Tuesday, November 3, 2009

గిల్లి లెక్కచూసుకున్న డిఎస్ !

`గ్రేటర్' ఎన్నికల కోసం ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చేసిన ప్రకటన చివరకు రసాభాస అయింది.పీఆర్పీతో పొత్తుపెట్టుకోవడాన్ని కాంగ్రెస్ లోని జగన్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అటు ప్రజారాజ్యం ఇటు కాంగ్రెస్ లోని రెండు వర్గాల్లోని చిన్నాచితకా నాయకులు మాటలతూటాలను విసురుకున్నారు. పన్నెండు ఛానెళ్లతో వెలిగిపోతున్న తెలుగు మీడియాకు మాత్రం కడుపారా తిట్లుదొరకడంతో ఆరోజుకి ముష్టాన్నం దొరికినంతగా సంబరపడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం చూశాక ఒక సందేహం కలగకమానదు.
అసలు డీఎస్ ఎందుకు గిల్లినట్టు? ఏమి ఆశించి ఈ రభసకు తెరదీశారు?
పైకి చూడటానికి డిఎస్ తెలివితక్కువగా గిల్లినట్టు కనిపించినా, లోలోపల మాత్రం మహత్తరమైన వ్యూహం ద్యోతకమవుతోంది. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల మధ్య కూర్చున్నప్పుడు డిఎస్ ఈ వ్యూహానికి బీజం వేశారు. జగన్ వర్గంలో ఎంత మంది ఉన్నారు? సీఎల్పీ సమావేశం పెడితే ఎంత మంది చీలిపోతారు? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాల్సిందే. సీఎల్పీ సమావేశం పెట్టి రసాభాస అయ్యేదానికంటే, ముందుగానే బలాబలాలు తేలాలంటే ఓ సమస్యను లేవనెత్తాలి. అందుకే డిఎస్ పథకం ప్రకారం చిరంజీవిని ఒక పావుగా వాడుకోవాలనుకున్నారు. గతంలో వైఎస్సార్ సైతం ఇదే పావును కొంతమేర కదిలించారు. ఆ తరువాత రోశయ్య కూడా చిరంజీవికి ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో చిరు తప్పకుండా తాము విసిరే వలలో పడిపోతారన్న ధీమాను డిఎస్ వ్యక్తం చేశారు. అందకే అధిష్ఠానాన్ని ఒప్పించి పొత్తు వ్యూహంకు తెరదీశారు.
అనుకున్నట్టే జరిగింది. పీఆర్పీతో పొత్తు అనగానే జగన్ వర్గీయులు మండిపడటం ప్రారంభించారు. రఘువీరా, దానం, సబిత, కోమటి వంటి వాళ్లు విరుచుకుపడ్డారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు వత్తాసు పలికారు. కొండా సురేఖ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె అప్పటికే రాజీనామాతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆమె భర్త కొండా మురళి కూడా ధ్వజమెత్తారు.
ఈ సీన్లనన్నింటినీ డిఎస్ - రోశయ్య వర్గం నిశితంగా గమనిస్తూ, జగన్ పక్షాన ఉండే నాయకులు పేర్లను రాసుకోవడం ప్రారంభించింది. జగన్ వర్గీయుల జాబితా తయారుచేసుకునే పనిలో పడింది. ఇప్పుడున్నవేడి తగ్గితే ఈ జాబితాలోని పేర్లు తగ్గుతాయన్న నమ్మకాన్ని అధిష్ఠానానికి తెలియజేసింది. ఇక ఈ జాబితాను చూసుకుని అధిష్ఠానం, జగన్ ని బుజ్జగించాలో, బంధం తెంచుకోవాలో తేల్చుకుంటుంది. డిఎస్ పని ఇక్కడితో ముగిసింది.
జగన్ బాటలో ఎవరు వెళతారో, రోశయ్య పంచన ఎవరు ఉంటారో తేల్చుకోవడం కోసం డిఎస్ రచించిన ఈ పొత్తుల వ్యూహం ఫలించింది. పాపం, మధ్యలో చిరంజీవి రాజకీయంగా మరోమారు ప్లాప్ అయ్యారు.
-కణ్వస

3 comments:

  1. chala baga chepparu sir meru rasindi.
    DS gillindi jagan vargam sakthi telusukovalani.
    Vallaki telusu adistaniki enta sakthi vundo.
    evari support lekapoyina gani oka rossaih to ne mottam prabutvanni nadipistundi
    endukante kendra prabutvam valladi kabatti.
    konta mandiki doubt ravacchu jagan ki sakthi vunte kendra prabutvanne padagottochhu
    kada ani anduke tammudu karnataka lo gali brothers to tera lepadu.

    Akkada govt form chesi konta mandi MP la support ki try cheddam anu kune lope
    congress chusara memu evari pottu anitika prabutvalani erpatu cheyamani ippude
    samketalu pamputunnaru.Enno sarlu enno rashtra prabutvalani kulagottina chartira
    man AICC di.
    Asalu chiranjeevi eppatikina party pedatadani telisina varu padmabhushan endu kichharo
    melanti vignulaki cheppalsina avasaram ledu anukunta.

    Ippati vileenam ,chiranjeevi vudasenata anevi eppudo rachimchina vuhale.
    ranu ranu vileenam kakunda maharashtra tarahalo 50-50 kakapoina 70-30 retilo
    konni samvatsaralu yelatru.

    ReplyDelete
  2. motthaniki chiru malli vp ayyaru.
    chiranjeevi congress tho potthu kosam pakulaadi prp ni thondaralo congress lo vileenam cheyabootunnattu message iccharu

    ReplyDelete
  3. కణ్వస గారూ గిల్లి లెక్క చూసుకున్న డీ.ఎస్ , చిరుతో జగన్ కు 'చెక్' అనే రెండు ఆర్టికల్స్ నేను చదివాను .... అయితే ఆ రెండింటిలో చాలా పరస్పర విరుద్ధ భావాలూ కనిపిస్తున్నాయి, అవి ఏమిటంటే .... చిరుతో జగన్ కి చెక్ పెట్టేవాళ్ళు జగన్ కి ఎందుకు భయ పడతారు ? .... జగన్ కి భయపడేవాళ్ళు ..... అతనికి ఎందుకు చెక్ పెడతారు?. జగన్ కి చెక్ పెట్టే ఉద్దేశ్యం ఉంటే ఖచ్చితంగా చిరుతో పొత్తు పెట్టుకుని ఉండేవాళ్ళు.. కానీ అలా జరగలేదు (ప్రస్తుతానికి ). ఇక జగన్ వైపు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం డీ.ఎస్ గిల్లాడు అని రాసారు. గిల్లితే గిచ్చించు కోవడానికి వాళ్ళేమీ ( ఎమ్మెల్యేలు, ఎంపీలు) తింగారోల్లు కాదు కదా !? వాళ్ళకుండే అంచనాలు వాళ్ళకుంటాయి .... ' సీను' అస్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు బయటపడతారు.

    ReplyDelete