Saturday, February 6, 2010

ఫోకస్: గోవింద`గానం'


ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది భక్తులు సమర్పించిన కానుకల సొమ్మేగాని టిటిడి చేర్మన్ గారి జేబులోది కాదు.పైగా లతాజీని ఆస్థాన విద్వాంసురాలుగా అదే సభలో ప్రకటించారు. ఇప్పటికే బాలమురళీక్రిష్ణ టిటిడి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు. మరి లతాజీ ఎందుకు ? ఎవరి ముచ్చట తీర్చేందుకు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది.
- `నారదలోకం' అభిమాని
హైదరాబాద్

1 comment:

  1. గతముప్ఫై సంవత్సరాలుగా చదువుతున్న సినిమా పత్రికలు వగైరాల ద్వారా గ్రహించిన సమాచారం ఏమనగా లత గారు ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటీ ఛారిటీ కార్యక్రమాలతోసహా ఎక్కడా ఉచితంగా పాడలేదు,పాడరు కూడా,పాడినందుకు గాను పారితోషికం కూడా చెక్కులద్వారా తీసుకోరు.ఎప్పుడో వచ్చిన సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా అన్నపాటకు ఆమెకు అందిన పారితోషికం ఆరోజుల్లో అక్షరాలా పదివేలనీ,అదీ నిర్మాత కనికరించమని వేడుకున్నాక అనీ చదివా,అసలామె అడిగిన దానికి ఆరోజుల్లో ఒక చిన్న సినిమా తీయచ్చని కూడా చదివాను.యేతావాతా చెప్పొచ్చేమనగా ఆవిడ మన రాష్ట్ర అతిధిగా వచ్చారు,ఆమెకిచ్చింది చిన్న చిన్న కానుకలు.

    ReplyDelete