ఈ సృష్టిలో ఏవిఎందుకు జరుగుతాయో తెలుసుకోగలిగితే మనిషి కూడా దేవుడైపోతాడు. ఈ క్షణానికి ఈ దేహం నీసొంతం. కానీ మరుక్షణంలో ఏమవుతుందో చెప్పలేం. రాబోయే విపత్కర పరిణామాలను సూఛాయగా గ్రహించి చెప్పగలిగిన జ్యోతిష పండుతులు దాదాపుగా అన్నిమతాల్లో ఉన్నారు. క్రైస్తవ మతగురువులు, జ్యోతిష పండితులు వైఎస్సార్ జాతకాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలించారు. రెండవసారి సీఎం అవుతారనీ, ప్రజాభిమానాన్ని చోరగొంటారని కూడా చెప్పారు. చివరకు అదే జరిగింది. కానీ... సెకండ్ టర్మ్ లో సీఎంగా ఆ జనహృదినేత ఆరునెలలుకూడా ఉండలేకపోయారు. హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులయ్యారు. ఇలా ఎలా జరిగింది? ఈ విపత్తను మతగురువులు, భవిష్యదర్శకులు ముందగా గ్రహించలేకపోయారా...?
ఇది నిజం కాదు. భవిష్య దర్శకులు ముందుగానే పసిగట్టారు. రెండవసారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత మతపరంగా పుణ్యస్థలమైన జెరూసెలం వెళ్ళారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయమన్నారు. అదే సమయంలో ఆయనకు ఓ చేదునిజం తెలిసింది. సెకండ్ టర్మ్ ఆర్నెల్లు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటుందని క్రైస్తవ జ్యోతిష పండితుడొకరు చెప్పారు. వైఎస్సార్ ఒక్కసారిగా షాకయ్యారు. తనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు. ప్రజల గురించి తపిస్తున్న వైఎస్సార్ ని చూసి క్రైస్తవ పండితులు, మత గురువుల హృదయాలు ద్రవించాయి. వెంటనేవారు, వైఎస్సార్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ తన `జీవితకాలమంతా' ముఖ్యమంత్రిగానే ఉండేలా చూడు ప్రభువా...అంటూ ప్రార్థనలు చేశారు. ప్రభువు తప్పక కరుణిస్తారనీ, మీరు చివరి శ్వాసవరకూ సీఎంగానే ఉంటారని ఆ పండితులు శుభాశీస్సులు అందించారు.
అలా శుభాశీస్సులు అందుకున్న తరువాత, వైఎస్సార్ రాష్ట్రానికి తిరిగివచ్చారు. జ్యోతిష పండితులు చెప్పిన మాటలను విశ్లేషించారు. సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపు ఎలా పోతుందాఅని ఆలోచించారు. కెవీపీ వంటి వారిని సలహాలు అడిగారు. మెజారిటీలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలంటే అది మైనార్టీలోకి జారుకోవాలి. తెలంగాణా లేదా మరేదైనా ఆందోళన వచ్చి సీనియర్లు, తనంటే గిట్టని వాళ్లు రాజీనామాలకు సిద్ధపడాలి. ఒకవేళ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సివస్తే కొంతమంది ఎమ్మెల్యేలు జారుకున్నా, ఆ లోటును భర్తీ చేయడానికి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకే వైఎస్సార్ `ఆకర్ష' పేరిట వల విసిరారు. ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినా తన ప్రభుత్వం మైనార్టీలోకి జారకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇతర పార్టీల వారికోసం తలుపులు బార్లాతెరవడం మొదలుపట్టారు. వైఎస్సార్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ వైఎస్సార్ అంతరంగంలోని ఆందోళనను మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. వైఎస్సార్ లోపల మదనపడుతున్నా, పైకి మాత్రం చెక్కుచెదరని చిరునవ్వులతోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో - `చూడు, చంద్రబాబూ, నువ్వెన్నాళ్లు ఉంటావో, నేను ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి. ప్రజలచేత మంచి అనిపించుకోవాలి' అంటూ వేదాంతధోరణిలో మాట్లాడారు. అయినా ఆమాటలను మీడియాగానీ, వైఎస్సార్ సన్నిహితులుగానీ అంతగా పట్టించుకోలేదు. ఆయన సహజధోరణిలోనే మాట్లాడారనే అంతా అనుకున్నారు. వైఎస్సార్ లోపల అగ్నిగుండం రగులుతోందనీ, ప్రజాసేవ ఏక్షణంలో ఆగిపోతుందోనన్న దిగులు పెరిగిపోతుందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
సెప్టెంబర్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైఎస్సార్ ప్రజలకు మరింత చేరువకావడం కోసం `రచ్చబండ' కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. వాతావరణం సరిగాలేదని ఇంట్లో సతీమణి వారించినా, మంత్రల్లో కొందరు అడ్డుతగిలినా ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్సార్ అడుగు ముందుకేవేశారు. `హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రానివ్వకుండా అదే చిరునవ్వుతో హెలికాప్టర్ ఎక్కారు. తోడువచ్చిన వారు చెబుతున్న వీడ్కోలుకు ప్రతిస్పందనగా తానూ చేయి ఊపరు. ఆ చిరునవ్వుతోనే ఆకాశంలోకి ఎగిరారు. ఆ నవ్వుమోముతోనే అదనంత ఎత్తుకు ఎగిరిపోయారు.
జ్యోతిష పండితులు చెప్పేందే నిజమైంది. ప్రియతమనేత వైఎస్సార్ సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపే ముగిసింది. వారు చేసిన ప్రార్థనలు కూడా ఫలించాయి... వైఎస్సార్ జీవితాంతం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. చివరి శ్వాసదాకా ప్రజాసేవకోసమే తపించారు. కానీ విధిని ఎవ్వరూ తప్పించలేరు. మరణ రహస్యాన్ని ఏ జ్యోతిష పండితులు కూడా ఛేదించలేకపోయారు.
-సీహ
meeru..manchi source ichhina samaacharam merake..idi raasaara? Nijamgaa jerusalemlo adi jarigindaa? vintagaa vundi
ReplyDeleteమీరు ఇంతకముందు "కాగడా" లాంటి పత్రికలలో గాని, ఈమధ్యన TV9 లాంటి వాటిలలో కాని పనిచేసిన అనుభవమో, లేకపోతే కనీసం మన తెలుగు సినెమాల లలో ఇస్టొరీ లు వ్రాసే వాళ్ల దగ్గరయినా పైచేసిన అనుభవమో తప్పకుండా ఉంది కదూ :)
ReplyDeleteక్రైస్తవ మత జ్యోతిష పండితులు మరో ప్రార్థన కూడా చేసరంట ...!! నేత చావు గాలిలో గానీ భూమిపై గానీ వుండ కుండా వుండాలని దీవించారంట ....అది కూడా జరిగింది....!! నేను జెరుసలెం వెళ్ళినపుడు మత పెద్దలు ఈవిషయం నా చెవిలొ వూదారు....
ReplyDeleteఆమాటకొస్తే, కాలజ్ఞానంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రిందటే "రామా రామా యననివారలు రాలిపోదురు కాలిపోదురు" అని చెప్పారు.
ReplyDeleteఈ విషయానికి సంబంధించిన శ్లోకం ఇలా ఉంటుంది.
"ఏమొ ఏమొ ఎరుగకున్నారు.. ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదన ధూము ధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను
రామా రామా యననివారలు
రాలిపోదురు కాలిపోదురు."
కాబట్టి చచ్చిన శామ్యూల్ రెడ్డి కూడా, అనుక్షణం క్రైస్తవ మతాభివృద్ధి కోసం కృషిచేసి, ఆ ప్రయత్నంలో తిరుమల ప్రతిష్ట దిగజార్చటానికి ప్రయత్నించి, విఫలమయ్యి, చివరికి ఆ వేంకటేశ్వరుని ఆగ్రహంతో రాలిపోయి ముక్కలయ్యి కాలిపోయాడు.
కధ బావుంది... చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు...
ReplyDeleteచిన్నగా TV9 కథనాలను మించిపోతున్నారు :).
ReplyDeleteరుద్రకొండ మల్లికార్జున స్వామి మహిమ ఏమిటొ చూపించాడు. క్రైస్తవ మతానికి ఇచ్చిన విలువ కోసం మన దేవుళ్ళ సంపద ని దోచుకుందామని చుస్తే ఇలగే జరుగుతుంది.
ReplyDeletegood imagination & nice narration... cinema kadalu raasi chances kosam try cheyyochhu.....
ReplyDeleteమన దేశాన్ని వెయ్యి సంవత్సరాలు పైగా పరిపాలించిన బ్రిటిష్ వాళ్లు కాని, ముస్లింలు కాని తిరుపతి జోలికి వెల్లలేదు . దురుద్దేసంతో ఈ శామ్యూల్ రెడ్డి వేలు పెట్టాడు. దిక్కులేని కుక్క చావు చచ్చాడు.
ReplyDeleteశేషాచలం కొండ ఏడుకొండల్లో ఒకటి. దాని తల భాగం తిరుపతిలో ఉంటే, తోక భాగం నల్లమల ప్రాంతంలో ముగుస్తుంది. సరిగా అక్కడే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఏడుకొండల్నీ మతకేంద్రాలుగా మార్చాలన్న ప్రయత్నంతో ఆదిశేషుడు ఆగ్రహించాడు. ఫలితంగా తన తోకతో హెలికాప్టర్ ని ఒక్కటిచ్చుకున్నాడు.... ఈ కథ బాగుందా....ఎనీహౌ..గుడ్...కీపిటప్...
ReplyDelete"హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు."
ReplyDeleteమరి మీకెలా తెలిసింది?
కామెడీ బాగుంది :-)
ReplyDeleteసటైర్ బావుంది.. ఈ కామెడి డైలాగ్స్ అదుర్స్..
ReplyDeleteతనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు.
ఈ జోతిష్యం విషయం బాబుకి కూడా తెలిసివుంటుంది.. అందుకే నువ్వు ఫినిష్ అవుతావొ నేను ఫినిష్ అవుతానొ త్వరలొ తెలుసుతుంది అన్న మీనింగ్ వచ్చేల ఎదొ డైలాగు వేసాడు,
kevvvv...kekaaa
ReplyDelete