Monday, November 2, 2009

ఫోకస్: `సైలెంట్' గానే కూలింది

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ ఎవరి కుట్రతోనో కూలలేదు. వాస్తవం చెప్పాలంటే హెలికాప్టర్ చాలా సైలెంట్ గా కూలింది. ఆ క్షణాల్లో ఓ నిశ్శబ్దమృత్యుగీతక మాత్రమే వినిపించింది. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ని విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
  • ప్రమాదం జరగడానికి ముందు హెలికాప్టర్ కూర్చుని ప్రయాణం చేస్తున్నవారెవరూ మాట్లాడుకోలేదు.
  • కనీసం పైలెట్లు కూడా ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు.
  • నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మాటలెక్కడా వినబడలేదు.
  • హెలికాప్టర్ దారితప్పిందన్న సంగతి కూడా పైలెట్లు పసిగట్టలేకపోయారు.
  • జోరున వర్షం, ఆపైన మబ్బులు దట్టంగా కమ్ముకోవడంతో వారికి ఎదురుగా ఉన్న కొండ కనిపించలేదు.
  • ఆ సమయంలో హెలికాప్టర్ 140 నాట్స్ (గంటకు 259 కిలోమీటర్ల వేగం)తో వెళుతున్నది. (ఒక నాట్ అంటే గంటకు 1.85 కిలోమీటర్ల వేగం)
  • ప్రమాదం వేళకి హెలికాప్టర్ హైదరాబాద్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • హెలికాప్టర్ లో ఇంధనం బాగానే ఉంది. మరో రెండున్నర గంటలపాటు నిర్విరామంగా ఎగురగలదు.
  • ఉదయం 9గంటల 13 నిమిషాలకు హెలికాప్టర్ తో శంషాబాద్ రాడార్ సంబంధాలు తెగిపోయాయి.
  • మొత్తం ఘటనలో ఎవ్వరినీ నిందించాల్సిన పనేలేదని అర్థమవుతోంది. ఇందులో కుట్ర లేనేలేదన్న విషయం కూడా అవగతమవుతోంది.
-కణ్వస

2 comments:

  1. UPA సారీ సారీ CBI, DGCA,... పరిశోధనా పత్ర౦ లో ఇ౦తక౦టే స౦చలనాలు ఎదురుచూశారా? ఈ రిపోర్టులోని విషయాలు enquiry మొదలవక ము౦దే చాలా మ౦దికి తెలుసు.

    ReplyDelete