- వైఎస్సార్ ఉన్నంతకాలం రాష్ట్రం కాంగ్రెస్ కు ఛరిస్మా ఉన్న నేత లోటులేకుండాపోయింది. అంతా తనొక్కడే అన్నట్టుగా వైఎస్సార్ చక్రం తిప్పారు.
- వైఎస్సార్ దుర్మరణంతో అనూహ్యమైన రీతిలో పార్టీలో గ్లామర్ పడిపోయింది. ఉన్న నాయకుల్లో సామర్థ్యం ఉన్నవారిలో జనాకర్షక శక్తిలేకపోవడమో, లేదా జనాకర్షక శక్తి ఉన్న నేతల్లో పాలనాసామర్థ్యం లేకపోవడమో ఆ పార్టీని వేధించింది.
- వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డికి నిస్సందేహంగా జనాకర్షణ ఉంది. అయితే, దుందుడుకు చర్యలతో ఆయన అధిష్ఠానానికి దూరమవుతున్నారు.సీఎం పదవి దక్కించుకోవడం కోసం పంతం పట్టడం పార్టీ అధిష్ఠానానికి నచ్చడంలేదు. అయితే ఆయనకున్న జనాకర్షక శక్తిని శంకించడంలేదు. ఫ్యాక్షనిస్టు ముద్రఉన్న నేతను ప్రోత్సహించి కొరివితో తలగోక్కోవడంకంటే, మరో యువనేతను ప్రోత్సహించడం మంచిదన్న ఆలోచన కాంగ్రెస్ శిబిరాల్లో వినబడుతోంది. వృద్ధనేతలు కూడా ఇందుకు అమోదముద్రవేశారు. తాము వెనుకఉండి నడిపిస్తామనీ, ముందుకు దూసుకుపోగల శక్తివంతుడు కావాలని ఇప్పటికే పలువురు సీనియర్లు చెప్పారు.
- ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెస్ దృష్టిలో పడ్డారు. ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుగానైనా మెగాస్టార్ ని దగ్గరకుతీసి ఆ తరువాత తమపార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ.
- ఇదే జరిగితే, జగన్ ని ఎదుర్కోగల ఆకర్షణఉన్న నాయకుడు కాంగ్రెస్ జేబులో ఉంటాడు. అందుకే ముఖ్యమంత్రి రోశయ్య తిరుపతిలో చిరంజీవితో సాగించిన రహస్య సమాలోచనప్పుడు ఓగట్టి హామీని ఇచ్చినట్టు తెలిసింది.గ్రేటర్ ఎన్నికలు కాగానే రోశయ్య తన వ్యూహాన్ని అమలుచేయవచ్చు.
- గ్రేటర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయానికి చిరంజీవి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా చిరుకు రోశయ్య మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చు. హోంమంత్రిగా చిరంజీవిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
- మంత్రి పదవి ఆశతోనే చిరంజీవి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. పనిలోపనిగా చిరంజీవి రూపంలో వచ్చిన సదావకాశాన్ని కాంగ్రెస్ నేర్పుగా ఉపయోగించుకుని జగన్ రాజకీయ భవితకు దెబ్బకొట్టవచ్చు.
- జగన్ ని కూడా `గ్రేటర్' ప్రచారంలో ఉపయోగించుకోవాలని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే ఒక వొరలో రెండు కత్తులు ఇమడవుకనుక జగన్ దీనికి దూరంగా ఉండవచ్చు.
- మొత్తానికి భవిష్యత్తులో జగన్ ప్రాభవాన్ని అడ్డుకునే శక్తిగా చిరంజీవిని ఉపయోగించుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడలా కనబడుతోంది. అదే సమయంలో మీడియానుంచి పాలిటిక్స్ లోకి వద్దామనుకుంటున్న రవిప్రకాష్ వంటి యువనేతలను కూడా కాంగ్రెస్ ఇదే తరహాలో వాడుకోవచ్చు.
- కణ్వస
very true.....
ReplyDelete