- 74వ నిబంధన క్లాజ్(1)లో ప్రధాన మంత్రి ఎంపిక (ఛాయిస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్) అనే భాగం ఒకటుంది. అది ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితికి సూటిగా వర్తిస్తుంది గనుక, దాని అనువాదం యథాతథంగా ఎట్లుందో కింద గమనించవచ్చు.
- పదవిలో గల ఒక ప్రధానమంత్రి మరణించినా లేక రాజీనామా చేసినా, తనతో పాటు మొత్తం మంత్రి మండలి కూడా రద్దవుతుంది గనుక ఒక కొత్త ప్రధానిని నియమించటంఅవసరం.ఇంగ్లాండ్‌లోఉన్నపద్ధతిప్రకారం, రాజ్యాంగ బద్ధమైనపాలకునిగా రాజు, ప్రధానమంత్రిద్వారా మంత్రిమండలి ఇచ్చే సలహా ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. కాని, ప్రధానమంత్రి సలహా లభించని అసాధారణ పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి స్థితిలో రాజు తన సొంత నిర్ణయం ప్రకారం వ్యవహరించవచ్చు. ప్రధాన మంత్రి మరణించటం లేదా రాజీనామా చేయటం అటువంటి అసాధారణ పరిస్థితులలో ఒకటి. ప్రధానమంత్రి మృతిచెందినా, లేక రాజీనామా చేసినా, రాజుకు అతని సలహా లభించే అవకాశం ఉండదన్నది స్పష్టం.ఎ) అటువంటి పరిస్థితిలో, కొత్త ప్రధాని ఎంపికలో, నియామకంలో రాజు ఏ ప్రధాని సలహా మేరకు కూడా వ్యవహరించలేడు. (ఎవరూ లేరు గనుక అని భావం) టువంటి స్థితిలో, సవరించిన 74(1)వ నిబంధనలో గల 'చేసి తీరాలి (షెల్) అనే పదం వర్తించదు. (ప్రధాని నాయకత్వాన మంత్రిమండలి ఉం టుంది. ఆ మండలి సలహా ప్రకారం రాష్ట్రపతి ీ వ్యవహరించి తీరాలి (షెల్... యాక్ట్) అని భారత రాజ్యాంగంలోని 74(1)వ నిబంధన నిర్దేశి స్తున్నది. కాని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది వర్తించదు.)
- దీనిప్రకారం అర్థమయేదేమిటి? రాష్ట్రపతి మామూ లుగానైతే మంత్రి మండలి సలహా ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. మంత్రి మండలి తన సలహాలను ప్రధానమంత్రి ద్వారా ఇస్తుంది. కాని ప్రధానమంత్రి మరణించినా లేక రాజీనామాచేసినా ఇకసలహా ఇచ్చేం దుకు ఆయనఉండరు. ఆయన మంత్రిమండలి కూడా ఉండదు. సాధారణ పరిస్థితులలోనైతే మంత్రి మం డలి సలహా తప్పనిసరి అనే నిబంధన వర్తిస్తుంది. కాని మరణం, రాజీనామా అన్నవి అసాధారణ పరిస్థి తులు అయినందున ఆ నిబంధన వర్తించదు. ఆ స్థితిలో తనకు సముచితమని తోచిన విధంగా వ్యవ హరించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (... ఈజ్ ఎంటైటిల్డ్ టు యాక్ట్ ఇన్ ద ఎక్సర్‌సైజ్ ఆఫ్ హిజ్ ఓన్ జడ్జ్‌మెంట్.)
- ఒకసారి రాష్ట్రపతి తనకు సముచితమని తోచిన విధంగా వ్యవహరిస్తే, కొత్త ప్రధాని నియామకం పని అంతటితో ముగిసిపోతుంది. సరిగా ఇదే విధివిధాన క్రమం కొత్త ముఖ్యమంత్రి నియామకం విషయంలో గవర్నర్‌కు వర్తిస్తుంది. ీనంతటిలో పార్లమెంటరీ పార్టీ, లేదా శాసనసభా పక్షం సమావేశ ప్రస్తావన ఎక్కడుందన్నది పైన ప్రస్తా వించిన నాయకుని ప్రశ్న. రాజశేఖరరెడ్డి దుర్మరణం తర్వాత ఆ స్థానంలో రోశయ్య చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించటం పూర్తిగా రాజ్యాంగ బద్ధంగా జరిగిందేనని, పార్టీ అదిష్ఠానం రాజ్యాంగ నిపుణులను సంప్రదించిన మీదనే ఈ నిర్ణయం తీసుకున్నది తప్ప హడావుడిగా కాదని ఆయన స్పష్టం చేసారు. రోశ య్యను శాసనసభా పక్షం ఎన్నుకోలేదంటూ కొందరు కోర్టుకు వెళ్ళజూస్తున్న ప్రయత్నాలు గెలిచేవి కాదని కూడా అభిప్రాయపడ్డారు. విషయంలో న్యాయస్థానాలకు జోక్యం చేసు కునేవీలులేదని సుప్రీంకోర్టు ఆర్‌కెజైన్ వర్సస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో 1993లోనే స్పష్టం చేసిందని ఆ నాయకుడన్నారు. ైన పేర్కొన్న 'ఛాయిస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ భాగంలోని (బి) లో ఇందుకు సంబంధించి
- కీలకమైన ఒక పేరా ఉంది. అది ఈ కింది విధంగా ఉంది:
- 73వ నిబంధనను 53వ నిబంధనతో కలుపుతూ రాష్ట్రపతి తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను నిర్వహించ టంలో భాగంగా, తన వ్యక్తిగత విజ్ఞతకు వదలివేసిన ప్రత్యేకాధికారాలను నిర్వహిస్తారు. 75వ నిబంధనకు అనుగుణంగాప్రధానమంత్రినినియమించటం వాటిలో ఒకటి. ఇవి న్యాయస్థానాల విచారణకు అతీతమైన అధికారాలు అని సుప్రీంకోర్టు ప్రకటించింది.
- దీనినిబట్టి చూసినపుడు, కేంద్ర స్థాయిలో రాష్ట్ర పతి వలెనే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ప్రత్యేక పరిస్థి తులలో ఉపయోగించే ప్రత్యేకాధికారాలు కోర్టుల విచా రణా పరిధిలోకి రావు.ాష్ట్రంలో జరిగిందేమిటి? వైఎస్ మరణం దరి మిలా రాజ్యాంగం ప్రకారం ఆయన మంత్రి మండలి ఉనికి కూడా పోయింది. తన ప్రత్యేక రాజ్యాంగాధికా రాన్నిబట్టి గవర్నర్ ఎన్‌డి తివారీ కొత్త ముఖ్యమం త్రిగా రోశయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సిఫారసు మేరకు పాత మంత్రుల చేత మళ్ళీ ప్రమాణం చేయించారు. ఆవిధంగా 'మంత్రి మండలి ఏర్పడింది. అటువంటి ఏర్పాటుకు ముందుగాని, తర్వాతగాని శాసనసభా పక్ష సమావేశమనే ప్రసక్తి ఏదీరాజ్యాంగంలోలేదు. అదేవిధంగా, రాజ్యాంగంలో తాత్కాలిక ముఖ్యమంత్రి, తాత్కాలిక మంత్రి మండలి అనే మాటలు సైతం ఎక్కడా లేదు.
- వాస్తవానికి ప్రధానమంత్రిలేదా ముఖ్యమంత్రి మర ణించటం, లేదా రాజీనామా చేయటం వల్ల ఏర్పడే ఖాళీలో కొత్త వారి నియామకం గురించే కాదు.అసలు ఎన్నికల అనంతరం మొదటిసారి నియామకానికి అయినా పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షాల సమా వేశం, నాయకుని ఎన్నిక మాటలు రాజ్యాంగంలో లేవు. ఇవన్నీ సంప్రదాయాలు మాత్రమే. అయినా ఈ సంప్రదాయాలను పాటించటం, వాటిని రాష్ట్రపతి, గవర్నర్ పరిగణనలోకి తీసుకోవటం ఎందుకు? ప్రభు త్వం సుస్థిరంగా ఉండాలి గనుక. స్వంత మెజారిటీ గల పార్టీ, లేదా మెజారిటీ గల కూటమి, లేదా మెజా రిటీ సమర్థన గల మైనారిటీ పార్టీ, లేదా మెజారిటీ సమర్థనగల మైనారిటీకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదిసుస్థిరంగా, లేదా వీలైనంత సుస్థిరంగా ఉం డగలదన్నది సాధారణ విజ్ఞత. అయితే ఇది రాజకీయ విజ్ఞత.
- పరిస్థితులను బట్టి ఇది వర్తిస్తుంటుంది. క్రమంగా ఒక సంప్రదాయంగా స్థిరపడుతుంటుంది. అందువ ల్లనే రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా రాయలేదు. రాజ్యాంగంలో లేదుగనుక కోర్టులో సవాలు చేయ టంకష్టం. చేసినాచెల్లదు. ఎందుకంటే, కోర్టులు నిబం ధనలకు అనుబంధంగా సంప్రదాయాలను పరిశీలి స్తాయే తప్ప, నిబంధనలను సంప్రదాయాలకు అను బంధంగా మార్చవు.
- ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి స్వంత 'జడ్జ్ మెంట్, 'డిస్‌క్రీషన్ అన్న మాటలు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఆఅవకాశాన్ని వారుయథేచ్ఛగా ఏమీ ఉప యోగించరు. ప్రభుత్వ సుస్థిరతకు గల అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటూనే చేస్తారు. రోశయ్యను తివారీ ఆహ్వానించినపుడు రాజ్యాంగం ఇచ్చిన 'జడ్జ్‌మెంట్ అధికారాన్ని, ఆయన సభలో మెజారిటీగల కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు అనే సుస్థిరత అవకాశాన్ని పరిశీలించిన తర్వాతనే ఆపని చేసి ఉంటారని వేరే చెప్పనక్కరలేదు.
- అయితే,కొందరుశాసనసభాపక్షసమావేశం,రాజ్యాంగం అంటూ తెలిసీ తెలియని మాటలు ఏవి చెప్తున్నా, అంతిమంగా ఇది రాష్ట్రంలో రాజకీయపరమైన పేచీ అన్నది తమకు తెలుసునని పైన పేర్కొన్న నాయకుడ న్నారు. రాష్ట్రనాయకుల రాజ్యాంగ వాదనలకు ఎంత మాత్రం విలువ లేదని ఇంత వివరంగా చెప్పానంటే అర ్థం, ఇది చివరకు అధికార రాజకీయ పోరాటమని గుర్తించక కాదని అన్నారాయన.
- రోశయ్యను ఎంపిక చేయటం వల్ల తమ స్వప్ర యోజనాలు గతంలో వలె నెరవేరవని భయపడేవారు ఈ వత్తిళ్ళు చేస్తున్నారన్నది అధిష్ఠానం అంచనా అయినట్లు చెప్పారు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితిపై సమీక్ష జరుగుతుందని, ఈ వర్గం వత్తిడి ఆలోగా శృతిమించబోదన్నది పార్టీ ఆశాభావ మని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా కొద్దిమంది పొట్టేళ్ళుగా మారి కొండను ఢీకొనదలచుకుంటే ఆ స్వేచ్ఛ వారికుంటుందంటూ ఆయన వారికి హితవు సంకేతాలు, హెచ్చరిక సంకేతాలు కూడా పంపారు
(వార్త సౌజన్యంతో)
No comments:
Post a Comment