Monday, October 19, 2009

ఫోకస్ : సాక్షి `రాసింది' కుట్రతోనే?


ప్రియతమనేత వైఎస్సార్ దుర్మరణానికి దారితీసిన హెలికాప్టర్ దుర్ఘనటపై సాక్షి (అక్టోబర్ 19) దినపత్రికలో `కూలింది కుట్రతోనే?' అంటూ పతాకశీర్షికన విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఆరోజు, సెప్టెంబర్ రెండవ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవడంకోసం జనహృదినేత వైఎస్సార్ హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లాకు బయలుదేరిన కొద్దిసేపటికే నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. ఇది జరిగిన 50 రోజులకు సాక్షి పత్రికలో కుట్రతోనే హెలికాప్టర్ కూలిందన్న అర్థం వచ్చేలా ఒక కొశ్చన్ మార్క్ తగిలించి ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివిన తరువాత అసలు కుట్ర ఏమిటో అర్థంకాక బుర్రగోక్కోవాల్సిందే. ఎవరైనా దుండగలు విద్రోహక చర్యకు పాల్పడి ఉంటారనే విషయాన్ని కొట్టిపారేయలేమని దర్యాప్తు అధికారులు అంగీకరించడం గమనార్హం అంటూ ముక్తాయింపు పలికారు. ఈ విషయం చెప్పడానికి ఇంత `సీను' (ఇంత కవరేజ్)అక్కర్లేదు.
  • మొత్తం కథనం చదివిన తరువాత పరిశోధనాత్మకంగా కొత్త విషయాలు ఏం చెప్పారో ఒక పట్టాన అర్థంకావు. కుట్ర ఉన్నదని తేల్చేటప్పుడు బలమైన పాయింట్లు ఉండాలి. నిజంగా అలాంటివి ఏవో ఉండిఉంటే వాటిని లోపల దాచేసుకుని (చెప్పాలనుకున్న అసలు సంగతులు చెప్పకుండా) సాదాసీదా అంశాలు, గ్రాఫ్ లు, చిత్రాలతో పేజీ నింపేశారు.
  • ఇదంతా చదివిన వారికి హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న భావంకంటే, అసలు ఈ కథనాన్ని రాయడంలోనే రాజకీయ మతలబు ఉన్నదన్నట్టు అర్థమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఏ లక్ష్యంతో ఈ అస్త్రాన్ని సంధించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
  • కుట్రఏమిటో చెప్పకుండా, ఆ కుట్ర ఎవరు పన్నారో తెలుపకుండా నాన్చుడి ధోరణిలో రాయడం వల్ల ఆ పత్రిక ఏం సాధించాలనుకుంటున్నది?
  • ఎవరో గిట్టని వాళ్లు మన ప్రియతమనేత ఎక్కిన హెలికాప్టర్ ని కూల్చేశారని చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నట్టుండి అలజడి పెరిగిపోదా...దానివల్ల ఎవరికి లాభం?
  • ప్రజల్లో తలెత్తే అలజడి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయదా?. ఇది ప్రభుత్వ పనితీరుని స్తంభింపచేయవచ్చు. ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే తప్పకుండా మనస్తాపం కలుగుతుంది.
  • ప్రజలనుంచి ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం పార్టీ అధిష్టానంమీద కూడా పడుతుంది.
  • పార్టీ కళ్లు తెరిస్తే, వాస్తవాలు గ్రహిస్తే, కొత్త సీఎం ఎంపికలో వేగిరపడుతుంది.
  • ఒక మహా కుట్రవల్ల మహానేతను కోల్పోయామన్న భావన నిజానికి తీవ్రభావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
  • `కుట్ర' అన్న పదమే అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని ప్రయోగించడంద్వారా ఎవరు ఏమి ఆశిస్తున్నారన్న సందేహం కలుగుతుంది.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మీడియా కచ్చితమైన సాక్షాధారాలు లేకుండా కేవలం దర్యాప్తు బృందం ఎప్పుడో , ప్రారంభదశలోనే చెప్పిన అంశాల ఆధారంగా కుట్రతోనే కూలినట్టు రాయడం ఏమేరకు సమంజసం. ఇదంతా చూస్తుంటే సాక్షి పత్రికే కుట్రతో రాసిందని జనం అనుకోరా? మరి దీనికి ఆ పత్రిక ఏమని సమాధానమిస్తుంది?
నారాయణ...నారాయణ...

4 comments:

  1. జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కేటట్లు లేదుకదా అందుకేనేమో ఇన్నాళ్ళు కనిపించని కుట్ర ఇప్పుడు కనిపిస్తోంది సాక్షికి.దీనికి సాక్ష్యముందా?

    ReplyDelete
  2. జగన్ వ్యక్తి గాదు, శక్తి అని ఎవరో ఇంతకముందు బాకా ఊదినట్లు ఉన్నారు, బ్లాగ్లోకం లో :)) అది ఎటువంటి శక్తో ఇప్పుడు సాక్షి వార్త చూసే దాకా అర్ధం కాలేదన్నమాట :(

    ReplyDelete
  3. ఒక సన్నాసి కాదు, అనేక మంది సన్నాసులు బాకా ఊదారు. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బాకా ఊదిన వాళ్ళు కూడా ఉన్నారు.

    ReplyDelete
  4. Kutra chesindhi Mr.Jagan ayyundochu..anni safe side set chesukonaaka vere vaalla meeda ki netti..manodi pani chesukotaani ki ...ee pasa leni story tayaaru chesaadu.....vaarasatvam gaa sampaadinchina telivi tetalu kadhaa

    ReplyDelete