Thursday, November 5, 2009

రోశయ్యకు సోనియా ఏం చెప్పబోతున్నారు?

రోశయ్య హస్తిన యాత్ర ఖరారైంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రోశయ్య ఢిల్లీవెళ్ళి మేడం సోనియాను కలవబోవడం ఇదే మొదటిసారి. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తూ కంట్లో నలుసుగా మారిన నేపథ్యంలో రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను సోనియాకు వివరించడానికే తాను ఢిల్లీ వెళుతున్నట్టుగా రోశయ్య చెబుతున్నా ఆమె ఏం చెప్పబోతున్నారో, రోశయ్య మాస్టారు ఆ తరువాత ఏం చేయబోతున్నారో ఈపాటికే అందరికీ అర్థమైంది. మేడం సోనియా సీఎం రోశయ్యతో ఇలా చెప్పేవచ్చు....
  • మీరు, కొందరనుకుంటున్నట్టుగా తాత్కాలిక ముఖ్యమంత్రికారు. మీరు హ్యాపీగా రూల్ చేసుకోండి.
  • జగన్ వర్గీయుల నుంచి ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మేం చూసుకుంటాం.
  • వీలైనంత త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసుకోండి. నా నుంచి ఎప్పుడూ మీకు గ్రీన్ సిగ్నలే.
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి.
  • ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మేం చెప్పినట్టు మీరు నడుచుకోండి. గ్రేటర్ ఎన్నికల్లో తోకజాడించే నాయకుల పేర్లు పంపించండి.
  • దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ బలోపేతమైంది. ఇలాంటి సమయంలో బలహీనపరిచే శక్తులను చూస్తూఊరుకోం. వాటిని ఎలా లొంగదీసుకోవాలో మాకు తెలుసు.
  • మీపని మీరు చేసుకోండి. మంచి సీఎంగా పేరుతెచ్చుకోండి. గుడ్ లక్....

2 comments:

  1. chilaka josyam lo manchi pravesham unnattu undi

    ReplyDelete
  2. బలే జోస్యం చెప్పారు.
    "ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి." - ఇది కాస్త విడ్డూరంగా ఉన్నది. ఫ్యాక్షనిస్టుల అండతోనే కాంగ్రస్ మన రాష్ట్రంలో ఇన్నాళ్లు బ్రతికింది. దాదాపు ఆ పార్టీలో వారే ఉంటారు. వారే పార్టీ బలం, ఊపిరి అంతా. ఇక ప్రజలకు వారు ఏమి సేవ చేస్తారో ఆ దేముడే ఎరుగు.

    ReplyDelete