దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరోసారి తేటతెల్లమైంది. జావాబుదారీతనం, సుస్థిరపాలన కావాలని ఏ రాష్ట్ర ప్రజలైనా కోరుకోవడం సహజం. వీటితోపాటుగా దేశాన్ని ముక్కచెక్కలు చేసే ప్రాంతీయ పార్టీలకంటే, జాతీయతాభావంతో ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్న పార్టీకే పట్టం కట్టాలన్న ప్రజలమనోభావాలకు అద్దంపట్టేలా మహారాష్ట్ర, హర్యనా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో మునుపటి అంత బలాన్ని సంపాదించుకోకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగల సత్తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ చాటుకుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎన్సీపీ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించింది. మతతత్వ పార్టీలకు మరోమారు ఓటర్లు బుద్ధిచెప్పారు. అయితే ప్రాంతీయపోకడలను రెచ్చగొట్టే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మాత్రం అనుకున్నట్టుగానే బలం పుంజుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ - బోకర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సుశీల్ కుమార్ షిండె కుమార్తె ప్రణీతి షిండె సోలాపూర్ నుంచి గెలుపొందారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్ అమరావతి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా - 72, 100 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు అధినేత ఓంప్రకాష్ చౌతాలా తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ గెలుపొందారు. సావిత్రి జిందాల్ హిస్సార్ లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. కాగా, లోక్ భారతిపార్టీ తరఫున పోటీ చేసిన వినోద్ కాంబ్లీ పరాజయం చవిచూశారు.
Subscribe to:
Post Comments (Atom)
అంటే మీ ఉద్దేశ్యం కాంగ్రెస్ మాత్రం మతతత్వ పార్టీ కాదు లౌకిక పార్టీ అనేనా?
ReplyDeleteవిజయమోహన్ గారి అభిప్రాయమే నాదీనూ. మజ్లిస్ లాంటి ముస్లిం పార్టీలతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ ఎలా అవుతుంది? అసలు మన దేశంలో మతాలకి, కులాలకి అతీతంగా ఏదైనా పార్టీ ఉందంటారా? ఉంటే, ఒక్కసారైనా అధికారం చేపట్టిన దాకలాలున్నాయా?
ReplyDeleteసుస్థిరత సింగినాదం సంగతేమో కానీ అక్కడ కాంగ్రెస్ గెలవటంతో ఇక్కడ జగనన్న గొంతులో పేధ్ధ వెలక్కాయ పడటం ఖాయం. 'మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలచ్చన్లలో వైఎస్ నించి గెలవలేదు, సోనియా నించే గెలిచాం, కావాలంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల ఎలచ్చన్ల ఫలితాలు సూడండ్రి' అనే గొంతులు ఎక్కువౌతాయిప్పుడు.
ReplyDeleteప్రజలు సుస్థిరత కోరుకున్నారనడం, మతవాదులను తిరస్కరించారనడం, జాతీయవాద పార్టీలను ఆదరించి ప్రాంతీయపార్టీలను తిరస్కరించారనడం,.. అంటానికి బావున్నై. కాకపోతే కింది విషయాల గురించి కూడా ఆలోచించగలరు:
ReplyDelete1. ఎమ్మెన్నెస్ చీల్చుకున్న వోట్ల సంగతి
2. ఎన్సీపీ జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా?
3. కాంగ్రెసు-లౌకికవాదం -ఇదో పెద్ద విరోధాభాసం. మైనారిటీవాదాన్నే లౌకికవాదంగా చెలామణీ చేస్తున్న ఈ రోజుల్లో కాంగ్రెసు లౌకికవాద పార్టీయే! అదే లెక్కన లష్కరే తోయిబా ప్రపంచశాంతి కోసం యజ్ఞయాగాలు చేసే సంస్థ, రాజశేఖరరెడ్డి అణుమాత్రపు టవినీతి అంటని నాయకుడు!!
4. కరుణానిధి కూచ్చోమంటే నుంచుంటది, నుంచో అంటే ఒంగుంటది, ఒంగో అంటే సాగిలపడతది -అలాంటి కాంగ్రెసా "జాతీయతాభావంతో ఏకతాటిపై నడిపించే సత్తా ఉన్న పార్టీ"? భలే!
సన్నాసి తెలివి తేటలంటే ఇవే. రాజకీయాలలో మతం కంటే కులం ఎక్కువ పవర్ ఫుల్ గా పని చేస్తుంది అని కత్తి మహేష్ అన్నాడు. అతని మాటలు మరచిపోయారా? మతతత్వ పార్టీ అయిన బి.జె.పి. ఓడిపోవడం పెద్ద విచిత్రం కాదు.
ReplyDeleteWatch this video: http://www.youtube.com/watch?v=lqE4tBKJc84
ReplyDeleteఒక వీడియో లింక్ ఇవ్వబోయి ఇంకో వీడియో లింక్ ఇచ్చాను. క్షమించాలి. ఈ వీడియో చూడండి: http://www.youtube.com/watch?v=DZ1Wz9BQZ44
ReplyDelete