`నారదలోకం' పేరిట విజయదశమి పర్వదినాన బ్లాగ్ ఓపెన్ చేశాం. వార్తల కోసం ఎన్నో వెబ్ సైట్స్, మరెన్నో బ్లాగ్ లు ఉన్నప్పుడు ఈ బ్లాగ్ అవసరం ఏమిటన్న సందేహం మీకు రావచ్చు. అందుకే రెండు మాటలు....
కనిపించేవన్నీ వార్తలు కావు, అలాగే వినిపించేవన్నీ కూడా వార్తలు కావు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిజాన్ని నిర్భయంగా చెప్పడం మానేసి చాలాఏళ్లు అయింది. ఎవరికి తోచిన (లాభసాటిగా తోచిన) రీతిలో వారు వార్తలను కవర్ చేస్తున్నారు. ఉదాహరణకు విజయదశమి ముందురోజు మహార్నవమిరోజున ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆఫీస్ లో సోనియా, రేణుకా చౌదరి చిత్రాలున్న ఫ్లెక్సీ చింపేసిన దృశ్యాలను ప్రైవేట్ ఛానెళ్లన్నీ అదేపనిగా చూపించాయి. చూసే దృశ్యాలు ఒకటే అయినా, చూసేవారికి ఏదో ఒక రంగు పులమాలని ఈ ఛానెళ్లు తెగ ప్రయత్నించాయి. అందులో ఒక ఛానెల్ రేణుక చిత్రం చుట్టూ ఎర్రటి రింగ్ వేసి ఈ దాడి చేసిన వాళ్లలో సోనియాపట్ల కోపం లేదనీ, కేవలం రేణుక పట్లనే కోపంతో రెచ్చిపోయారన్న అర్థం వచ్చేలా సీన్లను ప్రసారం చేసింది. ఎవరు డబ్బు ఇస్తే వారికి మీడియా అమ్ముడవుతున్న సమయంలో ఎక్కడా చదవని, మరెక్కడా చూడని లోగుట్టు వార్తల సమగ్ర వేదిక ఒకటి అవసరమనిపించింది. నిత్యం మన బుర్రలోకి ఎక్కుతున్న వార్తల్లోని నిజాల నిగ్గుతేల్చేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఎవరైనా ఈ బ్లాగ్ కు క్లుప్తంగా లోగుట్టు వార్తలు పంపవచ్చు. అలా పంపడాన్ని ఓ సామాజిక సేవగా గుర్తించండి.
నారద లోకం ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ విజయదశమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు.
Subscribe to:
Post Comments (Atom)
బాగుంది మీ ప్రయత్నం
ReplyDelete