంలో పడిన ముద్రలను చెరిపేసుకుని రాజకీయ అవతారం ఎత్తాలని ఆయన సంకల్పించుకున్నారు. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ఆయనో పారిశ్రామికవేత్తగానే అందరికీ తెలుసు. గత ఎన్నికల ముందే ఆయన క్రీయాశీలక రాజకీయాల్లోచేరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే, రాజకీయంగా ఎక్కువ అనుభవం గడించకముందే జగన్ తండ్రి వైఎస్సార్ అకాలమరణం చెందడంతో జగన్ వెనువెంటనే పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. వైఎస్సార్ మరణించి అక్టోబర్ రెండు నాటికి సరిగా నెలరోజులు అవుతుంది. అదే రోజు గాంధీ జయంతి కూడా. ఈ రోజునే పూర్తిగా రాజకీయ అవతారం ఎత్తాలని జగన్ భావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా తనకున్న బాధ్యతలను తన సన్నిహితులకు అప్పగించి పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లోనే పాల్గొనాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంచిదారిలో సాగితో, నలుగురిచేత శహభాష్ అనిపించుకుంటూ అధిష్ఠానం దగ్గర మంచిపేరు తెచ్చుకుని ఇప్పటివరకు పడిన మచ్చలను చెరిపివేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఇది శుభారంభం.

సిఎల్‌పి భేటీ అవసరమా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

ప్రధానమంత్రితోకూడిన కేంద్రమంత్రిమండలి నియామకంగురించి రాజ్యాం గంలోని 74వ నిబంధన వివరిస్తున్నది. రాష్ట్రాలలో మంత్రి మండలి నియా మకం విషయం 163వ నిబంధన చెప్తున్నది. ఈ రెండింటిలో ఎక్కడ కూడా పార్లమెంటరీ పార్టీ లేదా శాసనసభాపక్షం సమావేశాల ప్రస్తావనలేదు.
  • 74వ నిబంధన క్లాజ్‌(1)లో ప్రధాన మంత్రి ఎంపిక (ఛాయిస్‌ ఆఫ్‌ ద ప్రైమ్‌ మినిస్టర్‌) అనే భాగం ఒకటుంది. అది ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ పరిస్థితికి సూటిగా వర్తిస్తుంది గనుక, దాని అనువాదం యథాతథంగా ఎట్లుందో కింద గమనించవచ్చు.
  • పదవిలో గల ఒక ప్రధానమంత్రి మరణించినా లేక రాజీనామా చేసినా, తనతో పాటు మొత్తం మంత్రి మండలి కూడా రద్దవుతుంది గనుక ఒక కొత్త ప్రధానిని నియమించటంఅవసరం.ఇంగ్లాండ్‌లోఉన్నపద్ధతిప్రకారం, రాజ్యాంగ బద్ధమైనపాలకునిగా రాజు, ప్రధానమంత్రిద్వారా మంత్రిమండలి ఇచ్చే సలహా ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. కాని, ప్రధానమంత్రి సలహా లభించని అసాధారణ పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి స్థితిలో రాజు తన సొంత నిర్ణయం ప్రకారం వ్యవహరించవచ్చు. ప్రధాన మంత్రి మరణించటం లేదా రాజీనామా చేయటం అటువంటి అసాధారణ పరిస్థితులలో ఒకటి. ప్రధానమంత్రి మృతిచెందినా, లేక రాజీనామా చేసినా, రాజుకు అతని సలహా లభించే అవకాశం ఉండదన్నది స్పష్టం.ఎ) అటువంటి పరిస్థితిలో, కొత్త ప్రధాని ఎంపికలో, నియామకంలో రాజు ఏ ప్రధాని సలహా మేరకు కూడా వ్యవహరించలేడు. (ఎవరూ లేరు గనుక అని భావం) టువంటి స్థితిలో, సవరించిన 74(1)వ నిబంధనలో గల 'చేసి తీరాలి (షెల్‌) అనే పదం వర్తించదు. (ప్రధాని నాయకత్వాన మంత్రిమండలి ఉం టుంది. ఆ మండలి సలహా ప్రకారం రాష్ట్రపతి ీ వ్యవహరించి తీరాలి (షెల్‌... యాక్ట్‌) అని భారత రాజ్యాంగంలోని 74(1)వ నిబంధన నిర్దేశి స్తున్నది. కాని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది వర్తించదు.)
  • దీనిప్రకారం అర్థమయేదేమిటి? రాష్ట్రపతి మామూ లుగానైతే మంత్రి మండలి సలహా ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. మంత్రి మండలి తన సలహాలను ప్రధానమంత్రి ద్వారా ఇస్తుంది. కాని ప్రధానమంత్రి మరణించినా లేక రాజీనామాచేసినా ఇకసలహా ఇచ్చేం దుకు ఆయనఉండరు. ఆయన మంత్రిమండలి కూడా ఉండదు. సాధారణ పరిస్థితులలోనైతే మంత్రి మం డలి సలహా తప్పనిసరి అనే నిబంధన వర్తిస్తుంది. కాని మరణం, రాజీనామా అన్నవి అసాధారణ పరిస్థి తులు అయినందున ఆ నిబంధన వర్తించదు. ఆ స్థితిలో తనకు సముచితమని తోచిన విధంగా వ్యవ హరించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (... ఈజ్‌ ఎంటైటిల్డ్‌ టు యాక్ట్‌ ఇన్‌ ద ఎక్సర్‌సైజ్‌ ఆఫ్‌ హిజ్‌ ఓన్‌ జడ్జ్‌మెంట్‌.)
  • ఒకసారి రాష్ట్రపతి తనకు సముచితమని తోచిన విధంగా వ్యవహరిస్తే, కొత్త ప్రధాని నియామకం పని అంతటితో ముగిసిపోతుంది. సరిగా ఇదే విధివిధాన క్రమం కొత్త ముఖ్యమంత్రి నియామకం విషయంలో గవర్నర్‌కు వర్తిస్తుంది. ీనంతటిలో పార్లమెంటరీ పార్టీ, లేదా శాసనసభా పక్షం సమావేశ ప్రస్తావన ఎక్కడుందన్నది పైన ప్రస్తా వించిన నాయకుని ప్రశ్న. రాజశేఖరరెడ్డి దుర్మరణం తర్వాత ఆ స్థానంలో రోశయ్య చేత గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించటం పూర్తిగా రాజ్యాంగ బద్ధంగా జరిగిందేనని, పార్టీ అదిష్ఠానం రాజ్యాంగ నిపుణులను సంప్రదించిన మీదనే ఈ నిర్ణయం తీసుకున్నది తప్ప హడావుడిగా కాదని ఆయన స్పష్టం చేసారు. రోశ య్యను శాసనసభా పక్షం ఎన్నుకోలేదంటూ కొందరు కోర్టుకు వెళ్ళజూస్తున్న ప్రయత్నాలు గెలిచేవి కాదని కూడా అభిప్రాయపడ్డారు. విషయంలో న్యాయస్థానాలకు జోక్యం చేసు కునేవీలులేదని సుప్రీంకోర్టు ఆర్‌కెజైన్‌ వర్సస్‌ యూని యన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 1993లోనే స్పష్టం చేసిందని ఆ నాయకుడన్నారు. ైన పేర్కొన్న 'ఛాయిస్‌ ఆఫ్‌ ద ప్రైమ్‌ మినిస్టర్‌ భాగంలోని (బి) లో ఇందుకు సంబంధించి
  • కీలకమైన ఒక పేరా ఉంది. అది ఈ కింది విధంగా ఉంది:
  • 73వ నిబంధనను 53వ నిబంధనతో కలుపుతూ రాష్ట్రపతి తన ఎగ్జిక్యూటివ్‌ అధికారాలను నిర్వహించ టంలో భాగంగా, తన వ్యక్తిగత విజ్ఞతకు వదలివేసిన ప్రత్యేకాధికారాలను నిర్వహిస్తారు. 75వ నిబంధనకు అనుగుణంగాప్రధానమంత్రినినియమించటం వాటిలో ఒకటి. ఇవి న్యాయస్థానాల విచారణకు అతీతమైన అధికారాలు అని సుప్రీంకోర్టు ప్రకటించింది.
  • దీనినిబట్టి చూసినపుడు, కేంద్ర స్థాయిలో రాష్ట్ర పతి వలెనే రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌ ప్రత్యేక పరిస్థి తులలో ఉపయోగించే ప్రత్యేకాధికారాలు కోర్టుల విచా రణా పరిధిలోకి రావు.ాష్ట్రంలో జరిగిందేమిటి? వైఎస్‌ మరణం దరి మిలా రాజ్యాంగం ప్రకారం ఆయన మంత్రి మండలి ఉనికి కూడా పోయింది. తన ప్రత్యేక రాజ్యాంగాధికా రాన్నిబట్టి గవర్నర్‌ ఎన్‌డి తివారీ కొత్త ముఖ్యమం త్రిగా రోశయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సిఫారసు మేరకు పాత మంత్రుల చేత మళ్ళీ ప్రమాణం చేయించారు. ఆవిధంగా 'మంత్రి మండలి ఏర్పడింది. అటువంటి ఏర్పాటుకు ముందుగాని, తర్వాతగాని శాసనసభా పక్ష సమావేశమనే ప్రసక్తి ఏదీరాజ్యాంగంలోలేదు. అదేవిధంగా, రాజ్యాంగంలో తాత్కాలిక ముఖ్యమంత్రి, తాత్కాలిక మంత్రి మండలి అనే మాటలు సైతం ఎక్కడా లేదు.
  • వాస్తవానికి ప్రధానమంత్రిలేదా ముఖ్యమంత్రి మర ణించటం, లేదా రాజీనామా చేయటం వల్ల ఏర్పడే ఖాళీలో కొత్త వారి నియామకం గురించే కాదు.అసలు ఎన్నికల అనంతరం మొదటిసారి నియామకానికి అయినా పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షాల సమా వేశం, నాయకుని ఎన్నిక మాటలు రాజ్యాంగంలో లేవు. ఇవన్నీ సంప్రదాయాలు మాత్రమే. అయినా ఈ సంప్రదాయాలను పాటించటం, వాటిని రాష్ట్రపతి, గవర్నర్‌ పరిగణనలోకి తీసుకోవటం ఎందుకు? ప్రభు త్వం సుస్థిరంగా ఉండాలి గనుక. స్వంత మెజారిటీ గల పార్టీ, లేదా మెజారిటీ గల కూటమి, లేదా మెజా రిటీ సమర్థన గల మైనారిటీ పార్టీ, లేదా మెజారిటీ సమర్థనగల మైనారిటీకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదిసుస్థిరంగా, లేదా వీలైనంత సుస్థిరంగా ఉం డగలదన్నది సాధారణ విజ్ఞత. అయితే ఇది రాజకీయ విజ్ఞత.
  • పరిస్థితులను బట్టి ఇది వర్తిస్తుంటుంది. క్రమంగా ఒక సంప్రదాయంగా స్థిరపడుతుంటుంది. అందువ ల్లనే రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా రాయలేదు. రాజ్యాంగంలో లేదుగనుక కోర్టులో సవాలు చేయ టంకష్టం. చేసినాచెల్లదు. ఎందుకంటే, కోర్టులు నిబం ధనలకు అనుబంధంగా సంప్రదాయాలను పరిశీలి స్తాయే తప్ప, నిబంధనలను సంప్రదాయాలకు అను బంధంగా మార్చవు.
  • ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి స్వంత 'జడ్జ్‌ మెంట్‌, 'డిస్‌క్రీషన్‌ అన్న మాటలు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఆఅవకాశాన్ని వారుయథేచ్ఛగా ఏమీ ఉప యోగించరు. ప్రభుత్వ సుస్థిరతకు గల అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటూనే చేస్తారు. రోశయ్యను తివారీ ఆహ్వానించినపుడు రాజ్యాంగం ఇచ్చిన 'జడ్జ్‌మెంట్‌ అధికారాన్ని, ఆయన సభలో మెజారిటీగల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ సభ్యుడు అనే సుస్థిరత అవకాశాన్ని పరిశీలించిన తర్వాతనే ఆపని చేసి ఉంటారని వేరే చెప్పనక్కరలేదు.
  • అయితే,కొందరుశాసనసభాపక్షసమావేశం,రాజ్యాంగం అంటూ తెలిసీ తెలియని మాటలు ఏవి చెప్తున్నా, అంతిమంగా ఇది రాష్ట్రంలో రాజకీయపరమైన పేచీ అన్నది తమకు తెలుసునని పైన పేర్కొన్న నాయకుడ న్నారు. రాష్ట్రనాయకుల రాజ్యాంగ వాదనలకు ఎంత మాత్రం విలువ లేదని ఇంత వివరంగా చెప్పానంటే అర ్థం, ఇది చివరకు అధికార రాజకీయ పోరాటమని గుర్తించక కాదని అన్నారాయన.
  • రోశయ్యను ఎంపిక చేయటం వల్ల తమ స్వప్ర యోజనాలు గతంలో వలె నెరవేరవని భయపడేవారు ఈ వత్తిళ్ళు చేస్తున్నారన్నది అధిష్ఠానం అంచనా అయినట్లు చెప్పారు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితిపై సమీక్ష జరుగుతుందని, ఈ వర్గం వత్తిడి ఆలోగా శృతిమించబోదన్నది పార్టీ ఆశాభావ మని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా కొద్దిమంది పొట్టేళ్ళుగా మారి కొండను ఢీకొనదలచుకుంటే ఆ స్వేచ్ఛ వారికుంటుందంటూ ఆయన వారికి హితవు సంకేతాలు, హెచ్చరిక సంకేతాలు కూడా పంపారు
(వార్త సౌజన్యంతో)

రోశయ్యది `నీటి తత్వం'

ఈ సృష్టిలో అనేక పదార్ధాలున్నాయి. ప్రతి పదార్థానికి ఓ తత్వం ఉంటుంది. అలాగే మనుషుల్లో కూడా వేరువేరు తత్వాలు ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రోశయ్య తత్వమేమిటో అర్థంకానివారు ఇది చదవాలి... 55ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఈ కురువృద్ధ రాజకీయనేత అంతరంగాన్ని పసిగట్టడం చాలా కష్టమే. వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు సునిశితంగా గమనిస్తూనే మరో పక్క తామరాకుమీద నీటి బొట్టులా ఉండటం రోశయ్యకే చెల్లు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇమిడిపోగల తత్వం ఆయనది. వైఎస్సార్ ఉన్నంతకాలం ఆయన మీద ఈగవాలనీయలేదు ఈ వృద్ధ సింహం. ఆ తరువాత అదే తరహాలో రక్షణ కవచాన్ని వైఎస్సార్ కుమారుడు జగన్ కు ఇవ్వడానికి ఆయన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. అలాఅని జగన్ ను పూర్తిగా వ్యతిరేకించడంలేదు. ఖమ్మం, రాజమండ్రి గొడవలనేపథ్యంలో రోశయ్య మాట్లాడుతూ, స్థానిక గొడవలకు జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు. జగన్ కు ఒక వర్గం, తనకొక వర్గం లేదని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం కూర్చోమంటే కూర్చున్నా, లేవమంటే లేచి వెళ్ళిపోతా, వేరే ఎవరు వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నావారికి సహకరిస్తానంటూ తన రాజకీయ తత్వం ఏమిటో భోదించారు. రోశయ్య రాజకీయాల్లో పండిపోయిన ఆకులాంటివారు. కాంగ్రెస్ అథిష్ఠానమంటే ఆయనకు వల్లమాలిన అభిమానం, గౌరవం. రోశయ్యలో మరో ప్రత్యేకత కూడా ఉంది. తనకుతానుగా అవకాశాల కోసం అర్రులుచాచరు. అలాఅని అవకాశం తలుపుతడితేమాత్రం తెరవకుండా ఉండరు. ఆయనది జల స్వభావం. ఏ సీసాలో పోస్తే ఆ సీసాలో వొదిగిపోతారు. అందుకే రోశయ్య ఇప్పుడు జగన్ వర్గీయులకూ, అటు జగన్ వైరి వర్గీయులకు `తన వాడిగానే' కనబడుతుంటారు. అదే, రోశయ్య తత్వం.

Tuesday, September 29, 2009

`నష్టాల్లో' జగన్ !

వైఎస్ జగన్ నష్టాల్లో పడుతున్నారు! ఈ నష్టం వ్యాపారంలో వచ్చిందికాదు. రాజకీయాల్లో వచ్చిన నష్టమే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే అవుతుంది. జగన్ సీఎం కావాలంటూ అభిమానులు వీరంగం చేయడం చివరకు జగన్ కే నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం వాటిల్లిన పరిణామ క్రమం ఇలా ఉంది...
  • వైఎస్సార్ మరణం అనంతరం కేవలం కొద్ది గంటల్లోనే జగన్ సీఎం కావాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయడం.
  • జగన్ సీఎం కావాలనుకుంటున్నారా? అంటూ మీడియాచేత సర్వేలు జరిపించడంసంతకాల సేకరణ ఉద్యమాన్ని హడావుడిగా చేపట్టడం.
  • గాంధీభవన్ లో పిసీసీ అధ్యక్షుడు డీఎస్ ను జగన్ వర్గీయులు అడ్డుకోవడం.
  • రోశయ్యను తాత్కాలిక ముఖ్యమంత్రే అంటూ ఎమ్మెల్యేలు చులకనగా చూడటం.
  • మంత్రివర్గంచేత ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమాన్ని రోశయ్య తలపెట్టగా, కొంత మంది జగన్ తో రహస్య మంతనాలు ఆడటం.
  • నల్లకాలువ వద్ద బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం.
  • బహరంగ సభలో జగన్ ఎక్కడా కాంగ్రెస్ అధిష్టానం, సోనియా పేర్లు ఉచ్ఛరించకపోవడం.
  • ఖమ్మం జిల్లాలో సోనియా చిత్రం ఉన్న ఫ్లెక్సీని చింపేయడం.అనంతరం, రాజమండ్రిలో బస్సులను దగ్ధం చేయడం.
  • ఇంతజరుగుతున్నా, తాను సీఎం కావాలని అనుకుంటున్నారా, లేదా అన్న విషయంలో జగన్ విస్ఫష్టమైన ప్రకటన చేయకపోవడం.
  • అధిష్ఠానం దిగిరాకపోతే, చీలిక తప్పదన్న సంకేతాలు ఇవ్వడం.
  • నూరేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని సరిగా అర్థం చేసుకోకపోవడం.

మంత్రుల్లో చీలిక

జగన్ సీఎం కావాలన్న ఉద్యమం ఊపందుకుంది. ఢిల్లీ అధిష్ఠానం వ్యవహారాన్ని ఇప్పటికీ నానుస్తూనే ఉండటంతో జగన్ వెంటనే మేమంతా ఉంటామంటూ శపథాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలలో కొంతమంది మెల్లగా జరుకుంటున్నారు. `నారద లోకం' సేకరించిన కీలక సమాచారం ప్రకారం, జగన్ పక్షానే ఉంటామంటూ సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో (వీరిలో కొంత మంది మంత్రులు కూడా ఉన్నారు) సగానికి పైగా డైలమాలో పడ్డారు. వైఎస్సార్ మరణం అనంతరం వారం పదిరోజుల్లోనే జగన్ సీఎం అవుతారని భావించి మొదట్లో ఊగిపోయిన వారంతా సుమారు నెలరోజులు కావస్తున్నా సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉండటంతో పట్టు సడలిపోతున్నది. ఏతావాతా రాష్ట్ర కాంగ్రెస్ చీలిక దిశలోనే పయనిస్తోంది. ఏవర్గానికీ మెజారిటీ లేకపోతే పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ప్రతిపక్షాల కూటమికి లాభసాటి అవుతుంది.

Monday, September 28, 2009

ఎడిటర్స్ వాయిస్

`నారదలోకం' పేరిట విజయదశమి పర్వదినాన బ్లాగ్ ఓపెన్ చేశాం. వార్తల కోసం ఎన్నో వెబ్ సైట్స్, మరెన్నో బ్లాగ్ లు ఉన్నప్పుడు ఈ బ్లాగ్ అవసరం ఏమిటన్న సందేహం మీకు రావచ్చు. అందుకే రెండు మాటలు....
కనిపించేవన్నీ వార్తలు కావు, అలాగే వినిపించేవన్నీ కూడా వార్తలు కావు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిజాన్ని నిర్భయంగా చెప్పడం మానేసి చాలాఏళ్లు అయింది. ఎవరికి తోచిన (లాభసాటిగా తోచిన) రీతిలో వారు వార్తలను కవర్ చేస్తున్నారు. ఉదాహరణకు విజయదశమి ముందురోజు మహార్నవమిరోజున ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆఫీస్ లో సోనియా, రేణుకా చౌదరి చిత్రాలున్న ఫ్లెక్సీ చింపేసిన దృశ్యాలను ప్రైవేట్ ఛానెళ్లన్నీ అదేపనిగా చూపించాయి. చూసే దృశ్యాలు ఒకటే అయినా, చూసేవారికి ఏదో ఒక రంగు పులమాలని ఈ ఛానెళ్లు తెగ ప్రయత్నించాయి. అందులో ఒక ఛానెల్ రేణుక చిత్రం చుట్టూ ఎర్రటి రింగ్ వేసి ఈ దాడి చేసిన వాళ్లలో సోనియాపట్ల కోపం లేదనీ, కేవలం రేణుక పట్లనే కోపంతో రెచ్చిపోయారన్న అర్థం వచ్చేలా సీన్లను ప్రసారం చేసింది. ఎవరు డబ్బు ఇస్తే వారికి మీడియా అమ్ముడవుతున్న సమయంలో ఎక్కడా చదవని, మరెక్కడా చూడని లోగుట్టు వార్తల సమగ్ర వేదిక ఒకటి అవసరమనిపించింది. నిత్యం మన బుర్రలోకి ఎక్కుతున్న వార్తల్లోని నిజాల నిగ్గుతేల్చేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఎవరైనా ఈ బ్లాగ్ కు క్లుప్తంగా లోగుట్టు వార్తలు పంపవచ్చు. అలా పంపడాన్ని ఓ సామాజిక సేవగా గుర్తించండి.
నారద లోకం ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ విజయదశమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు.

రెచ్చిపో...

జగన్ కి చెక్కు పెట్టే విషయంలో వ్యతిరేక వర్గం కూడా చాలా సైలెంట్ గా పావులు కదుపుతోంది. సీనియర్లు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.
  • జగన్ కు సోనియాగాంధీ నుంచి త్వరలోనే పిలుపు వస్తుందన్న సంకేతాలు రాగానే సీనియర్లు రెచ్చిపోవడం ప్రారంభించారు.
  • అమలాపురం ఎంపీ హర్షకుమార్ చేత సంచలనాత్మక వ్యాఖ్యలు చేయించారు (అధిష్టానం అంటే నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటే రాజీనామాలు చేసేయవచ్చంటూ హర్షకుమార్ వ్యాఖ్యానించారు)
  • హర్షకుమార్ వ్యాఖ్యలు చేసిన రోజునే సరిగా నల్లకాలువ (వైఎస్సార్ హెలికాప్టర్ కూలిన పావురాల గుట్టకు అతి చేరువలో ఉంది)లో జగన్ బహిరంగ సభ (వైఎస్సార్ మరణానంతరం జగన్ ఏర్పాటు చేసిన తొలి సభ) జరుగతున్న వేళలోనే హర్షకుమార్ చేత పెదవి విప్ఫించారు.
  • సీనియర్ల కుట్రలో వైఎస్ యువసేన (అసలే యువరక్తం, ఆపై వీరాభిమానం) సోనియా చిత్రం ఉన్న ఫ్లెక్సీలను చించిపారేశారు.
  • ఖమ్మం జిల్లాలో సోనియా చిత్రపటానికి జరిగిన అపచారం వార్తను సీనియర్లు బాగానే క్యాష్ చేసుకున్నారు.
  • జగన్ అంటే ఉన్న కోపం (నిజానికి జగన్ అంటే కోపం లేదు. వైఎస్సార్ పై ఉన్న కోపమే ఇలా కన్వర్ట్ అయింది) చల్లార్చుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో సీనియర్లు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు... రెచ్చిపోతున్నారు.

మీడియా శవ రాజకీయం- 1

వైఎస్సార్ మరణానంతరం శవ రాజకీయాలు జరిగాయంటూ మీదియా కోడై కూసింది. ఐతే అసలు సిసలు శవ రాజకీయాలు చేసింది మీడియానే.
౧. వై.ఎస్.ఆర్ పార్థివ శరీరం ఎల్.బి స్టేడియం నుంచి ఇడుపులపాయకు చేరాక ముందే జగన్ గుప్పెట్లో ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు మీడియాని లోబరుచుకున్నారు.
౨. జగన్ సి.ఎం అవుతారా ? అన్న ప్రశ్నకు ఎస్.ఎం.ఎస్ ద్వారా సమాధానాలు రాబట్టే ప్రక్రియను రెండు ప్రముఖ ఛానల్స్ చేపట్టాయి. ఈ పనిచేసిపెట్టినందుకు ఆ చానెళ్లకు భారీగా ముడుపులు అందాయని చెప్పుకుంటున్నారు.
౩. ఇడుపులపాయలో అంత్యక్రియలు పూర్తి కాక ముందే ఎస్.ఎం.ఎస్. ఫలితాలలో ఎనభై శాతానికి పైగా జగన్ కి అనుకూలత వచ్చేలా చూశారు.
౪. రాష్ట్ర ప్రజలలో 80 శాతం మంది జగన్ సి.ఎం కావలనుకున్తున్నట్లు భ్రాంతి కలిగించారు.
  • మీడియాను అడ్డు పెట్టుకొని జగన్ దగ్గర ప్రాభవం సంపాదించాలని ప్రయత్నించినా పారిశ్రామిక వేత్తలెవరు ?
  • ( వివరాలురెండో భాగంలో)

సెటైర్: రోశయ్య పవరెన్నాళ్లట !

కణ్వస: నారద మహర్షిగారు, నాకో డౌట్
నారద: ఇంకెందుకు లేటు, అడుగు
కణ్వస: ఈ ఆనం లేడూ...
నారద: ఏ ఆనం...మంత్రేనా?
కణ్వస; అవును, ఆయినే..రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి అన్నాడు.
నారద: బాగనేఉంది, ఆనమే కాదు, జగనానుచరులు అంటున్నమాటేగా అది
కణ్వస: అదే, అందుకే నాకో డౌట్
నారద: ఏమిటో చెప్పండి మహర్షి.
కణ్వస: అసలు తాత్కాలిక ముఖ్యమంత్రి అంటే ఏమిటీ. ఎన్ని రోజులుండవచ్చు...?
నారద: నాలుగున్నరేళ్లు ఉండవచ్చు. `అమ్మ' దయ ఉంటే.
కణ్వస: మరి, జగన్ ని సీఎం చేస్తారని అధిష్ఠానం మాటిచ్చారట...
నారద: (ఓ నవ్వు నవ్వి) తెలంగాణ ఇస్తామని కూడా మాటిచ్చారుగా... నారాయణ...నారాయణ

సాక్షి మొదటి పేజీ కథ

నారాయణ...నారాయణ... ఈవాళ్టి సాక్షి (విజయదశమి) సంచిక చూశారా మరి... మొదటి పేజీలో భారీ సెట్టింగ్ లతో భారతి సిమెంట్ వ్యాపారప్రకటన లేదూ...దాని వెనుక ఉన్న కథ చెబుతా వినండి...
౧. మొదటి పేజీలో అసలు పెట్టాల్సింది - ఖమ్మం జిల్లాలో జగనానుచరులు (అసురులు కారు) కాంగ్రెస్ మాతాశ్రీ (సోనియా) ఫ్లెక్సీని కసిగా చింపేసిన వార్తను.
౨. దీన్ని పెడితే జగన్ ఇజ్జత్ పోదూ... జగన్ అనుయాయుల బాగోతం ఏ ముఖం పెట్టుకుని ముఖపత్రం (మొదటి పేజీలో) వేస్తారు చెప్పండి.
౩. ఇంతకాలం ఈనాడు పత్రిక అడ్డగోలుేగా, వక్రభాష్యాలు చెబుతున్నదని తీవ్రాతితీవ్రంగా ఖిండిస్తూ పేజీలకు పేజీలు గీసిపారేసిన సాక్షీయులకు ఇప్పుడు చేతులురాలేదు. జగనానుచరులు చేసిన వికృత చేష్ఠలను ఎలా సమర్దించుకోవాలో తెలియక, ఒక వేళ తెలిసినా వాటిని మొదటి పుటలో ముద్రించడం ఇష్టంలేక లోపలి పేజీలో దాక్కునేలా చేశారు.
౪. ఈ సంకట పరిస్థితికి వేరేదారిలేక జగన్ గ్రూప్ నుంచే వస్తున్న భారతి సిమెంట్ వ్యాపార ప్రకటనతో తొలి పుటను నింపేశారు.
శహభాష్ సాక్షి... గ్రూప్ కంపెనీలను బాగానే వాడుకుంటున్నావ్. అందుకు ఈ సంచికే నిలువెత్తు సాక్షి. నారాయణ...నారాయణ..