Sunday, November 1, 2009

ఫోకస్: పీఆర్పీ కాంగ్రెస్ పాలె`కాపు'

మెగాస్టార్ చిరంజీవి ఏ లక్ష్యంతో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఆ లక్ష్యాన్ని తుంగలోకితొక్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడంతో ఇంతకాలంగా వేసుకున్న ముసుగు తొలిగిపోయినట్టైంది. అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే అధికార కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడానికి. ఈ సంగతి ముందుగానే పసిగట్టడం వల్లనే అసలు ఈ పార్టీనే మొగ్గతొడగకుండా చేయాలని అప్పట్లో కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. దాసరి నారాయణరావు వంటి సీనియర్లను రంగంలోకి దింపి చిరంజీవికి అనేక విఘ్నాలు సృష్టించారు. చివరకు చిరంజీవి పర్సనల్ లైఫ్ లో లొసుగులు బయటకులాగే ప్రయత్నాలు జరిగాయి. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ వివాహం అనంతరం నూతన దంపతులకు అండగా ఉండేవిషయంలో కూడా కాంగ్రెస్ పరోక్షంగా జోక్యం చేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. చిరంజీవికి అడుగడుగునా మనస్తాపం కలిగించడానికి కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నంలేదు. అయినా చిరంజీవి ఒక శుభముహర్తాన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మార్పుకోసమే తాను ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకున్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేస్తామంటూ భీషణఘోషణ శపథాలు చేశారు. బలుపోవాపో నిర్ధారించుకోలేక సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టారు. మహాకూటమిలో చేరమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయ`బేరాలు' సాగించినా కాదుపొమ్మన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ప్రజారాజ్యం నేలమీద నడవటం మొదలుపెట్టింది. సరిగా ఇదే సమయంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్ ప్రజారాజ్యాన్ని దగ్గరతీయడానికి ప్రయత్నించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి కూడా వైఎస్సార్ వైఖరిపట్ల ఆశ్చర్యచికుతులై కాంగ్రెస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్సార్ దుర్మరణంతో ప్రజారాజ్యం అధికార కాంగ్రెస్ కి మరింత చేరువైంది. తిరుపతిలో ముఖ్యమంత్రి రోశయ్య, చిరంజీవి గంటన్నరసేపు రహస్య సమాలోచనలు జరిపినప్పుడే మెగాస్టార్ పొలిటికల్ మెగావ్యూహం అర్థమైంది. ఒక దశలో జగన్ వర్గీయులకు అండగా ఉండాలని కూడా అల్లుఅరవింద్ వ్యూహం రచించారు. అయితే అధిష్ఠానం జగన్ ని దూరంగా ఉంచడంతో సీను అర్థం చేసుకున్న ప్రజారాజ్యం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు లొంగిపోయింది. పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యాలను ఎంచుకుందో, వాటినన్నింటినీ తుంగలోకి తొక్కేసిన చిరంజీవి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీకి సిద్ధమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారంతో ఒక్క విషయం బాగా అర్థమైంది, అదేమంటే, చిరంజీవికి పాలి`ట్రిక్స్' బాగానే ఒంటబట్టాయి. ఇక ఫర్వాలేదు. ఎలాగో సిద్ధాంతాలులేని పార్టీగానే ముద్రపడింది కనుక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పంచన పాలె`కాపు'గా ఉంచడమే మంచిది.
- కణ్వస

6 comments:

  1. బ్రహ్మాడంగా రాసావు గురూ.అసలు ఈ రాజకీయాలు చూస్తుంటె రోత పుడుతోంది.
    మీకు నా అభివాదాలు.
    విజయ

    ReplyDelete
  2. మంచి విశ్లేషణ. అరచేతి వెనకాల సూర్యుడిని దాచేసారు. ఫక్తు వ్యాపార లక్షణాలు బయటపెట్టుకున్నారు.

    ReplyDelete
  3. సిద్దాంతాలు లేని పార్టీలనే ప్రజలు ఆదరిస్తున్నారని ఆలస్యంగా తెలుసుకు న్నట్టున్నారు ,మనుగడ కోసం తప్పదుగ ......

    ReplyDelete
  4. charanjeevi vacchindey prajadhanam kosam.athaniki unnadi kula gajji,kaavaalsindi prajala dabbu-dabbu kosam edaina chese vedhav

    ReplyDelete
  5. కాంగ్రెస్ పంచన పాలె`కాపు'గా ఉంచడమే మంచిది.

    Well Said. But I feel bad for his supports though. They (atleast some of them) thought PRP was a genuine political party and a real alternative to Cong & TDP.

    ReplyDelete
  6. He deceived all his folowers

    He is after money and power

    He doesn't need the first one he has enough

    He will not reach anywhere close to the second one

    thank God. the demise has come soon before much damage is done

    "Jhendaa peekeddam" EENADU was not wrong on that day.

    ReplyDelete