Thursday, November 5, 2009

`గ్రేటర్' కేసీఆర్ ఔట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి టిఆర్ఎస్ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమమే తమ టార్గెట్ అని కేసీఆర్ తెల్చిచెప్పేశారు. `గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకోలెక్కకాదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పోటీ చేయం. తెలంగాణ ఉద్యమం జోరేమిటో చూపిస్తాం...' అంటూ ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు. ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారట.
ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అంటున్నారు.
తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కొసమెరుపు: కేసీఆర్ మాటలు ఇలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు.

1 comment:

  1. కే సి ఆర్ తెలంగాణా ఉద్యమానికి ఎంత మంచి చేసాడో అంత చెడూ చేసాడు!
    ఎందరినో ఉత్తేజపరిచాడు,
    కదిలించాడు.,
    ముందుకు నడిపించాడు,
    తెలంగాణా వాదాన్ని అన్ని పార్టీల ఎజెండాలోకి చేర్చాడు,
    రాష్ట్ర పతి చేత,
    ప్రధాన మంత్రి చేత ,
    సోనియా గాందీ చేత జై తెలంగాణా అనిపించాడు,
    జాతీయ స్థాయిలో ప్రణబ్ కుమార్ కమిటీ , రాష్ట్ర స్థాయిలో రోశయ్య కమిటీ (అవి ఎంత లత్తకోరు కమితీలయినా కావచ్చు గాక ) వేయించాడు.

    అట్లాగే
    తన నోటి దురుసుతనం, దొరతనం, స్వార్ధం ఇంకా చెప్పాలంటే ఆంద్ర జ్యోతి ఎడిటర్ అన్నట్టు "మదం" కారణంగా ముసుగు దొంగలనూ, స్వార్ధ పరులనే కాదు ఎంతోమంది నిస్వార్ధ పరులను, తెలంగాణా వాదం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని వాళ్ళను ఉద్యమానికి చేజేతులా దూరం అయ్యేట్టు చేసాడు.

    గతం గతహ!
    ఇప్పటికైనా కే సి ఆర్ తన తప్పులను సరిదిద్దుకుని, ఇప్పుడు అన్న మాట మీద చివరి వరకూ నిలబడితే గత తప్పు లన్నింటినీ తెలంగాణా ప్రజలు క్షమించి ఆయనను నెత్తిన పెట్టుకుని పూజిస్తారు.
    చూడాలి ఏంచేస్తాడో!

    ReplyDelete