'రాష్ట్రాన్ని విభజించడమంటే,కాగితాన్ని రెండు ముక్కలుగా చించడం కాదు! దానికి బోలెడు తతంగముంది అని ఆ మధ్య పిసిసి మాజీ అధ్యక్షులు కె.కేశవరావు అన్నమాట అక్షరాల నిజం. ఔను! రాష్ట్రవిభజన అనేది చెప్పేంటత సులభంకాదు. ఒక రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం సుదీర్ఘమైన కార్యక్రమాన్ని నిర్దేశించింది. విభజనకు ముందు ఎన్నో ప్రశ్నలకు,లేదా ఏర్పడబోయే సమస్యలకు సమాధానాలను కూడా సిద్ధం చేసు కోకుండా విభజన గురించి నిర్ణయించడమంటే, పైకి వచ్చే మార్గం చూసుకోకుండా నూతిలోదూకడం వంటిదే! ఆ ప్రశ్నలు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు. అవి మొత్తం రాష్ట్రానికి సంబంధించినవి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవశ్యం ఆలోచించవలసినవి.
1953లో సమష్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినపుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో అప్పటి నాయకులు, ప్రజలు ఎదుర్కొనవలసిన సమస్యలను స్వయంగా చూసినవాడిని.ఆప్రశ్నలు
1.ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే, మిగిలిన ఆంధ్ర ప్రాంతానికి రాజధాని ఏది?1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కోస్తా జిల్లాలలో విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య వుండాలని ఆప్రాంతంవారు, కాదు, రాయలసీమలోనే వుండాలని ఆప్రాంతంవారు ఆందోళనలే చేశారు.చివరికి,1937లో దేశోద్ధారక కాశీనాథుని శివనాగేశ్వరరావు గృహం 'శ్రీబాగ్‌లో సర్కారు,రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం,రాయలసీమ వారు రాజధానినే కోరుకున్నందున, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
2.ఇప్పుడు కూడా రాయలసీమవారు అదే కోరవచ్చు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని రాయలసీమ హక్కుల సమితి ఎప్పటి నుంచో అంటున్నది.అసలు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 1953కు పూర్వం నుంచి రాయలసీమ మహాసభ కోరుతూ వచ్చింది.ఆతరువాత భారత రాష్ట్రపతి పదవి,అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిత్వం వహించిన నీలం సంజీవ రెడ్డి ఒక దశలో రాయలసీమ మహాసభకు అధ్యక్షులుగా వున్నారు. రాష్ట్ర విభజన జరిగితే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనో లేదా రాజధానిని కర్నూలులోనో, తిరుపతి లోనో,మరొకచోటో నెలకొల్పాలని ఆ ప్రాంతం వారు కోరవచ్చు.
3. మరి,విశాఖపట్నం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలతో,నౌకానిర్మాణ కేంద్రం,ఉక్కు ఫ్యాక్టరీలతో అంతర్జాతీయ నగరంగా పరిఢవిల్లుతున్నదని,కాబట్టి దానినే ఆంధ్రరాష్ట్ర రాజధానిని చేయాలని ఆ నగరవాసులు, లేదా ఉత్తరాంధ్ర జిల్లాల వారు కోరవచ్చు.
4. అన్నట్టు, రాష్ట్రవిభజన జరిగితే,శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలతో 'ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా వినవస్తున్నది.నిజానికి,విశాఖపట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ఉక్కుమనిషి సర్దార్ లచ్చన్న 1953లోనే కోరారు.
భవనాలకు సొమ్ము ఏది?
5.ఎక్కడ కొత్త రాష్ట్రరాజధాని పెట్టినా,హైదరాబాదులో వలె ప్రభుత్వ కార్యాలయాలకు,అసెంబ్లీ,సెక్రటేరియట్‌లకు, హైకోర్టుకు,ఇంకా ఎన్నింటికో బ్రహ్మాండమైన భవనాలు కావాలి.వాటిని నిర్మించడానికి ఎన్నివేల కోట్ల రూపాయలు కావాలి. వీటిని ఎవరిస్తారు?ఆంధ్ర ప్రాంతంలో ఒక ఆధునిక రాజధానీ నగరాన్ని నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది? అంతకు వరకు కొత్త రాష్ట్ర రాజధాని ఒక 'కాందిశీకుల శిబిరంగానే వుండవలసిందేనా? అని ఆ ప్రాంతం వారు అడగరా?'రాష్ట్ర విభజన జరిగితే,అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలిపితే,మాకు నేత్రావతి నదీ జలాలు పుష్కలంగా లభించి,మేము బాగా అభివృద్ధి చెందుతామని ఆ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ముస్లింల కోర్కె
6 'ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకం,రాష్ట్ర విభజన చేసేటప్పుడు మమ్మల్నికూడా సంప్రదించండిఅని ఆ మధ్య ఢిల్లీలో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో,కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు నగరంలో తమ ప్రాబల్యం చెలాయిస్తున్న ఎమ్‌ఐఎమ్‌కు చెందిన ఎమ్‌పి అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.7 అంతేకాదు రాష్ట్రాన్ని రెండు ముక్కలో,మూడు ముక్కలో చేస్తే దాదాపు 60 లక్షల జనాభా వున్న హైదరాబాదు నగ రాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ కూడా ఎమ్‌ఐఎమ్ నుంచి వినిపించడంలేదా?8.'హైదరాబాద్‌లేని రాష్ట్రం తలలేని మొండం వంటిది.ఆమహానగరంలేని ప్రత్యేక రాష్ట్రం మాకెందుకని విభజనవాదులు ఇదివరకే ధ్వనించారు.హైదరబాద్ నగరం చుట్టూ వున్నది తెలంగాణా ప్రాంతమే కాబట్టి హైదరాబాద్‌ను ఎలా వేరు చేస్తారని వారివాదన.అది కూడా వాస్తవమే.9 'హైదరాబాద్ నగరాన్ని ఈ స్థాయికి తీసుకు రావడానికి మాపెట్టుబడి,మాకృషి ప్రధానకారణం. దాన్ని ఎలా వదిలివేస్తామని ఆంద్ర ప్రాంతం వారి వాదనగా కనిపిస్తున్నది.10 రాష్ట్ర విభజన జరిగితే,కృష్ణా,గోదావరి నదీజలాలపై ప్రాజెక్టులపై నిర్మాణం సమస్య మరింత జటిలం కావచ్చు.అది రెండు ప్రాంతాల మధ్య నిత్య వివాదంగా పోరాటంగా పరిణమించవచ్చునని నీటి పారుదల సమస్యల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా,ఈ సమస్యలు, ప్రశ్నలనింటినిచూస్తే, రాష్ట్రవిభజన వ్యవహారం తేనెతుట్టెను కదపడం వంటిదని బోధపడటం లేదా?
- తుర్లపాటి కుటుంబరావు (`వార్త' సౌజన్యంతో)
చెత్త రాతలు మానెయ్యరా వెధవ!
ReplyDeleteనీకు దమ్ముంటే - తెలంగాణ ఉద్యమానికి మద్దత్తివ్వు.
లేకపోతే మూసుకుని కూర్చో.
కాదుకూడదు అని ఇంకా సమాధానాలు కావాలంటె - తెలంగాణ వెళ్ళి అడుగు చెబుతారు సమాధానాలు.
Mr. Anonymous
ReplyDeleteనీ అసలు రూపం బయట పెట్టకుండా అజ్ఞాత రూపం లో తిట్టే నువ్వు ఉద్యమం గురించి మాట్లాడడం వింతగా ఉంది. వ్యాసకర్త లను వెధవ చవట అని తిట్టి మళ్ళా ఇది మా తెలంగాణా యాస బాస అని సమర్ధించుకునే దౌర్భాగ్యం నుండి బయటికి రండి ముందు
ఏ గుంటూరో.. ఏ కర్నూలో విజయవాడో రాజధాని అయితే పరిస్థతి దారుణంగా ఉంటుంది. హైదరబాద్ లో భిన్న సంస్క్రతులున్నయి. అందరూ కలిసి హాయిగా సహజీవనం చేస్తారు. హమారా షెహర్ అని ఈ రోజు నగరంలో అడుగుపెట్టినోడు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాడు. అంత స్వేఛ్చుంది ఈ పావురాల నగరంలో. ఏ గుంటూర్లోనూ.. కర్నూల్లోనూ అదుంటుందనుకోను. అందుకే ప్యారా హైదరాబాదే తెలుగోళ్ల రాజధానిగా ఉండాలి. దీనికో చరిత్ర ఉంది. సంస్క్రతి ఉంది. తెలంగాణ, రాయలసీమ, డెల్టా.. యూపీ బీహారీ.. గుజరాతీ... ఇలా ఎక్కడివాడైనా ఇక్కడ స్వేచ్ఛగా తిరగగలడు. కాబట్టి ఈ హైదరాబాద్ ను కావాలంటున్న నేను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిని.
ReplyDelete@ అఙాత
ReplyDeleteఆ దమ్ము మీకే ఉండి ఉంటే ధైర్యంగా పేరుతోనే కామెంట్ రాసేవారు. సరే ఇంతకీ వ్యాసకర్త అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా? ముఖ్యంగా సమస్య వచ్చేది హైదరాబద్ విషయంలోనే. ఇప్పటిదాకా హైదరబాద్ ని ఉమ్మడి సొమ్ముతో (మీరే చెపుతున్నట్టు అయితే తెలంగాణేతర ప్రాంతాల వారి సొమ్ముతో, ఎందుకంటే తెలంగాణా అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉందని కదా మీ పోరాటం) అభివృద్ధి చేసి ఇప్పుడు రాష్ట్ర విభజన అంటూ దాన్ని మీరు తీసేసుకోడం ఎంతవరకు న్యాయం? ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయమై సాధ్యాసాధ్యాలను మాత్రమే ఇక్కడ చెప్పారు. వేర్పాటుకు వ్యతిరేకమా? సానుకూలమా? అని ఇక్కడ ఎవరూ చెప్పలేదు. కాబట్టి మీరు అంత ఆవేశపడాల్సిన పని లేదు. మీకు తెలిస్తే పై ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
దాష్ బోర్డు లో కి వెళ్లి సెట్టింగు లో కి వెళ్లి కామెంట్స్ అనే ట్యాబు ఉంటుంది
ReplyDeleteఅందులో రెండవ ఆప్షన్ "హూ కెన్ కామెంట్" అని ఉంటుంది
Who Can Comment?
Anyone - includes Anonymous Users
"Registered Users - includes OpenID"
Users with Google Accounts
Only members of this బ్లాగ్
అని సెలెక్ట్ చెయ్యండి. ఊరూ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే వెధవలు పోరాటం చేసానని ఆరాటమొక్కటి.
@ December 7, 2009 12:24 PM సమయాన వ్యాఖ్యానించిన వెధవకి : వెధవా! ముందు నీ ఊరూ పేరు చెప్పుకోరా ఆ తర్వాత తెలంగాణా అని చెప్పు కుందువు గాని.
ReplyDeleteకామెంటు వ్రాయడానికి భయపడే నువ్వు ఉద్యమం ఏమి చేస్తావురా ?
do you guys think that finding a new capital is really an issue? how come so many new states were formed since 1952? how did Jarkhand find a capital when it was formed out of Bihar?
ReplyDeleteఅసలు దౌర్భాగ్యం, తుర్లపాటి వారిది.
ReplyDeleteఇంత బ్రతుకు బ్రతికి, ఇక్కడొక అజ్ఞాతి చేత "వెధవ" అనిపించుకోవడం.
ఆయన లాంటి వక్త గురించి తెలియని సన్నాసుల తరం ఇది!
రాష్ట్రమంటూ విడిపోతే మా హైదరాబాద్ స్టెట్ మాకు కావాల్సిందే. ఇంకెంతకాలం నీడకోసం వచ్చాం అని చెప్పి మా మీద పరాయివాళ్ల పెత్తనం, మా ఆస్థులను నాశనం చేయటం. ఉంటే గింటే శాంతిగా ఇక్కడ ఉండండి ఆంగ్లో ఇండియన్ల దగ్గరనుండి ఆఫ్రికా వాళ్ల వరకూ అందర్నీ భరించే శక్తి మా హైదరాబాద్ కు ఉంది, అందరూ శాంతి గా బతుకుదామనుకొంటే, లేక లొల్లి పెట్టుకొందామంటే , మీ మీ కరీమ్నగర్ లకో, కడపకో, ఇంకోచోటుకో పోయి పేట్టుకొండి.
ReplyDeleteఅందరిలాగే మా ఆదాయం మాకే కావాల, మా వనరులు మీద పెత్తనం మాకే కావాల.
జై హైదరాబద్ స్టెట్, జై దానం, జై ముఖెష్.
jai samaikyandra rastram vidipothe memu 107 mandi okkasariga atmahaccha cheskuntam kabbadhhar
ReplyDeleteHyderabad individual state ga vundala leda ani voting pedite baguntundi. prajala abhiprayam prakaram cheste baguntundi. Anavasaram ga tittukovaddu.
ReplyDeleteTELANGANA IVVTAMU CORRECT AYITHE KASHMIR PAKISTAN KU ENDUKU IVVAKUDADU.
ReplyDeleteTELANGANAKU ANYAYAM JARIGINDI ANTUNNARU, ANDHRA, RAYALASEEMA, KOSTA VALLAKI NYAYAM JARIGINDA??????? JARUGUTUNDA.
ReplyDeleteAKHANDA TELUGU RASTRAM- LONGLIVE
ReplyDeleteThere is a need to decentralise the power.In our state create 15 new districts.
ReplyDeletemee andaru nirbhayam ga mee abhiprayamulani cheppalani anukunte ee website lo login ayyi mee abhiprayamulu cheppandi http://ourtelangana.com
ReplyDelete