Wednesday, November 4, 2009

ఎడిటర్స్ వాయిస్: `వందేమాతరం' పాడొద్దంటారా?


జాతీయగేయం `వందేమాతరం' పాడవద్దంటూ ముస్లీం మతాధికారుల అత్యున్నత సంస్థ `జమైత్ ఈ ఉలేమ హింద్' (జెఈయు) తీర్మానించింది. ఉత్తరప్రదేశ్ కు ఈశాన్యంగా, ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బంద్ లో జెఈయు జాతీయ 30వ సర్వసభ్యసమావేశం నవంబర్ మూడున జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి పదివేల మంది ముస్లీం మత పెద్దలు హాజరయ్యారు. గతంలో (2006లో) దారుల్ ఉలూమ్ ముస్లీంలు వందేమాతరం గేయాన్ని పాడకూడదంటూ జారీ చేసిన ఫత్వాను ఈ సమావేశం ఆమోదిస్తూ తీర్మానించింది. వందేమాతరం గేయంలోని కొన్ని పంక్తులు ఇస్లాం మతభావాలకు విరుద్ధమని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. వందేమాతరం విధిగా పాడాలని ఎవ్వరూ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వీరు ఉటంకించారు. వందేమాతరం అంటే తల్లికి నమస్సరించడమే అవుతుందనీ, తమ మతంలో తల్లికి నమస్కరించడమన్నది ఉండదనీ, తాము తల్లిని ప్రేమిస్తామేకానీ, ఆరాధించమని ఈ సంస్థ మతపెద్దలు తేల్చిచెప్పారు. ఏకేశ్వరోపాసనపట్ల తమకున్న విశ్వాసాన్ని చెల్లాచెదురు చేసేలా ఈ జాతీయగేయం ఉన్నదని వారంటున్నారు.
ఇదే సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం హాజరవడం మరో వివాదాస్పద అంశం. వందేమాతరంపై జెఈయూ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిగంటల్లోనే చిదంబరం అక్కడకు చేరుకుని ఇస్లాం మతాన్ని పరాయి మతంగా చూడలేమనీ, మన ముస్లీంలు గౌరవనీయులైన భారతీయ పౌరులని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమావేశాన్ని ఈటివీ (ఉర్దూ చానెల్) ప్రసార హక్కులు తీసుకోవడం మరో విశేషం.
125 సంవత్సరాల కిందట యావత్ జాతిని కదిలించిన వందేమాతరం గేయంలో ఇప్పుడు తప్పులు వెదకడం సమంజసమా? వందేమాతరం గేయంలోని `మాత' అంటే సొంత తల్లికాదు. మాతృభూమి (స్వదేశం) అని అర్థం. సొంతతల్లికి నమస్కరిస్తారా, లేక ప్రేమిస్తారా, కాక గౌరవిస్తారా అన్నది వారివారి మతాచారాల ప్రకారం ఉంటేఉండవచ్చు. కానీ దేశభక్తిని చాటుతూ, మాతృభూమికి నమస్కరించమంటూ సాగే చైతన్య గీతికపై ఇంతటి వివాదం రగిలించడంలో ఈ మతపెద్దల అసలు ఉద్దేశాలు ఏమిటి? `మాత' అన్న శబ్దంలోని విశేష అర్థాన్ని గ్రహించకుండా మొండిగా వాదిస్తూ, భారతదేశంలో ఉంటూ, అన్ని సౌకర్యాలు పొందుతున్న ముస్లీం సోదరులు జాతిఉద్దీపనా గేయాన్ని ఆలపించమంటూ తెగేసి చెప్పడం కుసంస్కారమే అవుతుంది.
జమైత్ ఈ ఉలేమా హింద్ భారీ ఎత్తున నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో వందేమాతరం వివాదం నిజానికి అతి ముఖ్యమైన అంశం కాదు. సామాజిక, ఆర్థికపరమై వివక్షకు గురవుతున్న ఇండియన్ ముస్లీంలు వాటికోసం పోరాడాలి. హక్కులసాధన కోసం నడుం బిగించాలి. అంతేకానీ, భారతదేశంలో ఉంటూ, ఆ దేశానికి చెందిన చైతన్య గీతికలను తప్పుపట్టడం, వాటిలో నానార్థాలు వెతకడం మంచిదికాదు. ముస్లీంలంతా భారతీయులమే అనుకునే పక్షంలో ఇలాంటి వివాదాలు తలెత్తవు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నమైనదే, నిస్సందేహంగా.
(ఈ వివాదంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపించండి.)
-ఎడిటర్

26 comments:

  1. మొన్న' మా తెలుగు తల్లికి ' గేయం గురించి గొడవ. నిన్న ఏకంగా వందే మాతరం గురించి. వంద ఏళ్ళగా లేని అభ్యంతరం కొత్తగా ఇప్పుడు వచ్చిందంటే, గుడ్డుకి ఈకలు ఎలా పీకాలా అని చూడడమే, ఏదొక కాంట్రోవేర్సి ఎలా చెయ్యాలా అని కాచుకు కూర్చునట్టుంది. అయినా బోలెడు సమస్యలతో ప్రజలు సతమవుతుంటే ఇప్పుడు ఇలాటివి కొత్త సమస్యలని, గొడవ లని తెచ్చిపెడున్నాయి.

    ReplyDelete
  2. ఇందులో వివాదం ఏమీ లేదు.వివాదం చేస్తున్నది ఒకవైపు బిజెపి,మరోవైపు మీడియా.
    ముస్లిం నమ్మకాల ప్రకారం దేశాన్ని "పూజించడం" జరగదు,దేశాన్ని "ప్రేమిస్తా"రంతే. కాబట్టి ఈ గీతాన్ని పాడకూడదని నిశ్చయించారు. ఇందులో ఉన్న వివాదమేమిటి? వాళ్ళచేత నిర్భంధంగా పాడించి మీరు మేల్కొలిపే దేశభక్తి ఏమిటి? దానికి అర్థం పరమార్థం ఉంటాయా?

    ముస్లింలు ఈ దేశపౌరులు వారికి ఈ గేయంపాడాలా వద్దా అని నిర్ణయించుకునె హక్కుంది as individuals. కానీ ఇక్కడ జరిగింది ఒక మతసంస్థ ఈ ఫత్వా జారీ చెయ్యడం. అలా రాజ్యాంగేతర ఫత్వాలు జారీచెయ్యటం నిరసించదగిన విషయం. వీలైతే..ఎవరైనా ముస్లిం మిత్రుడితో ఒక PIL దాఖలు చెయ్యించండి. జెఈయు కుక్కినపేనై కూర్చుంటుంది.

    ReplyDelete
  3. జాతీయ గీతం పాడకపోయినా ఫర్వాలేదు అనే దుర్భాగ్యం మన దేశంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు.
    కత్తి మహేష్ కుమార్ గారు, రేపు వీళ్ళు జెండా 'వందనం' చేయం అంటే మరి ఊరుకుంటారా ?

    - శివ్.

    ReplyDelete
  4. వాళ్ళచేత నిర్భంధంగా పాడించి మీరు మేల్కొలిపే దేశభక్తి ఏమిటి?

    ముస్లింలు ఈ దేశపౌరులు వారికి ఈ గేయంపాడాలా వద్దా అని నిర్ణయించుకునె హక్కుంది as individuals. కానీ ఇక్కడ జరిగింది ఒక మతసంస్థ ఈ ఫత్వా జారీ చెయ్యడం. అలా రాజ్యాంగేతర ఫత్వాలు జారీచెయ్యటం నిరసించదగిన విషయం.

    మీతో ఏకీభవిస్తున్నాను

    దేశమా? మతమా? రాజ్యాంగమా? ఖురానా? ఏది ముఖ్యం అన్న విషయంలో ఈ ముస్లింమేధావుల అభిప్రాయాలు మారాల్సి వుంది. నా దృష్టిలో మతమైనా కూడా అంత rigidగా వుండటం మంచిదికాదు. ఏవో కొన్ని హిందూమత భావనలున్నంత (నేనైతే ఇస్లాంకి మాత్రమే సరిపడని భావాలు అంటాను) మాత్రాన అది పాడటంతగదు అనడం భావ్యం కాదు అని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే సూఫీ మత భావనలు కూడా ఇస్లాంకి వ్యతిరేకమే కదా. అసలు వహాబీలనడిగితే ప్రస్తుతం ఆచరించబడుతున్న ఇస్లామే ఇస్లాం కు వ్యతిరేకమనన్నా అంటారు.

    ఏదిఏమైనప్పటికీ దేశమ్మొత్తమ్మీదున్న ముస్లింలు ఏమి చేయాలని అని ఈ కొద్ది మంది బడుధ్ధాయిలు నిర్ణయించేయడం గర్హనీయం.

    ReplyDelete
  5. @శివ్: జనగణమన జాతీయగీతం,వందేమాతరం కాదు(its a national songs) కాబట్టి మీరు అంత గఠిగా బాధపడనఖ్ఖరలేదు.

    అయినా ఇక్కడ "వీళ్ళు" ఎవరండీ? What makes you think that JEU represents ALL Muslims????

    వందేమాతరం నేను కూడా పాడనండీ..బలవంతంగా పాడిస్తే అస్సలు పాడను. Thats my right.దాన్ని భారతీయ రాజ్యాంగంకూడా కాదనలేదు. కాబట్టి ఇక్కడ ముస్లింలు-హిందువులు అని తేడాపెట్టకండి. JEU పంధాను నిరసించండి, వాళ్ళ ఫత్వా రాజ్యాంగవిరుద్ధం హాస్యాస్పదమనండి. I have no issues కానీ ఈ సాకుతో అందరు ముస్లింలూ ఇంతే అనే బీజేపీ పాటపాడకండి. I am a Hindu and BJP doesn't represent me and its same with JEU,it doesn't represent all Muslims of India.

    ReplyDelete
  6. @Indian Minerva: నేను అందరు ముస్లింల తరఫునా చెప్పలేనుగానీ, నాకు తెలిసిన కొందరికి ఈ priority చాలా clear గా ఉంది. మతం ఖురాన్ వ్యక్తిగతం,రాజ్యాంగం- దేశం పౌరుడిగా వాళ్ళబాధ్యత. ఇది చాలా స్పష్టంగా తెలుసు.

    ముస్లింమతంలో ప్రగతి నిరోధక పంధాలు చాలా ఉన్నాయని వీళ్ళకీ తెలుసు. మార్పుకి అంతేస్థాయి వ్యతిరేకతా ఉందని తెలుసు. అయినా, ముస్లిం మేధావులు పోరాడుతూనే ఉన్నారు. మహిళల సమానత్వం కోసం,ఆర్థిక ఎదుగుదలకోసం,సర్వమానవ సౌభాతృత్వం కోసం ఎందరో ముస్లింలు సాటి ముస్లింలతో,ముల్లాల దౌర్జన్త్యాలతో,మౌల్వీల ఫత్వాలతో పోరాడుతూనే ఉన్నారు. వారిని సమర్ధించి సాగుతున్న హిందువులూ ఎందరో ఉన్నారు. ఇవి మనకు పట్టవు...ఎందుకంటే తిట్టడం-అపోహల్లో బ్రతకడంతప్ప మనం నిజాల్ని చూడం కనక..చూసినా వాటిల్లో పాలుపంచుకోం గనక.

    ReplyDelete
  7. @కత్తి మహేష్ కుమార్ said... "am a Hindu" హ హ హ :)

    ReplyDelete
  8. I am a Hindu but BJP doesnt represent me. Yes. Trust me. Please dont try to find out who represents me. You know the answer. The de- christianized christian goddess, Her Exalted Highness Sonia Maino [Peace Be Upon Her] represents me. The Lord God, in His Eternal Wisdom, drives my every action. It is His Will. It is His Will runs through my viens when I scoff at Hindus, and Hindus alone, for they are heathens. They are corrupt. I am the intellectual convert, a messenger of Lord God (yes, He is not tech savvy yet. Just human messengers. No Yahoo Messenger or Trillian Astra) with a mission to rescue these God Forsaken People from the jaws of HELL.

    Who else represents me? Are you kidding me? You don't know the answer? Stupids, you all are. The Anti National Indian media represents me. Go read the stuff and get a life. Education, I say. Educate yourself before arguing. You, Hindus, good for nothing don't know anything. That is a Thumb rule. That is my premise. It is bound to be true always, for the only keepers of Knowledge are Prists from Vatica. Don't you get it yet?

    And again you ask - who represents me. What the hyell is the matter with you man? Don't you see? Don't you get that I am a dechristianized christian with an agenda? Don't know my agenda is to criticise, condemn, oppose, lament, tout, scoff everything that is remotely Indian? Don't you know I sold my Soul to Jesus, because he paid my education and gave me a good career?

    You morons? you don't get it? Bitches, I will smite you!!

    With Lot of Love and Blessings from Kingdom of God

    Your 21st century Messenger

    Reverend Rajesh Rodriguez Pinto Kumar.

    "Screw. Ye Shall Be Granted"
    "Fear Thou Not, For Media is With Thee"
    -Madanapalli Yesayya, Amen!!

    ReplyDelete
  9. భారత మాత అంటే దుర్గాదేవి. దుర్గాదేవిని ముస్లింలు ఎలా పూజిస్తారు? వందేమాతరం గీతాన్ని ముస్లింల చేత వందేమాతరం బలవంతంగా పాడిస్తే మత ఘర్షణలు జరుగుతాయి. పంజాబ్ లోని ఒక స్కూల్ లో హిందూ విధ్యార్థులు తలపాగాలు వేసుకోవాలని రూల్ పెట్టడం వల్ల ఆ స్కూల్ మీద కోర్టులో కేసు వెయ్యడం జరిగింది.

    ReplyDelete
  10. మేము (కిరస్తనీ మరియు హిందు ముసుగులో ఉండే కిరస్తనీలము )మరియు పత్వాలు జారిచేసె మా సోదరులు మాత్రమే ఉత్తముండలం, మీరందరు పాతకుండలు. - ఆమెన్

    ReplyDelete
  11. @కత్తి మహేష్ గారు: మహేష్ గారూ... మీకు ఏదైనా ఈవిషయికంగా పోరాడుతున్న సంస్థ తెలిస్తే తెలియజేయగలరు. నేను వాళ్ళని ఉధ్ధరించడం ఉధ్ధరించకపోవడం నాభావాలు వాళ్ళతో ఏమాత్రం సరిపోలతాయో దానిమీద ఆధారపడటమ్మీదవుంటుంది. I don't love or hate people depending on of what religion they do follow/belong to. At least, I never did that.

    ReplyDelete
  12. ముస్లిముల అభ్యంతరాలేమో కానీ, నాకుండే అభ్యంతరాలూ నాకున్నాయి ఈ బెంగాలీ పాటల విషయంలో. దేశంలో పది శాతం జనాభాకీ అర్ధం కాని పాటల్ని అందలమెక్కించటం వెనక బెంగాలీ లాబీ ప్రమేయం ఉంది. ఆ పాటలు పాడేవాళ్లైనా మొక్కుబడిగా పాట్టమే తప్ప వాటి పూర్తి అర్ధాలు ఎందరికి తెలుసు?నూటికి తొంభైమందికి అర్ధం కాని భాషలో జాతీయగీతం ఉండటం ప్రపంచంలో మరే దేశంలోనన్నా ఉందా? అసలు ఐదో జార్జిని పొగుడుతూ టాగూర్ మహాశయుడు రాసిన పాటని మన జాతీయ గీతంగా నెత్తిన పెట్టుకోటమేంటి! జనగణమన, వందేమాతరం రెంటినీ తుంగలో తొక్కి 'సారే జహా సే అఛ్చా'ని జాతీయ గీతం చెయ్యాలి.

    ReplyDelete
  13. Whoever is this "Reverend Rajesh Rodriguez Pinto Kumar "..

    Hats off..

    ReplyDelete
  14. Manchupallaki dude,

    Who is John Galt? ;)

    Thou Shall Not Forget Me. Amen!!

    ReplyDelete
  15. కత్తి మహేష్ కుమార్ గారు,
    నేను కొంచెం గఠిగానే బాధ పడాల్సి వస్తోందండి. ఈ రోజుల్లో దేశం, దేశ చిహ్నాలు, దేశ సంపద, దేశ శ్రేయస్సు కన్నా నేను, నా మతం, నా హక్కులు, నా లాభం ఎక్కువని చెప్పే నవయుగ వైతాళికులు చాలా మంది వచ్చారు. నేను మీ మతం గురించి అడగలేదండి. దేశం (దేశ చిహ్నాలు) గురించి అడిగాను. ప్రశ్న మళ్లీ అడగమంటారా ? "రేపు వీళ్ళు జెండా 'వందనం' చేయం అంటే మరి ఊరుకుంటారా ?" వీళ్ళంటే ముస్లిములు కాదండి. జమైత్-ఈ-ఉలేమా-హింద్ (ఈ ఫత్వా జారీ చేసిన వెధవలు) మరియు కేంద్ర గృహ మంత్రి (అది చూస్తూ ఊరుకున్న వెధవ). రంగు కళ్ళద్దాలు పెట్టుకుని లోకాన్ని చూడకండి. ఇంతకీ, National Song ని తెలుగులో జాతీయ గీతం అనకుండా ఇంకా ఏమనవచ్చో చెప్పగలరా ?

    అబ్రకదబ్ర గారు,
    బెంగాలీ గీతాలని తుంగలో తొక్కి ఉర్దూ గీతాన్ని నెత్తికెక్కించుకోమంటారా (నాకు ఉర్దూ రాదు మరి) ? :-)
    మీ సమాచారం కోసం (fyi), వందేమాతరం (అంటే 1905 లో కాంగ్రెస్ ఆమోదించిన మొదటి రెండు చరణాలు) ఒక బెంగాలీ వాడిచే సంస్కృతంలో రాయబడినది. ఇంతకన్నా ఆమోదయోగ్యమైన జాతీయ గీతం ఇంకెక్కడ దొరుకుతుంది ?

    - శివ్.

    ReplyDelete
  16. @శివ్:జాతీయ గీతానికీ గేయానికీ తేడా తెలీని మీరు దేశ చిహ్నాల గురించి బాధపడటం కొంచం అతిశయోక్తిగా ఉంది. ముందు తేడా తెలుసుకోండి.తరువాత సాధికారంగా బాధపడండి. National anthem is compulsory and song is optional.Some Muslims are exercising that "option". Thats all.

    జమైత్-ఈ-ఉలేమా-హింద్ ఫత్వా కొత్తదేమీ కాదు.వాళ్ళు ఫత్వా జారీచేసినంత మాత్రానా వందేమాతరం పాడే ముస్లింలు పాడటం మానెయ్యటం లేదు. బలవంతంగా పాడాలి అంటేమాత్రం ఖచ్చితంగా మానేస్తారు.కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని చెయ్యొద్దనే చెబుతోంది.

    దేశచిహ్నాలను గౌరవించడానికి మనకు కొన్ని రాజ్యాంగపరమైన నియమాలున్నాయి. వాటిని ముస్లింలు కలసికట్టుగా ఉల్లంఘిస్తున్నారనుకోవడం మీ అపోహ. అలా జరిగితే దేశం పట్టించుకోవట్లేదనెది మీ ఊహ. So, please don't make an issue out of non issue.

    ReplyDelete
  17. ఉర్దూ పాటలు పాడమని చెప్పే అవకాశం లేదు. పంజాబ్ లో ఒక స్కూల్ లో హిందూ విధ్యార్థులు కూడా తలపాగాలు వేసుకోవాలని రూల్ పెడితే ఆ స్కూల్ యాజమాన్యం మీద కోర్టులో కేసు వెయ్యడం జరిగింది. పంజాబ్ లో 60% జనాభా సిక్కులు. 35% జనాభా హిందువులు. మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు. మన రాష్ట్రంలో ముస్లింల జనాభా 10% మాత్రమే. ఇక్కడ స్కూల్స్ లో ఉర్దూ పాటలు పాడమంటే 10% జనాభా కోసం మేము పాడాలా అని మిగిలిన 90% మంది అడుగుతారు. అయినా స్కూల్స్ లో ఉర్దూ పాటలు పాడిస్తారని డౌట్ ఎందుకు వచ్చింది?

    ReplyDelete
  18. కత్తి మహేష్ కుమార్ గారు,

    వందేమాతరం జాతీయ 'గేయం' అంటారా ? సరే, తేడా తెలిసింది.

    అయితే, "National anthem is compulsory and song is optional" అనే వివరణ మాత్రం భారత దేశానికి వర్తించదు.

    This is a generic statement which applies to majority of the nations, but not all of them. e.g., "God save the King/Queen" and "Rule Britannia" are considered as British National Anthem and National Song respectively.

    In the Indian context, the following statement by Dr. Rajendra Prasad on Jan. 24, 1950 during a session of Constituent Assembly of India, is considered as the final word.

    "The composition consisting of words and music known as Jana Gana Mana is the National Anthem of India, subject to such alterations as the Government may authorise as occasion arises, and the song Vande Mataram, which has played a historic part in the struggle for Indian freedom, shall be honored equally with Jana Gana Mana and shall have equal status with it".

    దీని ప్రకారం జాతీయ గీతమైన 'జన గణ మన'కు ఇచ్చిన గౌరవం జాతీయ 'గేయమై'న 'వందేమాతరం'కు కూడా ఇవ్వాలి.

    వందేమాతరం పాడకూడదని ఫత్వా జారీ చెయ్యడం ఖచ్చితంగా ఆ 'గేయాన్ని' అగౌరవపరచినట్లే అవుతుంది.

    ముస్లిములు అందరు దీన్ని ఉల్లంఘిస్తున్నారని నేను ఎప్పుడు అపోహ పడలేదు, చెప్పలేదు. కాని, కొంతమంది జాతీయ 'గేయాన్ని', జాతీయ చిహ్నాలని ఇలా అగౌరవపరిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడం మాత్రం నిజం. మరి ఈ విషయాన్ని non-issue అనడం ఎంత వరకు సమంజసం అన్నది ప్రజలే చెప్పాలి.

    - శివ్.

    ReplyDelete
  19. అయ్యా శివ్ గారూ, shall కు must కూ తేడా తెలుసుకోండి. అలాగే అభిప్రాయానికీ చట్టానికీ కూడా తేడా తెలుసుకోండి. మీరు చెప్పిన statement లో "Government may authorise as occasion arises" అనుంది...ఆ అకేషన్ ఇప్పటి వరకూ రాలేదండీబాబూ! అందుకే మీరెన్నన్నా వందేమాతరం బలవంతంగా ఎవరిచేతా పాడించే క్వశ్చనే లేదు. బలవంతంగా జనగణమణ పాడించినా,దేశభక్తి ఆటోమేటిగ్గా అయితే రాదు. అది మనసులో ఉండాలి. అది అందరికీ ఉంది. కాబట్టి మాటిమాటికీ మీకు నిరూపించుకోబాల్సిన అవసరం ముస్లింలకు అస్సలు లేదు.

    ReplyDelete
  20. భారత మాత (దుర్గాదేవి) పాటని ముస్లింలు కూడా పాడాలని అంటే ఎలా పాడుతారు? ముస్లిం మత పెద్దలు తమ మతం వాళ్ళకే ఆ పాట పాడొద్దు అని ఫత్వా జారీ చేశారు కానీ హిందువులని పాడొద్దు అని కోరలేదు కదా.

    ReplyDelete
  21. అబ్రకదబ్ర గారు, మీరేనా ఆ మాటన్నది? నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది. నిజంగా "జనగణమణ" "బెంగాలీ పాట" - అర్థం కాకుండా ఉందా? అదీ 10 శాతం జనాభాకు కూడా? ఆ పాట కంటే - సారే జహాసె అచ్ఛా జనాభాలో మరింతమందికి అర్థమవుతుందా? ఆ పాటలో "హం బుల్ బులేహ ఇస్ కీ" అంటే ఏమిటి? నాకు నిజంగానే తెలీదు. సరే వదిలేద్దాం.

    బెంగాలీలకు మాత్రమే "జనగణమణ" అర్థమవుతుంది అనుకుందాం. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికంగా వాడబడే భాష బెంగాలీయా, ఉర్దూనా?

    ఠాగూర్ ఐదో జార్జ్ ను పొగడుతూ రాసిన గీతమా?

    - బ్రిటిష్ వాళ్ళిచ్చిన "సర్" బిరుదునే వద్దన్నాయన వాళ్ళ కింగును పొగుడుతూ రాశాడంటారా?

    ReplyDelete
  22. భారత దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే బాష తెలుగు. బెంగాలీ బాష మాట్లాడేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నా దేశ విభజన సమయంలో అప్పటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) కూడా ఇండియా నుంచి విడిపోవడం వల్ల బెంగాలీయుల్లో ఎక్కువ మంది దేశం నుండి విడిపోయారు. పశ్చిమ పంజాబ్ కూడా దేశం నుంచి విడిపోవడం మన దేశంలో పంజాబీ మాట్లాడేవాళ్ళు కూడా తక్కువయ్యారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలుగు బాష మాట్లాడేవాళ్ళ సంఖ్యలో దేశంలో నాలుగవ స్థానంలో ఉండేది. ఇప్పుడు తెలుగు బాష రెండవ స్థానంలో ఉంది.

    ReplyDelete
  23. @శివ్ - వ్యతిరేకించాటనికి గేయానికి గీతం కి తేడా తెలియాలి కాని గౌరవించటానికి ఎందుకు ?
    కొంతమంది జాతీయ 'గేయాన్ని', జాతీయ చిహ్నాలని ఇలా అగౌరవపరిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడం మాత్రం నిజం. >> మాస్టారు జాతీయపతాకాన్ని ఈ నేల మీద తగలపెడుతుంటేనే దిక్కు లేదు ఇక వందేమాతరం పాడకపోతే ఏమి చేస్తారు. అసలు మీరు "ముస్లిములు అందరు దీన్ని ఉల్లంఘిస్తున్నారని " లేదా కొందరు ఉల్లంఘిస్తున్నారని భాద పడకండి , వాళ్ళు అలా చేస్తుంటే మురిసిపోయే జాతి ఒకటుందే వాళ్ళని చూసి భాద పదండి లేకపోతె ఛీ ఛీ , లేదంటారా మాకు లాగ ఇగ్నోర్ చేయండి :)

    ReplyDelete
  24. అయ్యా కత్తి మహేష్ కుమార్ గారు,

    shall కి must కి తేడా నాకు బాగానే తెలుసండి ... కాని రాజ్యాంగం వంటి వాటిలో, ఈ వాక్యం చెప్పినటువంటి సందర్భాలలో shall నే వాడతారు. భారత రాజ్యాంగం మొత్తం మీద (preamble తో సహా) must అనే పదం లేదు shall తప్ప. మరి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించక్కరలేదు అంటారా ? Ten Commandments లో కూడా You shall not murder, steal, commit adultery అని ఉంటుంది. must అనలేదు కాబట్టి ఇవన్ని చేసినా ఫర్వాలేదు అంటారా ఏమిటి కొంపతీసి ?

    చట్టానికి, అభిప్రాయానికి కూడా తేడా నాకు బాగానే తెలుసు. కాని పైన చెప్పినది ఒక అభిప్రాయం కాదు. దేశ ప్రథమ రాష్ట్రపతి అయిన డా. రాజేంద్ర ప్రసాద్ గారు constituent assembly కి ఇచ్చిన వివరణ.

    ఇక పోతే, మీరు ఉటంకించిన "Government may authorise as occasion arises" అనే phrase జన గణ మన కి వర్తిస్తుంది. వందేమాతరం కి కాదు. ముఖ్యమైన 'and' అనే conjunction ఎక్కడ ఉందో పరిశీలనగా చూస్తే మీకే అర్థమవుతుంది. బ్లాగుల్లో, వ్యాఖ్యల్లో, ఆంగ్ల వ్యాకరణం చెప్పించుకునే దుస్థితికి ఇంకా నేను దిగజారలేదు. అయినా, భాషా పండితులు మీకు తెలుసు గాని, లోక జ్ఞానం లేని వాడిని (అన్నమయ్య సినిమా style లో), నాకు ఎట్లా తెలుస్తుంది లెండి ...

    ఇక పిడకల వేట (నారదలోకం బ్లాగ్ స్పేస్ ఆంగ్ల వ్యాకరణం నేర్పేందుకు వాడుకున్నందుకు క్షమాపణలతో :-) ) వదిలేసి రామాయణంలోకి వస్తే , మీరు ముస్లిముల చేత బలవంతంగా వందేమాతరం పాడించనూ వద్దు, వాళ్ళ దేశ భక్తీ నాకోసం ప్రత్యేకంగా నిరూపించనూ వద్దు. కొంతమంది వెధవలు ఇలా బోడి ఫత్వాలు జారీ చేసి వందేమాతరాన్ని అగౌరవపరచకుండా ఉంటే చాలు. స్వస్తి.

    - శివ్.

    ReplyDelete
  25. పై వ్యాఖ్య చేసిన అనానిమాసురా, ఏదో, మనసాగక ఈ వాగుడు అంతే ... ఇక ఆపేస్తా లెండి. :-)

    - శివ్.

    ReplyDelete