Wednesday, October 21, 2009

రోశయ్యకు కొండా సురేఖ సలాం

అసంతృష్ట మంత్రులంతా నెమ్మదిగా రోశయ్య పంచన చేరుతున్నారు. ఆయనకు సలాంలు కొడుతున్నారు. సీఎల్పీ సమావేశం పెట్టేలోగా మంత్రులంతా రోశయ్యకు తమ పూర్తి మద్దతు తెలపాలనీ, అప్పుడే సీఎల్పీ మీటింగ్ ఉసెత్తాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. వైఎస్సార్ మరణంతో ఒక్కసారిగా భావోద్వేగం ఎగిసిపడిన నేపథ్యంలో తొందరపడకుండా తగిన సమయంలో నే నిర్ణయం తీసుకోవాలని సోనియా భావిస్తున్నారు.
ఆనం, బోత్సా, రఘువీర వంటి వారు ఒక్కొక్కరుగా తోకముడుచుకుని రోశయ్య చెంతకు వస్తుంటే, కొండా సురేఖ మాత్రం కొరకరాని కొయ్యలా మారిందని జనం ఇప్పటికీ అనుకుంటున్నారు. అయితే, ఇందులో నిజంలేదు. కొండా సురేఖ కూడా రోశయ్య మాస్టారిని శరణుజొచ్చింది. రోశయ్యను తాత్కాలిక సీఎంగానే చూస్తూ, సీఎల్పీ మీటింగ్ పెట్టాయాల్సిందేనంటూ తెగ డిమాండ్ చేస్తున్న సురేఖలో ఇప్పుడిప్పుడే భావోద్వేగం తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్ కుటుంబం చేసిన మేలుకంటే, ఉన్నపదవే ముఖ్యమంటూ ఆమె శ్రేయోభిలాషులు హితవు పలకడంతో సురేఖ మెత్తబడినట్టు తెలుస్తోంది. రహస్యంగా రోశయ్యను కలిసి, తప్పులుంటే క్షమించమంటూ అర్థించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఉన్నట్టండి ప్లేట్ తిప్పేయలేననీ, అందుకు కొంత వ్యవధి కావాలని రోశయ్యను కోరారట. పెద్దాయన పెద్దమనసుతో ఒకే అనడంతో సురేఖ ఇప్పుడు వ్యూహాత్మకంగా మీడియా ద్వారా అంచెలంచెలుగా మొత్తబడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విశ్వసనీయంగా తెలిసింది. మరో వారం రోజుల్లో కొండా సురేఖ భేషరుతుగా, బహిరంగంగా రోశయ్య మాస్టారికి మద్దతు ఇవ్వడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-కణ్వస

2 comments: