Saturday, November 14, 2009
రోశయ్య నోట `చిరు'నామస్మరణ
గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టినా కాంగ్రెస్ లో ఆశలు చావలేదు. ఈసారి మీడియాకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి బేరసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బిహైండ్ ద కర్టెన్ వ్యవహారం కాగా, రోశయ్య మాస్టారు `చిరు'నామస్మరణకు దిగారు. బాలలదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరం నటుల్లో చిరంజీవి అంటే తనకు మక్కువ అంటూ ముచ్చటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా, దానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి. చిరంజీవి గొప్పనటుడంటూ రోశయ్య కితాబు ఇచ్చారు. చిరంజీవిని నెమ్మదిగా కాంగ్రెస్ ముగ్గులోకి దింపడంకోసమే రోశయ్య మాస్టారు ఇలా చిరునామస్మరణ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
రోశయ్య గార్కి చిరంజీవి అంటే ఇష్టం ఉంటే ఉండవచ్చు గాక ... అంతా మాత్రాన ఆయన గొప్ప నటుడై పోతాడా ? అసలు ఆయన నట జీవితంలో అంత గొప్ప పాత్రలు ఏం పోషించాడు చెప్పమనండి. నాగార్జునలా అన్నమయ్య పాత్ర పోషించాడా ? కమలహాసన్ లా విభిన్న పాత్రలు పోషించాడా ?ఎన్.టి.ఆర్ లా రాముడు , కృష్ణుడు పాత్రలు వేసి మెప్పించాడా ? దుర్యోధనుడంటే ఎస్.వి.రంగారావు గుర్తుకొస్తాడు, యముడంటే కైకాల సత్యనారాయణ గుర్తుకొస్తాడు.అలాగే అతను మాత్రమే గుర్తుకొచ్చే గొప్ప పాత్రలు ఏం చేసాడు అని ఆయన గొప్ప నటుడై పోతాడు. డాన్సులు , ఫైటింగులకు తప్ప ఆయన ఎందుకూ పనికి రాడు. చిరంజీవి పెద్ద సినీ హీరో ... కానీ గొప్ప నటుడు కాడు. ఆయన రిటైర్డ్ అయ్యేనాటికి ఆయనకి సంతృప్తినిచ్చే పాత్ర లేదా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర ఒక్కటైనా ఉందా ? ......చెప్పమనండి చూద్దాం !!!!!!!!!
ReplyDeleteరుద్రవీణ, స్వయంకృషి, మంచుపల్లకి
ReplyDeleteఅసలు కథ త్రోవ తప్పడం అంటే ఇదేనేమో -:)
ReplyDeleteannamayya patra vesi nagarjuna chala papam chesadu. Siggu Siggu nagarjuna goppa natudu ani cheppataniki. chiranjeevi has his own creditablity. He acted in so many good roles which inspires the entire youth and as well as it stand telugu movie in top possition.
ReplyDeleteYes Chiru is great hereo. He is 10000% better than Balakrishna, Nagarjuna, Venkatesh & other present hero's in telugu industry. He is the ICon for telugu movie stamina in entire india. That is what we need.
ReplyDeleteHe is simple superb!
రుద్రవీణ, స్వయంకృషి, మంచుపల్లకి సినిమాలలో చిరంజీవి వేసిన పాత్రలు అతను మాత్రమే చేయగలడా ... ఇంకెవరూ చేయలేరా ?
ReplyDelete