Wednesday, September 30, 2009

కొత్తబాటలో జగన్

అధిష్ఠానం కినకవహించడంతో జగన్ తన రూట్ ని మార్చుకోబోతున్నారు. అందుకు ఆయన గాంధీ జయంతిని శుభప్రదమైన రోజుగా ఎంచుకున్నారు. తనపై గతంలో పడిన ముద్రలను చెరిపేసుకుని రాజకీయ అవతారం ఎత్తాలని ఆయన సంకల్పించుకున్నారు. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ఆయనో పారిశ్రామికవేత్తగానే అందరికీ తెలుసు. గత ఎన్నికల ముందే ఆయన క్రీయాశీలక రాజకీయాల్లోచేరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే, రాజకీయంగా ఎక్కువ అనుభవం గడించకముందే జగన్ తండ్రి వైఎస్సార్ అకాలమరణం చెందడంతో జగన్ వెనువెంటనే పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. వైఎస్సార్ మరణించి అక్టోబర్ రెండు నాటికి సరిగా నెలరోజులు అవుతుంది. అదే రోజు గాంధీ జయంతి కూడా. ఈ రోజునే పూర్తిగా రాజకీయ అవతారం ఎత్తాలని జగన్ భావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా తనకున్న బాధ్యతలను తన సన్నిహితులకు అప్పగించి పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లోనే పాల్గొనాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంచిదారిలో సాగితో, నలుగురిచేత శహభాష్ అనిపించుకుంటూ అధిష్ఠానం దగ్గర మంచిపేరు తెచ్చుకుని ఇప్పటివరకు పడిన మచ్చలను చెరిపివేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఇది శుభారంభం.

2 comments:

  1. శుభం !
    ఇదేదో ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పరువు ఇట్లా బజార్న పడేది కాదు.
    ఇప్పటికైనా అర్జంటుగా తన అభిమానుల కు ఆమేరకు ఆదేశాలు జారీ చేసి ఈ హై డ్రామాకు తెరదించితే రోశయ్య గారి ప్రభుత్వం గాడిలో పడుతుంది. మరికొన్ని గుండెలు ఆగిపోకుండా, మరి కొందరు అర్భకులు ఆత్మహత్యలకు , ఆస్తి నష్టానికి పాల్పడకుండా చేసి పుణ్యం కట్టుకున్న వాడవుతాడు.

    ReplyDelete
  2. జగన్ ని సి. ఎం కాకుందా ఆపె సక్థి ఎవ్వరికీ ఉందనుకొను. ఐతె ఆయనికి ఉందల్సిందల్ల స్వర్గీయ రజసెఖర్ రెద్ది రక్తం లొ ఉన్న ధమ్ము,ఆ ఆత్మ విస్వాసం, పత్తుదల. మనం ఒక్కల్లం కాదు నిర్నయించల్సింది. మనమొక్కల్లమె ప్రజలం కాదు.

    ReplyDelete