- గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా వాతావరణంలో సమతుల్యత తగ్గుతోంది.
- ఈ కారణాల వల్లనే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో అనే ఒకానొక వింత పరిస్థితి ఏర్పడింది.
- ఎల్ నినో అంటే సముద్ర ఉపరితల జలం అనూహ్యంగా వేడెక్కడమే.
- ఎల్ నినో రుతుపవనాల కదలికను స్తంభింపజేస్తుంది.
- ఈ దృగ్విషయం కారణంగా ఉన్నట్టుండి భారీ వర్షాలు పడతాయి. లేకుంటే అసలుకే బిగదీసుకుంటాయి.
- పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో వల్లనే ఈ ఏడాది మనదేశంలో నైరుతీ రుతుపవనాల్లో మందగమనం చోటుచేసుకుంది.
- వర్షాకాలం చివరి దాకా కరువు పరిస్థితులు తీసుకువచ్చింది.
- అంతలో భారీ వానలు పడటం మొదలైంది.
- ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో చాలాచోట్ల ఒక్క రోజులోనే 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- దీంతో వరదలు ముంచెత్తాయి. కరకట్టలు తెగాయి. అపార ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.
- వాతావరణంలో భారీ మార్పులు ఇక ముందు కూడా కొనసాగుతాయనే వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఇక ముందు రుతువుల్లో కూడా మార్పులు రావచ్చు. రాబోయే చలికాలం, ఆపైన ఎండాకాలంలో కూడా ఇలాగే విపరీతంగా వానలు పడవచ్చు. లేదా పూర్తిగా కరువుకాటకాలు తలెత్తవచ్చు.
- ఈ విపత్తులకు ప్రధాన కారణం చాలాకాలంగా మానవులు చేస్తున్న తప్పిదాలే.
- ఈ తప్పిదాలలో ప్రధాన వాటా అమెరికాదే కావడం గమనార్హం.
- వాతావరణ కాలుష్యంలో పెద్ద పీట అమెరికాదే. ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా అత్యల్పం.
- భూ వాతావరణం చుట్టూ ఉన్న ఓజోన్ పొరను చీల్చడంలోనూ, భూతాపం పెరిగేలా చేయడంలోనూ, విషవాయువులు ఎగచిమ్మడంలోనూ అమెరికా అనుసరిస్తున్న విధానాలే కారణం.
- ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పటి విపత్తుకు కూడా అమెరికానే బాధ్యుని చేయక తప్పడంలేదు. మరి మీరేమంటారు. మీ అమూల్య అభిప్రాయలను తెలియజేయండి.
kanvasas@gmail.com
ముందు ప్రతి దానికి అమేరికా ను ఆడిపోసుకొనేముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకొంటున్నమో లేదో check చేసుకొని వాళ్ల మీద పడటం మంచిదేమో కదా!
ReplyDeleteఇప్పటి విపత్తుకు ఈ కారణాలుకు కూడా అమేరికా నే కారణం అంటారా?
1. విచక్షణ లేకుండా క్రిష్ణా పరివాహకప్రాంతం మరియు catchment area లో అడవులను నరికివేయటం
2. ఏ రాష్ట్రానికా రాష్ట్రం తమ స్వంత ప్రయోజనాలకోసం( "కేంద్ర జన వనరుల సంఘం అనే దానిని నిర్వీర్యం లేక రాజకీయం చేసి") ప్రాజెక్ట్ లు ఇష్టా రీతిన కట్టేయటం. తద్వారా, ఎంతో కొంత ఎప్పుడూ సముద్రం లోకి వదిలేయాల్సిన నది నీటిని కొన్ని సంవత్సరాలు ఒక్క చుక్క కూడా వదలకుండా, దానివలన ఒక్క పర్యావరణనికే కాకుండా, నది చుట్టుపక్కల నదినీటిని పీల్చుకుంటానికి ఉండే ప్రాంతాలను దెబ్బతీయటం, నదికి చాల దగ్గరలో నివాస ప్రాంతాలను అనుమతించి, దాని ద్వారా కూడా ఆ ప్రాంతాలను తగ్గించివేయటం,
3. నదిని చుట్టుపక్కల, కొన్నిచోట్ల అయితే నదిలోపల కూడా ఇసకకోసం ఇష్టం వచ్చినట్లు తవ్వివేయటం దానిద్వారా అవసరం అయ్యినప్పుడు నది సరిగా flow అవ్వదు అని తెలిసినా3.
4 అన్నిటికంటే, ఎప్పటినుండో common sense తో, సాగర్ ను నిండుగా, శ్రీశైలం ను ఖాళీగా ఉంచే పద్దతికి, తమ సొంత ప్రయోజనాలకోసం మంగళం పాడి,చచ్చి దేముడు అనికొలవబడుతున్న ఆయన, ఎప్పుడు తెలుగు ప్రజానీక రక్తాన్ని పూర్తిగా పవిత్రరక్తం గా మారుద్దామని తహతహ లాడుతున్న ఆయన వారసుని ప్రాజెక్ట్ల అవసరాలు వాటికోసం వద్దు వద్దు అన్ని మొత్తుకొంటున్నా కట్టిన head regulators,
4. ఇక catchment area లో వర్షం పడుతుంది, inflow ఉంటుంది అని తెలిసినా దేముని బిడ్డ ఏమనుకొంటాడో నని, శ్రీశైలం నుండి ముందా నీళ్లు వదలని వెన్నుముక లేని ఇంజనీర్లు
5. NTR పేరుతో మొదలెట్టి పూర్తి అయిన పులిగడ్డ bridge కు పేరు మార్చి తమ తండ్రుల పేర్లు పెట్టించుకోవటం లో ఉన్న ఉత్సాహం బీటలు, గండులు బడిన కరకట్ట లను బాగు చేయటం లో ఉండని మన నాయకులు
6. ఎన్నో వేళ్ల సంత్సరాలనుండి సముద్రపు పోటు ను తాట్టుకోవటం కోసం సహజం గా ఏర్పడిన క్రిష్ణా ప్రాంతపు మడ అడవులను, వానపిక్ లు, పవర్ ప్రాజెచ్క్ట్ ల కోసం, రాత్రికి రాత్రే నరికి వేయించిన మన చచ్చిన దేముడు ఆయన అనుచర గణం
పైన వాటి అన్నిటికీ , అమేరికా నే కారణం కదండీ నారదుడు గారు. ఒక వేలు ఎదుటి వాడివైపు చూపిస్తున్నప్పుడు ఎన్ని వేళ్ళు (మనవే) మనవేపే చూపిస్తూఉంటాయో ఒక్క సారి ఆలోచించండి. ఇంకో భాషలో చెప్పాలంటే మన ఇంట్లో ఉప్పుచేపను కాలుస్తూ, పక్కనోడి ఇంట్లొ చికెన్ కూర వాసన గురించి "కామెంట్" చేసినట్లు ఉంది మీ బాధ.